చంపకరామన్ పిళ్ళై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చంపకరామన్ పిళ్ళై
జననం1891 సెప్టెంబరు 15
మరణం1934 మే 26
నాజీ జర్మనీ
ఇతర పేర్లుచంపక్
బెర్లిన్ కమిటీ, తాత్కాలిక భారత ప్రభుత్వం
ఉద్యమంభారత స్వాతంత్ర్యోద్యమం, భారత జర్మను కుట్ర

 

చంపకరామన్ పిళ్లై, అలియాస్ వెంకిడి, [1] (1891 సెప్టెంబరు 15 - 1934 మే 26) భారత రాజకీయ కార్యకర్త, విప్లవకారుడు. [2] కేరళలోని త్రివేండ్రమ్‌లో తమిళ తల్లిదండ్రులకు జన్మించిన అతను యవ్వనంలో యూరప్‌కు వెళ్లిపోయాడు, అక్కడ తన జీవితాంతం భారతీయ జాతీయవాదిగామ్ విప్లవకారుడిగా గడిపాడు. [3]

అడాల్ఫ్ హిట్లర్‌తో పడిన గొడవతో సహా అతని జీవితం వివాదాల మయం. అయినప్పటికీ, మరణించిన వెంటనే ఐరోపాలో అతని జీవితం గురించిన సమాచారం అస్పష్టమైపోయింది. ఇటీవలి సంవత్సరాలలోనే కొంత సమాచారం బయటకు వచ్చింది. [1]

స్వాతంత్య్రానికి పూర్వం జై హింద్ [1] అనే వందన నినాదాన్ని చంపకరామన్ పిళ్లై రూపొందించారు. ఈ నినాదం ఇప్పటికీ భారతదేశంలో విస్తృతంగా ఉపయోగించబడుతోంది.

జీవితం తొలి దశలో[మార్చు]

కేరళ రాష్ట్రం లోని ట్రావెన్‌కోర్ రాజ్యపు రాజధాని త్రివేండ్రంలో ఒక తమిళ కుటుంబంలో పిళ్లై జన్మించాడు. అతని తల్లిదండ్రులు, చిన్నస్వామి పిళ్లై, నాగమ్మ. వాళ్ళు నంజిల్‌నాడుకు చెందినవారు (ప్రస్తుత కన్యాకుమారి జిల్లాలో ఉంది). [2]

ఐరోపాలో[మార్చు]

పిళ్లై 1910 అక్టోబరు నుండి 1914 వరకు ETH జ్యూరిచ్‌లో ఇంజనీరింగ్‌లో డిప్లొమా చదివాడు. మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైన తరువాత, అతను ఇంటర్నేషనల్ ప్రో-ఇండియా కమిటీని స్థాపించాడు. దాని ప్రధాన కార్యాలయాన్ని జ్యూరిచ్‌లో స్థాపించాడు. 1914 సెప్టెంబరులో దానికి తనను తాను అధ్యక్షుడిగా నియమించుకున్నాడు. అదే కాలంలో బెర్లిన్‌లో జర్మనీలోని భారతీయ ప్రవాసుల సమూహం భారత స్వాతంత్ర్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సమూహంలో వీరేంద్రనాథ్ చటోపాధ్యాయ, మహాత్మా గాంధీ, భుపేంద్రనాథ్ దత్తా, ఎ. రామన్ పిళ్లై, తారకనాథ్ దాస్, మౌలవి బర్కతుల్లా, చంద్రకాంత్ చక్రవర్తి, ఎం. ప్రభాకర్, బీరేంద్ర సర్కార్, హేరంబా లాల్ గుప్తా ఉండేవారు. 

1914 అక్టోబరులో పిళ్లై బెర్లిన్ వెళ్లి బెర్లిన్ కమిటీలో చేరాడు. ఐరోపాలో అన్ని భారతీయ అనుకూల విప్లవ కార్యకలాపాలకు మార్గదర్శక, నియంత్రణ సంస్థగా తన అంతర్జాతీయ ప్రో-ఇండియా కమిటీతో విలీనం చేసాడు. లాలా హర్ దయాళ్ కూడా ఉద్యమంలో చేరడానికి ఒప్పించాడు. జర్మన్ శిబిరాల్లో ఉన్న భారత యుద్ధ ఖైదీలకు జర్మనీ పట్ల అనుకూల ప్రచారం చేసేందుకు ఈ ఇద్దరూ జర్మనీకి చెందిన తూర్పు ఇంటలిజెన్స్ బ్యూరోకు సహకరించారు. [4] ఆమ్స్టర్‌డామ్, స్టాక్‌హోమ్, వాషింగ్టన్ , యూరప్, అమెరికాలోని అనేక ఇతర ప్రాంతాలలో దీనికి శాఖలు ఏర్పడ్డాయి. 

