చంద్రిమా సాహా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంద్రిమా సాహా
వృత్తిమహిళా శాస్త్రవేత్త

చంద్రిమా సాహా తండ్రి ఉపాధ్యాయుడు. ఆయన శాస్త్రవేత్త కాకపోయినా చంద్రిమా సాహా కొరకు చిన్న ప్రయోగశాల ఏర్పాటుచేసి ఇచ్చాడు. అందులో ఒక చిన్న మైక్రోసేపు, బన్‌సెన్ బర్నర్, టెస్ట్‌ట్యూబులు (పరీక్షా నాళిక), కొన్ని రసాయనాలు ఉండేవి. ఆమె తండ్రి ఆమెకు సంపూర్ణ విద్య అందించాలని భావించాడు. చంద్రిమా సాహా తండ్రి వద్ద వడ్రంగి విద్య, ఫోటోగ్రఫీ, తోటపని, సంప్రదాయ సాహిత్యం చదవడం నేర్పించాడు. అలాగే నీటి మడుగులోని నీటి చుక్కను మైక్రోస్కోపు కింద చూపడం, చిన్న తరహా రేడియో సర్క్యూట్ కనెక్ట్ (అనుసంధానం) చేయడం వంటివి చంద్రిమా సాహా తన తండ్రితో కలిసి తయారుచేసి నేర్చుకునేది. ఫలితంగా చిన్న వసయసులోనే ఆమె మనసులో సైంటిఫిక్ పరిశోధనా బీజాలు బలంగా నాటుకున్నాయి. మరొక వైపు ఫైన్‌ఆర్ట్స్ కళాకారులతో తల్లితండ్రుల ద్వారా చిన్నవయసు నుండి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇంట్లో తరచుగా ప్రఖ్యాత కళాకారుల సమావేశాలు చర్చలు జరుగుతుంటాయి.

ప్రత్యేక ఆసక్తి[మార్చు]

వయసు పెరుగుతున్నకొద్దీ ఆసక్తులు కూడా అధికం అయ్యాయి. ఇంజెక్టులను పరిశీలించడానికి ఆమె అధికసమయం వెచ్చించేది. అలాగే చిన్న జంతువులను సేకరించేది. గొంగళి పురుగులను సేకరించి అవి సీతాకోక చిలుకలుగా మారడాన్ని పరిశీలించేది. అలాగే ఫోటో ఆల్బంలను తయారుచేసేది. చంద్రిమా సాహా వివిధజాతుల పాములను కూడా సేకరించి ఇంట్లో పెట్టడం ఆమె తల్లికి అసౌకర్యం కలిగించినా కుమార్తె జంతుప్రేమకు ఆమె ఆదరణ చూపించింది. గొంగళి పురుగులు సితాకోక చిలుకలు, పేఉరుగుల సేకరణకు ఆకర్షించబడిన చంద్రిమా సాహా బయాలజీ ఉపాధ్యాయురాలు ఆమెను ప్రోత్సహిస్తూ వచ్చింది. చిన్నవయసు అభిరుచులు సైంటిఫిక్‌గా, మానసింకంగా మనిషిమీద ప్రభావం చూపుతాయని చంద్రిమా సాహా అభిప్రాయపడింది.

కాలేజ్ క్రికెట్[మార్చు]

చంద్రిమా సాహా స్కూలు చదువు పూర్తిచేసిన తరువాత కూడా ప్రకృతి ఆరాధన కొనసాగింది. ఆసమయంలో ఆమె ఎకాలజిస్టు (కీటకాల శాస్త్రం) కావాలని కలల్లుకన్నది. కాలేజ్ అధ్యయనసమయంలో ఆమె సరికొత్త అభిరుచులను ఏర్పరచుకొన్నది. ఆమె బెంగాల్ వుమన్ క్రికెట్‌టీం కేప్టెన్ అయింది. టీం ఎక్టివిటీ ఆమెకు ఉత్సాహం కలిగిచింది. చంద్రిమా సాహా టీం వరుసగా 3 సంవత్సరాలు జాతీయ చాంపియన్‌షిప్ సాధించింది. బాల్యం నుండి కొనసాగిన సైన్సు ఆసక్తి క్రీడాసక్తిని వెనక్కి నెట్టినప్పటికీ శీతాకాలపు క్రికెట్ టోర్నమెంటుకు ఆల్‌ఇండియా రేశియోలో కామెంట్రీచెపుతూ ఉండేది. చదువు కారణంగ ఆమె ఎప్పుడూ జోనల్ టొర్నమెంట్లలో పాల్గొనలేదు.

పోస్ట్ గ్రాజ్యుయేషన్[మార్చు]

చంద్రిమా సాహా పోస్ట్ గ్రాజ్యుయేషన్‌లో ఎండో-క్రినాలజీని ప్రధానాంశంగా చేసుకున్నది. యునివర్శిటీ అధ్యయనం పూర్తి అయిన తరువాత రిసెర్చ్ ప్రయత్నాలు మొదలైయ్యాయి. తరువాత ఆమె ఈవెంట్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ప్రధానాశంగా తీసుకుని రీసెర్చ్ చాఏయాలని నిశ్చయించుకున్నది. తరువాత ఆమెకు " ఇండియన్ ఇన్శ్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ " లాబరేటరీలో పనిచేయడానికి అవకాశం లభించింది. ఆమె డాక్టొరల్ స్టడీస్ పూర్తిచేసిన తరువాత ఫోర్డ్‌ఫౌండేషన్ ఫెలోషిప్పుతో యునైటెడ్ స్టేట్స్‌లోని " కాంసాస్ యూనివర్శిటీ మెడికల్ సెంటర్లో పరిశోధన కొనసాగించడానికి అవకాశం లభించింది. అక్కడ ఆమె " ఫిమేల్ రీప్రొడక్టివ్ ఫిజియాలజీ " లో పరిశోధన కొనసాగించిది. ఖాళీగా ఉండే అమెరికన్ వీధులు కొలకత్తాలోని జనసందోహంతో పోల్చి చుస్తే నిరాశపరచినప్పటికీ చురుకుగా పనిచేసే లాబరేటరీ మాత్రం ఉత్సాహభరితంగా మారింది. తరువాత ఘట్టం పరిశోధనల కొరకు ఆమె న్యూయార్క్ లోని రాక్‌ఫెల్లర్ యూనివర్శిటీ కేంపస్‌లో ఉన్న " ది పాపులేషన్ కౌంసిల్‌లో " చేరి పరిశోధనలు కొనసాగించింది. రెండు సంవత్సరాలకాలం విజయవంతంగా పరిశోధనలు సాగించిన తరువాత ఆమె భారతదేశం తిరిగి వచ్చింది.

భారతడేశం తిరిగి రాక[మార్చు]

చంద్రిమా సాహా భారతడేశానికి తిరిగి వచ్చిన తరువాత ఢిల్లీ లో ఉన్న " నేషనల్ ఇంస్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ " లో చేరింది. సరికొత్తగా స్థాపించబడిన సంస్థ కనుక ప్రారంభకాలంలో తీవ్రసమస్యలు ఎదురైనా చివరకు వాటిని అధిగమించి పది సంవత్సరాలకాలం అందులో పనిలో కొనసాగింది.

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  • [1] ఈ లింకులో ఆయా శాస్త్రవేత్తలు స్వయంగా వ్రాసిన వ్యాసాలు ఉన్నాయి. వాటి నుండి వికీపీడియాకు అనుకూలంగా.