Jump to content

చతుర్భుజ ఆలయం (ఓర్చా)

చతుర్భుజ్ ఆలయం (ఓర్చా)
చతుర్భుజ్ ఆలయం (ఓర్చా)
Religion
AffiliationHinduism
Districtనివారీ జిల్లా
Deityరాముడికి(విష్ణువు యొక్క ఒక రూపం) అంకితం చేయబడింది.
Location
Locationఓర్చా
Stateమధ్యప్రదేశ్
Countryభారతదేశం
పటం
Interactive map of చతుర్భుజ్ ఆలయం (ఓర్చా)
Coordinates25°21′0″N 78°8′24″E / 25.35000°N 78.14000°E / 25.35000; 78.14000
Architecture
Typeనగర వాస్తుశిల్పం, మారు-గుర్జార వాస్తుశిల్పం
Creatorఓర్చా రాజ్యానికి చెందిన బుందేలా పాలకుల
Temple1

చతుర్భుజ ఆలయం భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లో ఉన్న ఓర్చాలో ఉన్న విష్ణువుకు అంకితం చేయబడిన ఆలయం. చతుర్భుజ అనే పేరు 'చతుర్' అంటే "నాలుగు", 'భుజ' అంటే "చేతులు" అనే పదాల కలయిక, దీనికి అక్షరాలా "నాలుగు చేతులు కలవాడు" అని అర్థం. ఇది విష్ణువు అవతారమైన రాముడిని సూచిస్తుంది.[1] ఈ ఆలయం ఆలయం కోట, రాజభవన నిర్మాణ లక్షణాల సమ్మేళనంతో కూడిన సంక్లిష్టమైన బహుళ అంతస్తుల నిర్మాణ రూపాన్ని కలిగి ఉంది.[2][3]

ఈ ఆలయం వాస్తవానికి ఓర్చా కోట సముదాయంలోని రామ రాజా ఆలయంలో ప్రతిష్ఠించిన రాముని విగ్రహాన్ని ప్రధాన దైవంగా పూజించడం కోసం నిర్మించబడింది. ప్రస్తుతం ఈ ఆలయంలో రాధా కృష్ణుని విగ్రహాన్ని పూజిస్తున్నారు.[1] 344 అడుగుల ఎత్తుతో హిందూ దేవాలయాలలోకెల్లా అత్యంత ఎత్తైన విమానాలలో ఒకటిగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.

స్థానం

[మార్చు]

ఈ ఆలయం ఓర్చా పట్టణంలో, ఓర్చా కోట సముదాయం పరిమితులకు వెలుపల, రామ రాజ ఆలయానికి దక్షిణాన ఉంది.[1] ఇది బెత్వా నదిచే ఏర్పడిన ఒక ద్వీపంలో ఉంది. [4] ఢిల్లీ, భోపాల్ నుండి 119 కిలోమీటర్ల (74 మైళ్ళు) దూరంలో ఉన్న గ్వాలియర్ విమానాశ్రయం నుండి ఓర్ఛాకు విమానంలో చేరుకోవచ్చు. ఝాన్సీ-ఖజురహో రహదారి నుండి మళ్లింపు నుండి రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. సమీప రైలు-కేంద్రం ఝాన్సీ, ఇది 16 కిలోమీటర్ల (9.9 మైళ్ళు) దూరంలో ఉంది.[5]

చరిత్ర

[మార్చు]

ఈ ఆలయాన్ని మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో ఓర్చాకు చెందిన బుందేలా రాజపుత్ర పాలకులు నిర్మించారు[6]. దీని నిర్మాణం మధుకర్ షాచే ప్రారంభించబడి, 16వ శతాబ్దంలో అతని కుమారుడు వీర్ సింగ్ దేవ్ చేత పూర్తి చేయబడింది. మధుకర్ షా ఈ ఆలయాన్ని తన భార్య రాణి గణేష్‌కువారీ కోసం నిర్మించాడు.[7][1]


స్థానిక కథనం ప్రకారం, రాణికి ఒక కల వచ్చింది, అందులో శ్రీరాముడు తన కోసం ఒక ఆలయం నిర్మించమని ఆమెకు చెప్పాడు. మధుకర్ షా కృష్ణుని భక్తుడు, కానీ అతని భార్య రాముని భక్తురాలు.

