చత్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Chatra జిల్లా

चतरा जिला
Jharkhand లో Chatra జిల్లా స్థానము
Jharkhand లో Chatra జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంJharkhand
పరిపాలన విభాగముNorth Chotanagpur division
ముఖ్య పట్టణంChatra, Jharkhand
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుChatra (shared with Palamu and Latehar districts)
 • శాసనసభ నియోజకవర్గాలు2
విస్తీర్ణం
 • మొత్తం3,706 కి.మీ2 (1,431 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం10,42,304
 • సాంద్రత280/కి.మీ2 (730/చ. మై.)
 • పట్టణ
05.31
జనగణాంకాలు
 • అక్షరాస్యత62.14 per cent
 • లింగ నిష్పత్తి951
జాలస్థలిఅధికారిక జాలస్థలి

జార్ఖండ్ రాష్ట్రంలోని 24 జిల్లాలలో ఛత్రా జిల్లా (హిందీ: चतरा जिला) ఒకటి. ఛత్రా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3706చ.కి.మీ. జనసంఖ్య 790,680 .

చరిత్ర[మార్చు]

ఛత్రా జిల్లా ఒకప్పుడు హజారీబాగ్ జిల్లాలో ఉపవిభాగంగా ఉండేది. 1991 నుండి ఈ జిల్లా ఉనికిలోకి వచ్చింది.[1]

పురాతన కాలం[మార్చు]

ఛత్రా ప్రాంతం దీని పరిసర ప్రాంతాలు పురాతన కాలం నుండి పలు సామ్రాజ్యంలో భాగంగా ఉంటూ వచ్చింది. క్రీ.పూ 332 అశోకుడు పాలించిన కాలంలో మౌర్య సామ్రాజ్యంలో సామంత రాజ్యమైన ఆటవిక రాజాస్థానం ఛత్రాను కొంత కాలం పాలించింది. సముద్రగుప్తుడు సైన్యంతో ఈ ప్రాంతం గుండా ప్రయాణించి చోటానాగపూర్ చేరుకుని మహానది లోయలోఉన్న దక్షిణ కోసల మీద దండయాత్ర సాగించాడు.[2]

మధ్యయుగం[మార్చు]

ముహమ్మద్ బీన్ తుగ్లక్ కాలంలో ఈ ప్రాంతం ఢిల్లీ సుల్తానుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత ముగల్ సామ్రాజ్యంలోని బీహార్ సుబాహ్‌లో భాగం అయింది.ముగల్ చక్రవర్తి ఔరంగజేబు 1660 మే మాసంలో కోఠీ సమీపంలో ఉన్న పొఖ్రి ఖోటను అనుకున్నంత తిరుగుబాటు లేకుండా ఆక్రమించుకున్నాడు. తరువాత ఆయన కొండ శిఖరాగ్రంలో ఉన్న బలమైన కుండా కోట వైపు సైన్యంతో ముందుకు కదిలాడు. ఈ కోట చివరకు ఔఅరంగజేబు ఆక్రమించుకున్నాడు. అయినప్పటికీ 1660 జూ2 న కోట పూర్తిగా ధ్వంసం చేయబడింది. తరువాత కుండా కోట రాజా రాంఘర్ ఆధినంలోకి వచ్చింది. 1774లో అలివర్ది ఖాన్ తిరుగుబాటు తికరి (గయ) జమీందారులను ఎదిరించిన తరువాత ఛత్రా కోట వైపు దాడి కొనసాగించి దానిని ధ్వంసం చేసాడు.[2]

బ్రిటిష్ పాలన[మార్చు]

" ది బ్రిటిష్ ఈస్టిండియా కంపనీ " 1769లో మొదటిసారిగా ఈ ప్రాంతంలో ఒప్పందం కుదుర్చుకుంది. రాజా రాంమోహన్ రాయ్ 1805-1805 వరకు సెరెస్తాదార్‌గా పనిచేసాడు. ఆయన కార్యాలయంలో ఉన్నప్పుడు ఛత్రా మరియు రాంగర్‌లో నివసించాడు.[2]

బ్రిటిష్ లోని చోటానాగ్పూర్ మరియు ఈ ప్రాంతపు సామంతుల మధ్య 1857 తిరుగుబాటు సమయంలో " బాటిల్ ఆఫ్ ఛత్రా " పేరుతో యుద్ధం జరిగింది. మోసపూరితమైన ఈ యుద్ధం 1857 అక్టోబరు 4 న " ఫంసీ తలాబ్ " వద్ద జరిగింది. ఒక గంట కాలం యుద్ధం జరిగిన తరువాత గిరిజనులు పూర్తిగా ఓడించబడ్డారు. ఈ యుద్ధంలో 56 యురేపియన్ సైనికులు మరియు సైనిక అధికారులు మరణించారు. అలాగే 150 తిరుగుబాటుదార్లు మరణించారు మరియు 77 మంది గుంటలో పూడ్చిపెట్టబడ్డారు. సుబేదార్ జై మంగల్ పాండే మరియు నాదిర్ అలి ఖాన్ లకు 1857 అక్టోబరు 4న ఇదే ప్రాంతంలో ఉరితీయ బడ్డారు. యురేపియన్ మరియు సిక్కు సైనికులు వారి ఆయుధాలు మరియు యుద్ధసామాగ్రితో ఒక బావిలో పూడ్చి పెట్టబడ్డారు. ఈ ప్రాంతంలో ఈ వివరాలను వివరిస్తూ స్థూపం ఒకటి నిర్మించబడింది.

