చతుస్త్రింశత్‌-అతిశయములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

1. దేహమెప్పుడును చెమర్చకుండుట, 2. ఏ కశ్మలము లేకుండుట, 3. శరీరమందలి రక్తమాంసములు శుద్ధముగ నుండుట, 4. ఉత్తమాకృతి కలిగియుండుట, 5. దేహమందలి స్నాయువులు, అస్థులు, కీళ్ళు దృఢముగ నుండుట, 6. మిక్కిలి మనోహరమైన రూపము కలిగియుండుట, 7. దేహమునుండి సుగంధము వచ్చుచుండుట, 8. దేహమున 108 సులక్షణము లుండుట, 9. శరీరమందపరిమిత వీర్యముండుట, 10. భాషణము హితముగను, మితముగను, ప్రియముగను ఉండుట [ఇవి జన్మసిద్ధాతిశయములు], 11. తాముండు ప్రదేశమున నూఱు యోజనములు వరకు సుభిక్షముగనుండుట, 12. భూమిని సోకక అంతరిక్షమున సంచరించుట, 13. తాముండుచోట నెట్టి ప్రాణిహింసయు జరుగకుండుట, 14. భుజింపకుండుట, 15. తాము తిరుగుచోట అతివృష్ట్యాది బాధులుండకుండుట, 16. తమను చూచువారికి వారి సమ్ముఖముననే యుండునట్లు గోచరించుట, 17. అన్ని విద్యలయందధికారము గల్గి యుండుట, 18. నీడ లేకుండుట, 19. ఱెప్పపాటు లేకుండుట, 20. దేహమందలి రోమములు, గోళ్ళు పెరుగకుండుట [ఇవి జ్ఞానప్రాప్త్యనంతరము కల్గు అతిశయములు], 21. అర్హంతులకు అర్ధమాగధీ వ్యవహారముండుట, 22. సమస్త జీవులలో పరస్పర మైత్రి కలిగియుండుట, 23. దిక్కులు నిర్మలములైయుండుట, 24. ఆకాశము నిర్మలముగ నుండుట, 25. అన్ని ఋతువులలో పుష్పములు పుష్పించుట, ధాన్యములు పండుట, 26. రెండు కోసుల వరకును భూమి యద్దమువలె నిర్మలముగా నుండుట, 27. అర్హంతులు నడచునపుడు వారి పాదముల క్రింద బంగారు కమలములు మొలచుట, 28. ఆకాశమున జయజయ ధ్యానములు చెలరేగుట, 29. మందము, సుగంధమునగు వాయువు వీచుట, 30. పరిమళముగల జలము వర్షించుట, 31. పవనకుమార దేవతలు భూమిని తుడిచి శుభ్రపఱచుట, 32. ప్రాణులన్నియు ఆనందించుట, 33. తమ యెదుట ధర్మచక్రము తిరుగుట, 34. ఛత్రచామరాద్యష్టమంగళ వస్తువులెల్లప్పుడు సమీపమున నుండుట [ఇవి తీర్థంకరుల యందుడు అతిశయములు] [జైనధర్మపరిభాష]