చతుర్భుజ ఆలయాన్ని నిర్మించడానికి అనుమతి పొందిన తర్వాత, రాణి శ్రీరాముని విగ్రహాన్ని తీసుకురావడానికి అయోధ్యకు వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి, చతుర్భుజ ఆలయం నిర్మాణం ఇంకా జరుగుతూనే ఉంది, కాబట్టి ఆమె ఆ విగ్రహాన్ని తన రాణి మహల్ అని పిలువబడే రాజభవనంలో ఉంచింది. ఆలయం కోసం ఉద్దేశించిన విగ్రహాన్ని రాజభవనంలో ఉంచకూడదని ఆమెకు తెలియదు. తరువాత, ఆలయం సిద్ధమైనప్పుడు, ప్రజలు ఆ విగ్రహాన్ని చతుర్భుజ ఆలయానికి తరలించడానికి ప్రయత్నించగా, దానిని రాజభవనం నుండి కదపలేకపోయారు. అందువల్ల రాముని విగ్రహం రాజభవనంలోనే ఉండిపోయింది, చతుర్భుజ ఆలయం విగ్రహం లేకుండానే మిగిలిపోయింది. రాజభవనంలో శ్రీరాముడిని పూజించడం వల్ల, ఆ రాజభవనం రామ్ రాజా ఆలయంగా మార్చబడింది. భారతదేశంలో శ్రీరాముడిని రాజుగా పూజించే ఏకైక ఆలయం ఇదే. [8]

నేడు, రామ్ రాజా ట్రస్ట్ ఆలయ దైనందిన కార్యకలాపాలను చూసుకుంటుంది. రాష్ట్ర పురావస్తు శాఖ ఆలయ భవనం యొక్క రక్షణ, నిర్వహణను పర్యవేక్షిస్తుంది.[9]

లక్షణాలు

[మార్చు]
ఓర్చా లోని చతుర్భుజ్ ఆలయం, 344 అడుగుల ఎత్తులో ఉన్న హిందూ దేవాలయాలలో ఎత్తైన విమానాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది.

చతుర్భుజ ఆలయానికి పైన్ చెట్లవ్ వంటి శంకువు ఆకారంలో ఉండే పొడవైన గోపురాలు ఉన్నాయి. ఇవి నేల నుండి సుమారు 4.5 మీటర్ల (15 అడుగుల) ఎత్తులో ఉన్న ఒక ఎత్తైన వేదికపై నిలబడి ఉన్నాయి. ఈ ఆలయం చాలా ఎత్తుగా, సుమారు 105 మీటర్ల (344 అడుగుల) ఎత్తులో ఉంటుంది. ఆలయ రూపకల్పన బాసిలికా శైలిలో ఉంటుంది. ఈ ఆలయం నిర్మించబడిన విష్ణుమూర్తి యొక్క నాలుగు చేతులను కూడా సూచిస్తుంది. బయటి నుండి చూస్తే, ఈ ఆలయం అనేక వంపు ద్వారాలు, ఒక పెద్ద ప్రవేశ ద్వారం, ఒక పెద్ద కేంద్ర గోపురం, బలమైన కోట లాంటి గోడలతో కూడిన ఒక భారీ బహుళ అంతస్తుల రాజభవనంలా కనిపిస్తుంది. ఆలయం ముందు భాగానికి చేరుకోవడానికి, సందర్శకులు 67 ఏటవాలుగా, ఇరుకైన మెట్లను ఎక్కాలి. ప్రతి మెట్టు సుమారు 1 మీటరు (3 అడుగులు) ఎత్తు ఉంటుంది, ఈ మెట్లు మెలికలు తిరిగే మెట్ల మార్గాన్ని ఏర్పరుస్తాయి. లోపల ఆలయంలో అనేక మండపాలు ఉన్నాయి. మండపం అని పిలువబడే ప్రధాన హాలు, శిలువ ఆకారంలో నిర్మించబడింది. దీని శైలి మారు-గుర్జర వాస్తుశిల్పం సమ్మేళనం. ఈ హాలు ప్రవేశ మార్గానికి (వెస్టబ్యూల్) లంబ కోణంలో అనుసంధానించబడి ఉంది, దీని అమరిక ఇరువైపులా ఒకే విధంగా ఉంటుంది.[7][1]