"56 men of Her Majesty's 53rd Regiment of foot and a party of Sikhs were killed at Chatra on October 2nd 1857 in action against mutineers of the Ramgarh Battalion. Lieutenant J. C. C. Daunt of the 70th Bengal Native Infantry and sergeant D. Dynon of the 53rd regiment were awarded Victoria Cross for conspicuous gallantry in the battle, in which the mutineers were completely defeated and lost all their four guns and ammunitions.

ఫంసి తలాబ్ తీరంలో ఉన్న శిలాఫలకం మీద ఇద్దరు సుబేదార్ల మరణం [మంగల్ పాండే, నాదిర్ అలి ఖాన్ ] గురించిన వివరాలు లభిస్తున్నాయి.

[2] namely, Mangal Pandey and Nadir Ali Khan.

స్వాతంత్ర్య సమరం[మార్చు]

1982లో చత్రా జ్జిల్లాలో స్వాతత్ర ఉద్యమంలో పాలుపంచుకోవడం ప్రారంభం అయింది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం ఈ ప్రాంతం మీద కూడా ప్రభావం చూపింది. 1942 నవంబరు 9 న దీపావళి పండుగ రాత్రిన 6 సహఖైదీలతో హజారీబాగ్ సెంట్రల్ జైల్ నుండి పారిపోయాడు. తరువాత జయప్రకాష్ నారాయణ్ ఈ జిల్లాలోని తాత్రా గ్రామానికి వచ్చాడు. ఇక్కడి నుండి ఆయన వారణాసికి వెళ్ళాడు. చోటానాగ్పూర్ కెస్రి, బాబు రాం నారాయణ్ సింగ్ మరియు బాబు షాలిగ్రాం సింగ్.[2]

స్వతంత్రం తరువాత[మార్చు]

ఛత్రా జిల్లా రెడ్ కార్పెట్‌లో భాగం అయింది.[3]

ఆర్ధికరగం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ఛత్రా జిల్లా ఒకటి అని గుర్తించింది.[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జర్ఖండ్ రాష్ట్రజిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]

పర్యాటకం[మార్చు]

చత్రా జిల్లాలో భద్రకాళీ అమ్మవారి విగ్రహము

జార్ఖండ్ ముఖద్వారం అని గుర్తించబడుతున్న చత్రా జిల్లా ప్రకృతి సౌందర్యానికి పుట్టిల్లు. చత్రా జిల్లా సహజ ప్రకృతి సౌందర్యంతో విస్తారమైన సుందర విహారప్రదేశాలతో, ఫౌంటెన్లతో, జలపాతాలతో అలరారుతూ జార్ఖండ్ రాష్ట్రముఖద్వారంగా ఉంది.

  • జిల్లాలోని పర్యాటక ఆకర్షణలు.
  • భద్రకాళీ ఆలయం :

చత్రాకు తూర్పుగా 35 కి.మీ దూరం చౌపరాకు 16 కి.మీ దూరంలో ట్రంక్ రోడ్డు పక్కన మహానదీతీరంలో ఈ భద్రకాళీ ఆలయం ఉంది. పచ్చని అరణ్యాలు కొండలమద్య ఉన్న ఈ ఆలయ సమీపంలో ఒక సహజసిద్ధమైన సరసు ఒకటి ఈ పట్టణ సౌందర్యానికి మరింత శోభను తెస్తూఉంది.

  • కుండా రాజభవనం: కుండా రాజ భవనశిథిలాలు ప్రస్తుత కుండా గ్రామానికి 4 కి.మీ దూరంలో ఉంది. ఈ రాజభవనం 17 వ శతాబ్ధానికి చివర 18 వ శతాబ్ధానికి ఆరంభంలో నిర్మించబడిందని భావిస్తున్నారు.
  • తంసిన్ : తంసిన్ అంటే చీకటితెర అని అర్ధం. ఈ ప్రాంతంలో పలు జాతులకు చెందిన ఎత్తైన అరణ్యాలు ఉండి సూర్యరస్మిని సైతం భూమికి చేరకుండా అడ్డుకుంటూ చీకటిగా ఉన్నందు వలన ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. ప్రకృతి ఆరాధకులకు ఇది స్వర్గం వంటిది. ఇక్కడ ఉన్న జలపాతం అత్యధికంగా పర్యాటకుల ఆదరణకు పాత్రమౌతుంది. ఈ ప్రాంతంలో అదనంగా పలు జలపాతాలు ఉన్నాయి.

[5] నక్సలైటు సమస్య కారణంక ఈ ప్రాంతం పర్యాటకం ఘోరంగా దెబ్బతిన్నది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,042,304,[6]
ఇది దాదాపు. సిప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[7]
అమెరికాలోని. రోడ్ ద్వీపం నగర జనసంఖ్యకు సమం.[8]
640 భారతదేశ జిల్లాలలో. 434వ స్థానంలో ఉంది.[6]
1చ.కి.మీ జనసాంద్రత. 275 [6]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 28.98%.[6]
స్త్రీ పురుష నిష్పత్తి. 951:1000 [6]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 62.14%.[6]
జాతియ సరాసరి (72%) కంటే.

మూలాలు[మార్చు]

  1. "Profile". Chatra district website.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 "History". Chatra district website.
  3. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Retrieved 2011-09-17.
  4. 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011.
  5. "Tourist attractions in Chatra District - Jharkhand". Chatra district website.
  6. 6.0 6.1 6.2 6.3 6.4 6.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  7. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
  8. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 line feed character in |quote= at position 13 (help)

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చత్రా&oldid=2353158" నుండి వెలికితీశారు