చక్రధారి శతకము

వికీపీడియా నుండి
(చక్రధారి శతకం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
చక్రధారి శతకము
కవి పేరుపింగళి వేంకట సుబ్రహ్మణ్య కవి
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంచక్రధారీ!
పద్యం/గద్యంపద్యములు
ఛందస్సుసీసపద్యము
ముద్రణా శాలవాణీ ముద్రాక్షరశాల, బెజవాడ

శతకాలు తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానం కలిగివున్నాయి. వివిధ శతక పద్యాలు జనసామాన్యం నోళ్లలో నాని జాతీయాలు, సామెతల స్థాయిలో నిలిచిపోయాయి. ఈ క్రమంలో ఎందరో తెలుగు కవులు శతకాలు రచించారు. ఆ కోవలోనిదే ఈ చక్రధారి శతకం. "చక్రధారీ!" అనే మకుటంతో ఈ పద్యాలను పింగళి వేంకట సుబ్రహ్మణ్య కవి రచించారు.

ఈ శతకం గుండవరపు మల్లికార్జునరావు గారి ద్రవ్యసహాయముతో 1933 సంవత్సరంలో బెజవాడలోని వాణీ ముద్రాక్షరశాల యందును, 1935 సంవత్సరంలో గుంటూరు వాణీ ముద్రాక్షరశాల యందు ముద్రించబడింది.

కొన్ని పద్యాలు[మార్చు]

సీ. శ్రీజనార్ధనశౌరి సిరియు భూదేవియు
          చేరియిర్వంకల సేవజేయ
వాణీశ్వరుడుగొల్వ వరశచీపతివేడ
          శ్రీరతీపతిమ్రొక్క శీఘ్రముగను
సనకసాదులువచ్చి సంస్తుతింపవిశేష
          ఖేచరాదులువచ్చి కీర్తినెన్న
మౌనివరులువచ్చి మధురభాషలుబల్క
          సాధువాదములెల్ల సందడింప

లోకపాలురు మొదలు సు శ్లోకులెల్ల
ప్రాకటంబుగ గొనియాడ భక్తకోటి
కేవిపత్తులు రానీక నెపుడుబ్రోచు
చక్రధారీశ్రి తమనోబ్జ చయవిహారి.

మూలాలు[మార్చు]