ఆలయం వెలుపలి భాగం కమలం డిజైన్లతో అందంగా అలంకరించబడి ఉంది. దీని నిర్మాణం మతపరమైన ఆలయ శైలి, కోట లాంటి శైలి కలయిక. ఆలయం తూర్పు ముఖంగా ఉంది. ఓర్చా కోట ప్రాంతంలో సమీపంలోని రామమందిరంతో సరళ రేఖలో ఉంది. ఆలయం లోపలి భాగం సరళమైనది, పెద్దగా అలంకరణ లేదు. ప్రధాన గోపురం పైకప్పు అనేక చిన్న కియోస్క్ లాంటి నిర్మాణాలను కలిగి ఉంది. ఇది పూర్తిగా తెరిచిన కమలం పువ్వులతో అలంకరించబడింది.

:ఆలయం బయటి గోడలు:

  • పువ్వుల రేకుల ఆకారంలో ఉన్న రాతి నమూనాలు
  • పెయింటెడ్ పువ్వు, రేఖాగణిత నమూనాలు
  • కమలం ఆకారపు బ్రాకెట్ల మద్దతుతో అలంకరించబడిన అంచులు (కార్నిసెస్)
  • జ్యువెల్డ్ రాతి పట్టీలు
  • భవనానికి అందాన్ని జోడించే బాల్కనీలు.[3]

ఆలయ గోపురాలకు ఒకప్పుడు బంగారు పూత పూయబడి ఉండేదని నమ్ముతారు, కానీ కాలక్రమేణా ఈ బంగారంలో ఎక్కువ భాగం దొంగిలించబడింది లేదా పోయింది. ఆలయ పైకప్పును సందర్శకుల కోసం తెరిచి ఉంచుతారు, పైనుండి ఓర్చా పట్టణం, వంకరగా ప్రవహించే బేత్వా నది, సావన్ భాదోన్ ప్రాంతం, రామ రాజా ఆలయం, దూరంలో ఉన్న అద్భుతమైన లక్ష్మీ నారాయణ ఆలయం యొక్క అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు.[1]

ఇవి కూడా చూడండి

[మార్చు]
  • 20వ శతాబ్దానికి ముందు నిర్మించిన ఎత్తైన నిర్మాణాల జాబితా

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 6 Mitra 2009, p. 43.
  2. Singh & Singh 1991, p. 57.
  3. 1 2 Asher 2003, p. 57.
  4. Hooja, Rima; Jain, Shikha (23 September 2016). Conserving Fortified Heritage: The Proceedings of the 1st International Conference on Fortifications and World Heritage, New Delhi, 2015 (in ఇంగ్లీష్). Cambridge Scholars Publishing. p. 120. ISBN 978-1-4438-9637-5.
  5. "Orchha". Official website of Madhya Pradesh Tourism. Archived from the original on 4 March 2016. Retrieved 30 July 2015.
  6. "Chutr-bhuj Temple at Orcha". British Library. Archived from the original on 21 January 2015. Retrieved 13 February 2014.
  7. 1 2 "Interior of the Chaturbhuj Temple from the entrance archway, Orchha". British Library. Archived from the original on 22 February 2014. Retrieved 13 February 2014.
  8. Hooja, Rima; Jain, Shikha (23 September 2016). Conserving Fortified Heritage: The Proceedings of the 1st International Conference on Fortifications and World Heritage, New Delhi, 2015 (in ఇంగ్లీష్). Cambridge Scholars Publishing. p. 120. ISBN 978-1-4438-9637-5.
  9. Mitra 2009, p. 44.

గ్రంథ పట్టిక