చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ
Chakravarthula Lakshmi Narasamma.jpg
జననంజ‌న‌వ‌రి 3, 1939
భద్రాచలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయతభారతీయురాలు
జాతితెలుగు
వృత్తికవయిత్రి, అభినవ మొల్ల బిరుదాంకితురాలు

డా. చక్రవర్తుల లక్ష్మీనర్సమ్మ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవయిత్రి, అభినవ మొల్ల బిరుదాంకితురాలు.[1] ఈవిడ 2018 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[2][3][4]

జననం[మార్చు]

ల‌క్ష్మీనర‌స‌మ్మ‌ 1939, జ‌న‌వ‌రి 3వ తేదీన పొడిచేటి వీర రాఘ‌వాచార్యులు, న‌ర‌స‌మాంబ దంప‌తులకు ఖమ్మం జిల్లా, భద్రాచలంలో జ‌న్మించింది. భ‌ద్రాచ‌ల శ్రీ సీతారామచంద్ర‌స్వామి ఆల‌యంలో 60 సంవ‌త్సారాలు ప్ర‌ధానార్చ‌క ప‌ద‌విలో సేవ‌లందించాడు.[5]

వివాహం - విద్యాభ్యాసం[మార్చు]

శార‌దా బిల్లు చ‌ట్టం ఉన్న ఆ స‌మ‌యంలో 9 సంవ‌త్స‌రాల‌కే ర‌హ‌స్యంగా లక్ష్మీనర్సమ్మ వివాహం జ‌రిగింది. అత్త‌, ఆడ‌ప‌డుచుల ఆర‌ళ్ళ‌తో ప్రారంభ‌మైన ఆమె వివాహ జీవితం సరిగా సాగలేదు. లక్ష్మీనర్సమ్మ ఇంటిలోని బావిలో త్రోసి వేయగా, పాలేర్లు ర‌క్షించి పుట్టింటికి చేర్చారు. స్వ‌యంగా ఇంట్లో ఉండి ప్రైవేటుగా ఆంధ్రా మెట్రిక్ పాసైంది. ఎస్‌.జి.బి.టి. ట్రైనింగ్ పూర్తిచేసి భ‌ద్రాచ‌లం మ‌ల్టీప‌ర్ప‌స్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి చేప‌ట్టింది. ఉద్యోగం చేస్తూనే పి.యు.సి., బి.ఏ, ఎం.ఏ ప్ర‌థ‌మ శ్రేణిలో ఉత్తీర్ణ‌త సాధించింది.

రచనా ప్రస్థానం[మార్చు]

లక్ష్మీనర్సమ్మ 7 సంవ‌త్స‌రాల వ‌య‌సులో గాంధీ మ‌హాత్ముని మ‌ర‌ణ‌వార్త విని “భార‌త జ‌న‌కుడు ఇక‌లేదు, గాంధీ తాత ఇక‌లేడు” అంటూ తన తొలి కవిత రాసింది. ఒక ప‌ది సంవ‌త్స‌రాలపాటు ఒయాసిస్సులు, విధి బ‌లీయం, పంట‌ క‌ళ్ళం మొదలైన కథలను ప‌త్రికలు ర‌చించాయి. గోల్కొండ ప‌త్రిక‌, కృష్ణా ప‌త్రిక‌, ప్ర‌జామ‌త‌, మ‌నదేశం, తెలుగు తేజం, ఆంధ్ర‌ప్ర‌భ‌, జ్యోతి, ఆంధ్ర‌ప‌త్రిక‌, వార ప‌త్రిక‌లు లక్ష్మీనర్సమ్మ రచనలను ప్రోత్స‌హించాయి.

1964 సంవ‌త్స‌రంలో భ‌ద్ర‌గిరి అనే న‌వ‌ల వ్రాసింది. మ‌హాక‌వి దాశ‌ర‌థి దానికి పీఠిక వ్రాశారు. 1981లో ‘రామ‌దాసు’ ప‌ద్య కావ్యం వ్రాశారు. క‌రుణ‌శ్రీ, జంధ్యాల పాప‌య్య శాస్త్రిగారు “అభిన‌వ మొల్ల‌” బిరుదు ప్ర‌సాధించారు. మ‌హాక‌వి ప‌ధునా పంతుల స‌త్య‌నారాయ‌ణ శాస్త్రిగారు బ‌ల‌ప‌రిచారు. అప్ప‌టి నుండి ఆమె వెనుతిరుగ‌లేదు. 22 ప‌ద్య‌, గ‌ద్య కావ్యాలు రచించింది.

