Jump to content

చతురానన్ మిశ్రా

వికీపీడియా నుండి
చతురానన్ మిశ్రా

కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
1996 జూలై 10 – 1998 మార్చి 19
ప్రధాన మంత్రి హెచ్‌డి దేవెగౌడ
ఐ. కె. గుజ్రాల్
ముందు హెచ్‌డి దేవెగౌడ
తరువాత అటల్ బిహారీ వాజ్‌పేయి

పదవీ కాలం
1996 – 1998
ముందు భోగేంద్ర ఝా
తరువాత షకీల్ అహ్మద్
నియోజకవర్గం మధుబని
నియోజకవర్గం బీహార్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
1984 – 1996

వ్యక్తిగత వివరాలు

జననం 1925 ఏప్రిల్ 7
నహర్, మధుబని జిల్లా, బీహార్
మరణం 2011 July 2(2011-07-02) (వయసు: 86)
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
వృత్తి రాజకీయ నాయకుడు

చతురానన్ మిశ్రా (7 ఏప్రిల్ 1925 - 2 జూలై 2011) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మధుబని లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా పని చేశాడు.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

చతురానన్ మిశ్రా 1940లలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరి 1962 బీహార్ శాసనసభ ఎన్నికల్లో గిరిదిహ్ నుండి పోటీ చేసి 6,379 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు. ఆయన 1964లో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మండలిలో చేరి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ బీహార్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడయ్యాడు. చతురానన్ మిశ్రా 1969 & 1980 నుండి గిరిదిహ్ నియోజకవర్గం నుండి బీహార్ శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

చతురానన్ మిశ్రా 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో హజారీబాగ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి 35,809 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు. ఆయన 1981 ఉప ఎన్నికలో కాంగ్రెస్ (ఐ) అభ్యర్థి ఊర్మిళా దేవి చేతిలో ఓడిపోయాడు. చతురానన్ మిశ్రా 1980లలో ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యాడు.

చతురానన్ మిశ్రా 1984 & 1990లో రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఆయన ఏప్రిల్ 1989లో సీపీఐ పార్టీ సెక్రటేరియట్‌లో సభ్యుడిగా చేరాడు.

చతురానన్ మిశ్రా 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో మధుబని లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై కేంద్ర వ్యవసాయ మంత్రిగా పని చేశాడు. ఆయన మే 1997లో కేంద్ర ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు & ప్రజా పంపిణీ శాఖల మంత్రిగా కూడా పని చేశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Chaturanan Mishra passes away" (in Indian English). The Hindu. 2 July 2011. Archived from the original on 18 August 2025. Retrieved 18 August 2025.
  2. "Leftist with a caste bent passes away". The Telegraph. 3 July 2011. Archived from the original on 18 August 2025. Retrieved 18 August 2025.