చడ్డీ బనియన్ గ్యాంగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చడ్డీ బనియన్ గ్యాంగ్

చడ్డీ బనియన్ గ్యాంగ్ భారతదేశంలోని పలుప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఒక దొంగల ముఠా.[1] వీరు కేవలం చెడ్డీలు, బనియన్లు ధరించి పట్టుకుంటే జారిపోయేందుకు వీలుగా ఒంటికి నూనె, మట్టి లాంటి జారుడు పదార్థాలు పూసుకుని దాడి చేస్తారు. ఒక్కోసారి ముఖానికి ముసుగు కూడా తగిలించుకుంటారు. [2] తరచూ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్ళిపోతుండటం వలన వీరిని పట్టుకోవడం కూడా పోలీసులకు కష్టంగా ఉంది.[3]

ఎలా పనిచేస్తారు[మార్చు]

వీరి ఒక్కో గ్యాంగ్ లో 5-6 లేదా 8-10 మంది సభ్యులు ఉంటారు. [4][5]పగటి వేళల్లో కుర్తాలు, లుంగీలు ధరించి రైల్వేస్టేషన్లలో, బస్టాండ్లలో, కాలనీలలో కూలీ వాళ్ళలాగా, అడుక్కుతినే వారిలాగా సంచరిస్తూ దొంగతనానికి పాల్పడే ఇంటిని గురించి ఆరా తీస్తారు. అలా కొన్ని ఇళ్ళు కొల్లగొట్టిన తరువాత వేరే ఊరికి వెళ్ళిపోతుంటారు. దొంగతనం చేసేటపుడు కుటుంబ సభ్యులను బంధిస్తారు. అంతగా తిరగబడితే చంపడానికి కూడా వెనుకాడరు. కత్తులు, రాడ్లు, గొడ్డళ్ళు, నాటు తుపాకిలు తమ దగ్గర ఉంచుకుని తిరుగుతూ ఉంటారు.

సంఘటనలు[మార్చు]

1999 నుంచి ఈ ముఠా పనులు వెలుగులోకి వస్తున్నాయి. [6][7] ఎక్కువగా ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడక్కడా వీరి దొంగతనాలు చోటు చేసుకున్నాయి. [8]

మూలాలు[మార్చు]

  1. "Chaddi-Baniyan gang returns to haunt city". Times of India. July 26, 2009. Retrieved May 7, 2014.
  2. "राजधानी में चड्डी बनियान धारी गिरोह फिर हुआ सक्रिय, Dainik Kausar, May 6, 2014". Archived from the original on 2014-05-08. Retrieved 2016-07-31.
  3. कच्छा-बनियान गिरोह के छह बदमाश गिरफ्तार, Jagran, Sep 18,2012
  4. "कच्छा-बनियान गिरोह की दिल्ली में दस्तक, दो जगह लूट आईबीएन-7 | Apr 30, 2011". Archived from the original on 2014-12-15. Retrieved 2016-07-31.
  5. Chaddi-baniyan gang now targets temples, 2010-08-23, Mid-Day[permanent dead link]
  6. Immigration and Refugee Board of Canada, India: Kacha Banian (Kucha Banyan) or Underwear-Undershirt Wearing Group or Shorts-Underwear Clad Group; its members; their activities; their targets, 10 August 2001, IND37634.E, available at: http://www.refworld.org/docid/3df4be4118.html [accessed 8 May 2014]
  7. दो साल बाद फिर सक्रिय हुआ कच्छा बनियान गिरोह
  8. "Inter-State burglar gang nabbed, Hindu, Jul 24, 2008". Archived from the original on 2009-02-28. Retrieved 2016-08-02.