చక్రావధానుల మాణిక్యశర్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చక్రావధానుల మాణిక్యశర్మ
జననం
జాతీయతభారతీయుడు
వృత్తినాటక రచయిత, కవి, గ్రంథ ప్రచురణ కర్త
తల్లిదండ్రులునరసింహులు, నరసమాంబ

చక్రావధానుల మాణిక్యశర్మ ప్రముఖ నాటక రచయిత, కవి, గ్రంథ ప్రచురణ కర్త.[1]

జననం[మార్చు]

మాణిక్యశర్మ పశ్చిమ గోదావరి జిల్లా ముత్యాలపల్లి లోని నరసింహులు, నరసమాంబ దంపతులకు జన్మించాడు. ఈయన స్వస్థలం నరసాపురం.

రంగస్థల ప్రస్థానం[మార్చు]

నరసాపురంలోని వై.ఎన్.కె.వి. అనే నాటక సమాజంకోసం నాటకాలు రాశాడు. దేశీయ గ్రంథమాలను స్థాపించి తన నాటకాలను ప్రచురించాడు. ఈయన పౌరాణిక నాటకాల ఎక్కువగా, చారిత్రక నాటకాలు తక్కువగా రాశాడు. తొలితరం సురభి నాటకాలకు మాణిక్యశర్మ నాటకాలు రాసిచ్చేవారు. ఇప్పటికి సురభి సంస్థ ఆయన నాటకాలనే ప్రదర్శిస్తోంది.[2]

రచించిన నాటకాలు[మార్చు]

 1. భూలోకరంభ చంద్రకాంత (1911)
 2. సంగీత సారంగధర(1914)
 3. మహారాష్ట్ర విజయం (1914)
 4. సంగీత సావిత్రి (1920)
 5. చిత్రనళీయం (1921)
 6. సంగీత శ్రీకృష్ణ రాయబారం (1921)
 7. సంగీత శ్రీకృష్ణలీలలు (1921)
 8. సంగీత సత్య విజయం (1921)
 9. సంగీత ప్రహ్లాద (1921)
 10. సంగీత స్త్రీ సాహసం (1921)
 11. సంగీత శశిరేఖ (1921)
 12. సంగీత గులేబకావళి (1921)
 13. సంగీత రావణ (1921)
 14. సంపూర్ణ రామాయణం (1921)
 15. సంగీత జయంత జయపాల (1922)
 16. సంగీత విష్ణలీలలు (1922)
 17. సంపూర్ణ మహా భారతం (1923)
 18. నవరత్న చింతామణి (1926)
 19. పద్మవ్యూహం (1926)
 20. శ్రీకృష్ణరాయ విజయం (1927)
 21. లంకాదహనం (1927)
 22. లవకుశ (1937)

మూలాలు[మార్చు]

 1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.457.
 2. ప్రజాశక్తి. "క‌ళారంగంలో.. క‌లికితురాయిలు." Retrieved 5 September 2017.