రచనలు[మార్చు]

 1. భ‌ద్ర‌గిరి (న‌వ‌ల‌)
 2. రామ‌దాసు (ప‌ద్య‌కావ్యం - మ‌ధురై కామ‌రాజ్ యూనివ‌ర్స‌టీ నుండి ఎం.ఫిల్ ప‌రిశోధ‌న‌)
 3. క‌వితా ధ‌నుస్సు (ఖండ‌కావ్యం)
 4. స‌మ‌తాభిరామం (భ‌ద్ర‌గిరిధామ శ‌త‌కం)
 5. శాంతిభిక్ష (ఖండ‌కావ్యం)
 6. శ్రీ‌ప‌దం (ద్ర‌విడ ప్ర‌బంధానువాద ప‌ద్య‌కావ్యం)
 7. అక్ష‌ర‌త‌ర్ప‌ణం (స్మృతి కావ్యం)
 8. మారుతీ సుప్ర‌భాతం
 9. భ‌ద్రాచ‌ల యోగానంద ల‌క్ష్మీనృసింహ సుప్ర‌భాతం
 10. నీరాజ‌నం (ప‌ద్య క‌వితా సంపుటి)
 11. స‌మ‌స్యా పూర‌ణ‌
 12. మ‌ధువ‌ని
 13. కావ్య గౌత‌మి
 14. స్వ‌రార్చ‌న‌
 15. గోదా క‌ళ్యాణం (కాక‌తీయ యూనివ‌ర్సిటీ నుండి ఎం.ఫిల్ ప‌రిశోధ‌న‌)
 16. భ‌ద్రాచ‌ల క్షేత్ర చ‌రిత్ర (నాట‌కం) రేడియో ప్ర‌సారం
 17. తానీషా (నాట‌కం) రేడియో స‌ప్తాహంలో
 18. భ‌ద్రాచ‌ల క్షేత్ర మ‌హ‌త్య‌ము
 19. మాతృభూమి
 20. దివ్య గీతాంజ‌లి
 21. తుల‌సీద‌ళాలు (భ‌క్తి గీతాలు)
 22. భ‌ద్ర‌గిరి నానీలు

బహుమతులు - పురస్కారాలు[మార్చు]

 1. తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2018 మార్చి 8[6]
 2. యునెస్కో సాహితీ స్వ‌ర్ణ మ‌హిళ - 1998
 3. యునెస్కో లిట‌ర‌సీ ఉమ‌న్ ఆఫ్ ద ఇయ‌ర్ - 1998
 4. భీమ‌వ‌రం వారి ఆధ్యాత్మిక పుర‌స్కారం - 2000
 5. భద్రాచలం వాస‌వీ క్ల‌బ్ వారి సేవా పుర‌స్కారం (భ‌ద్రాచ‌లం) - 2002
 6. స‌త్తుప‌ల్లి బ్రాహ్మ‌ణ సంఘం వారి ఉగాది పుర‌స్కారం - 2004
 7. సాయినాథ బ‌ద‌రికాశ్ర‌మ పుర‌స్కారం (జూక‌ల్లు గ్రామం)
 8. సాహితీ తెలుగు మ‌హిళా పుర‌స్కారం (భ‌ద్రాచ‌లం) - 2002
 9. భ‌ద్రాద్రి ఉత్స‌వాల సాకేత‌పురి రాష్ట్ర ప్ర‌భుత్వ పుర‌స్కారం - 2002
 10. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ పుర‌స్కారం - 2004 (ఖమ్మం)

మూలాలు[మార్చు]

 1. The Hans India, Khammam Tab (7 March 2018). "Bhadrachalam woman gets Best award". Retrieved 13 March 2018. Cite news requires |newspaper= (help)
 2. నమస్తే తెలంగాణ (6 March 2018). "20 మంది మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు". Retrieved 13 March 2018. Cite news requires |newspaper= (help)
 3. ఆంధ్రజ్యోతి (6 March 2018). "మహిళా దినోత్సవం సందర్భంగా.. 20 మంది మహిళలకు అవార్డులు". Retrieved 13 March 2018. Cite news requires |newspaper= (help)
 4. ఈనాడు (6 March 2018). "మహిళామణులకు తెలంగాణ ప్రభుత్వ అవార్డులు". Retrieved 13 March 2018. Cite news requires |newspaper= (help)
 5. జ్వలితార్ణవాలు. "ప‌డిలేచిన క‌డ‌లి త‌రంగం - "అభిన‌వ మొల్ల" డా. చ‌క్ర‌వ‌ర్తుల ల‌క్ష్మీన‌ర్స‌మ్మ‌". www.jwalith.blogspot.in. Retrieved 13 March 2018.
 6. Telangana Today (8 March 2018). "Telangana govt felicitates women achievers". Retrieved 9 March 2018. Cite news requires |newspaper= (help)