మద్రాసుపై SMS ఎమ్డెన్ బాంబు దాడి[మార్చు]

1914 సెప్టెంబరు 22 న, కెప్టెన్ కార్ల్ వాన్ ముల్లర్ నేతృత్వంలో SMS ఎమ్డెన్ అనే జర్మన్ యుద్ధనౌక, మద్రాసు తీరం వద్ద చేరి, హార్బర్ సమీపంలో ఉన్న సదుపాయాలపై బాంబు దాడి చేసి తిరిగి సముద్రం లోకి వెళ్ళిపోయింది. ఈ ఆకస్మిక దాడి బ్రిటిషు వారిని ఆశ్చర్యపరచింది. SMS ఎమ్డెన్‌లో స్వయంగా ఉండి పిళ్లై, జర్మన్ దాడిని సమన్వయపరిచాడని అతని కుటుంబం పేర్కొంది. అయితే ఇది అధికారిక అభిప్రాయం కాదు. ఏదేమైనా, మద్రాస్‌లో SMS ఎమ్డెన్ బాంబు దాడిలో పిళ్లై, కొంతమంది భారతీయ విప్లవకారుల హస్తం ఉందని విస్తృతంగా భావిస్తారు. [2] [1]

యుద్ధ కార్యకలాపాలు[మార్చు]

భారత స్వాతంత్ర్య కమిటీ, అమెరికాలో హిందూ-జర్మన్ కుట్ర కేసులో అనే కుట్ర కేసులో గద్దర్ పార్టీతో కలిసి పనిచేసింది. కైసర్ విల్‌హెల్మ్ II కింద ఉన్న జర్మనీ విదేశీ కార్యాలయం, ఈ కమిటీ చేసిన బ్రిటిషు వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు సమకూర్చింది. చంపకరామన్, ఎ. రామన్ పిళ్లై (ఈ ఇద్దరూట్రావెన్‌కోర్ కు చెందిన వారే, ఇద్దరూ జర్మనీ విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులే) కలిసి కమిటీలో పనిచేశారు. ఆ తరువాత పిళ్లై, భారత జాతీయ ఆర్మీ చీఫ్ సుభాష్ చంద్రబోస్‌తో పొత్తు పెట్టుకున్నాడు.

అప్పట్లో గొట్టింగెన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉన్న ఎ. రామన్ పిళ్లైకు పిళ్లై రాసిన అనేక లేఖలను రామన్ పిళ్లై కుమారుడు రాస్‌కోట్ కృష్ణ పిళ్లై భద్రపరిచాడు. 1914 - 1920 మధ్య జర్మనీలో పిళ్లై జీవితంలోని కొన్ని అంశాలను ఈ లేఖలు వెల్లడిస్తాయి. 1914 జూలైలో రాసిన ఒక లేఖలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోని భారతీయ సైనికులను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి పోరాడాలని పిలుపునిచ్చింది.

మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమి తరువాత, పిళ్లై జర్మనీలో ఉండి, బెర్లిన్‌లో ఒక ఫ్యాక్టరీలో టెక్నీషియన్‌గా పనిచేశాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ వియన్నా సందర్శించినప్పుడు, పిళ్లై అతడిని కలుసుకుని తన కార్యాచరణ ప్రణాళికను వివరించాడు.

భారత తాత్కాలిక ప్రభుత్వ విదేశాంగ మంత్రి[మార్చు]

చెన్నైలో చంపకరామన్ విగ్రహం

రాజా మహేంద్ర ప్రతాప్ అధ్యక్షుడిగా, మౌలానా బర్కతుల్లా ప్రధాన మంత్రిగా, ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వంలో పిళ్లై భారత విదేశాంగ మంత్రిగా పనిచేసాడు. అయితే, యుద్ధంలో జర్మన్ల ఓటమి చెందడమ్ ఈ విప్లవకారుల ఆశలను భగ్నం చేసింది. బ్రిటిషు వారు 1919 లో వాళ్ళను ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు నెట్టేసారు.

