చంద్రహాస (1941 సినిమా)
చంద్రహాస (1941 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎన్.ఎల్.రంగయ్య |
---|---|
కథ | తురగా వెంకట్రామయ్య |
తారాగణం | జి.ఎన్.స్వామి, రావు బాలసరస్వతి, టంగుటూరి సూర్యకుమారి రాజారావు నాయుడు బాలసరస్వతి బళ్లారి వేదవల్లి రమాదేవి ఉషారాణి పులిపాటి మాధవపెద్ది |
ఛాయాగ్రహణం | ప్రభాకర్ |
నిర్మాణ సంస్థ | వాణీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
వాణీ పిక్చర్స్ పతాకాన 'చంద్రహాస' చిత్రం ఎన్.ఎల్.రంగయ్య దర్శకత్వంలో రూపొందింది. సూర్యకుమారి, జి.ఎన్.స్వామి ముఖ్య పాత్రధారులు.[1] ఈ చిత్రానికి సంగీతం మోతిబాబు అందించారు.
కథ
[మార్చు]మహామంత్రి కావడంతో తృప్తిలేని కుంతల రాజ్యపు మహామంత్రి కుంభీనసుడు రాజకుటుంబాన్ని నాశనం చేసి తన కొడుకును చక్రవర్తిని చేయదలంచి నడిపిన కథ అంతా తన కూతురు విషయ కంటి కాటుక రేఖా ప్రయోగంతో తలక్రిందులై చంద్రహాసునికే రాజ్యం దక్కుతుంది. మేనల్లుడికి తనకూతుర్నిచ్చుకొని కండ్లారా చూద్దామనుకొన్న మహారాజు మనోరథాన్ని మంటగలపడానికి మహామంత్రి కుట్రపన్నుతాడు.
తారాగణం
[మార్చు]- జి.ఎన్.స్వామి
- టంగుటూరి సూర్యకుమారి
- రావు బాలసరస్వతి దేవి
- రాజారావు నాయుడు
- వేదవల్లి
- రమాదేవి
- రత్నం
- ఉషారాణి
- పులిపాటి వెంకటేశ్వర్లు
- మాధవపెద్ది
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎన్.ఎల్.రంగయ్య
- సంగీతం: మోతిబాబు
- కధ: తురగా వెంకట్రామయ్య
- ఛాయా గ్రహణం: ప్రభాకర్
- గాయనీ గాయకులు: టంగుటూరి సూర్యకుమారి, రావు బాలసరస్వతి దేవి, జి.ఎన్.స్వామి, వేదవల్లి, రమాదేవి, పులిపాటి, రత్నం
- నిర్మాణ సంస్థ: వాణి పిక్చర్స్
- విడుదల:10:11:1941.

పాటలు
[మార్చు]1. ముదముగా ముదముగా వనరము- టంగుటూరి సూర్యకుమారి
2. హాయి నొస్సంగే సుఖాల వెన్నెల రేయి
- టంగుటూరి సూర్యకుమారి, జి. ఎన్. స్వామి
3.ఆహా ఎటుల్ చేనుండెన్ ధనకాంక్షాచే- టంగుటూరి సూర్యకుమారి,
4.జయీంపగలేరా విరోధి వాహినీ కదనరంగ- వేదవల్లి, రమాదేవి
5.జయ జయాళీ జై భవాని సంకటహరీ శంకరురాణి -
6.జవ్వనమే శ్రేష్ఠమైనదహో వారె వారె ఎవ్వరికైనా- రావు బాలసరస్వతి దేవి
7 .తలచిన తలపులే పలికిన పలుకులే వలపుల జలధి - వేదవళ్లి
8.నా నాథా గుణ సనాథా ఓ నా నాథా -
9.ఈ కసాయి జగమ్ము మెట్లు సృష్టించితివి -
10.ప్రమాధావనంబు గన నేడు అమితానంద- టంగుటూరి సూర్యకుమారి
11.వచ్చినాడే నవవసంతుడు తెచ్చినాడే పూలపండగా - రత్నం
12.సుగంధ పుష్ప సుమంబుల్ శుభము గూర్చు- రావు బాలసరస్వతి దేవి
13.చిరదౌహిత్ర ఫలంబు గోరి నియామించెన్ నన్ను- (పద్యం) జి.ఎన్.స్వామి
14.తెరువనేటికీ నిప్పు తెరగన్ను నొకమారు (పద్యం)- పులిపాటి వెంకటేశ్వర్లు
15.పాడిపంటలు నలరు సామ్రాజ్యలక్ష్మి- (పద్యం) పులిపాటి వెంకటేశ్వర్లు.
మూలాలు
[మార్చు]. 2. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.