ఈ సమయంలో, జర్మన్లు తమ స్వంత ప్రయోజనాల కోసం భారతీయ విప్లవకారులకు సహాయం చేస్తున్నారు. ఉమ్మడి శత్రువుపై పోరాటంలో తామిద్దరం సమాన భాగస్వాములమని జర్మన్లకు భారతీయులు స్పష్టం చేసినప్పటికీ, జర్మన్లు మాత్రం విప్లవకారుల ప్రచార కృషిని, సైనిక మేధస్సునూ తమ సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించాలనుకున్నారు. [4]

1907 లో, "జై హింద్" అనే పదాన్ని పిళ్లై కాయించాడు. [5] [6] అబిద్ హసన్ సూచన మేరకు 1940 లలో భారత జాతీయ సైన్యపు నినాదంగా స్వీకరించారు. [7] భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, అది జాతీయ నినాదమైంది. [8]

వివాహం, మరణం[మార్చు]

1931 లో, మణిపూర్‌కు చెందిన లక్ష్మీ బాయిని పిళ్లై బెర్లిన్‌లో కలుసుకున్నాడు. దురదృష్టవశాత్తు, వారు కొద్దికాలం మాత్రమే కలిసి జీవించారు. పిళ్లై త్వరలోనే అనారోగ్యానికి గురయ్యాడు. దీర్ఘ కాల విషప్రయోగం జరిగిన లక్షణాలు అతనిలో కనిపించాయి. అతను చికిత్స కోసం ఇటలీకి వెళ్లాడు. పిళ్ళై 1934 మే 28 న బెర్లిన్‌లో మరణించాడు. 1935 లో లక్ష్మీబాయి, పిళ్లై అస్థికలను భారతదేశానికి తీసుకువచ్చింది. తరువాత వాటిని పూర్తిస్థాయి ప్రభుత్వ గౌరవాలతో కన్యాకుమారిలో నిమజ్జనం చేశారు. [9] అతని అస్థికలను అతని కుటుంబానికి చెందిన నంజిల్‌నాడు ( కన్యాకుమారి) లో చల్లాలని పిళ్లై ఆఖరి కోరిక. [2]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 Indugopan, G.R. (27 September 2016). "Chempaka Raman Pillai: The freedom fighter who coined 'Jai Hind'". Onmanorama. Retrieved 7 October 2020.
  2. 2.0 2.1 2.2 2.3 Krishnan, Sairam (17 August 2016). "Did a Tamil man from Trivandrum mastermind the bombing of British Madras during World War I?". Scroll.in. Retrieved 7 October 2020. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ScrollKrishnan20160817" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. Mathew, K. M.; Mammen, Matthew (2009). Malayala Manorama Yearbook (in తమిళము). Kottayam: Malayala Manorama Co. p. 301. ISBN 978-8-189-00412-5.
  4. 4.0 4.1 Liebau, Heike (2019). "„Unternehmungen und Aufwiegelungen": Das Berliner Indische Unabhängigkeitskomitee in den Akten des Politischen Archivs des Auswärtigen Amts (1914–1920)". MIDA Archival Reflexicon: 2–4. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; ":0" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. Charles Stephenson (2009). Germany's Asia-Pacific Empire: Colonialism and Naval Policy, 1885-1914. Boydell Press. p. 233. ISBN 978-1-84383-518-9. ...Champakaraman Pillai, a committed anti-imperialist. He is credited with coining the phrase 'Jai Hind' meaning 'Victory for India'...
  6. Saroja Sundararajan (1997). Madras Presidency in pre-Gandhian era: a historical perspective, 1884-1915. Lalitha Publications. p. 535. To Champakaraman Pillai goes the credit of coining the taraka mantra "Jai Hind" in 1907...
  7. Gurbachan Singh Mangat (1986). The Tiger Strikes: An Unwritten Chapter of Netaji's Life History. Gagan Publishers. p. 95.
  8. Sumantra Bose (2018). Secular States, Religious Politics. Cambridge University Press. pp. 49–50. ISBN 978-1-108-47203-6.
  9. Rose, N. Daniel (4 December 2007). "A Forgotten Fighter". The New Indian Express. Chennai. Archived from the original on 12 March 2017. Retrieved 4 September 2018.