చమిందా వాస్

వికీపీడియా నుండి
(చమిండా వాస్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Deshabandu
చమిందా వాస్
2007 డిసెంబరులో మైదానంలో చమిందా వాస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
వర్ణకులసూరియ పతబెండిగే ఉషాంత జోసెఫ్ చమిందా వాస్
పుట్టిన తేదీ (1974-01-27) 1974 జనవరి 27 (వయసు 50)
వత్తాలా, శ్రీలంక
మారుపేరువాసీ
ఎత్తు178 cm (5 ft 10 in)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఫాస్ట్ మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 62)1994 ఆగస్టు 26 - పాకిస్తాన్ తో
చివరి టెస్టు2009 జూలై 20 - పాకిస్తాన్ తో
తొలి వన్‌డే (క్యాప్ 75)1994 ఫిబ్రవరి 15 - ఇండియా తో
చివరి వన్‌డే2008 ఆగస్టు 27 - ఇండియా తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.22
తొలి T20I (క్యాప్ 15)2006 డిసెంబరు 22 - న్యూజీలాండ్ తో
చివరి T20I2007 సెప్టెంబరు 20 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1990–2012కోల్ట్స్ క్రికెట్ క్లబ్
2003హాంప్‌షైర్
2004Uva
2005వోర్సెస్టర్‌షైర్
2007మిడిల్‌సెక్స్
2008–2010డెక్కన్ చార్జర్స్
2010–2012నార్తాంప్టన్‌షైర్ (స్క్వాడ్ నం. 6)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 111 322 227 412
చేసిన పరుగులు 3,089 2,025 6,223 3,220
బ్యాటింగు సగటు 24.32 13.68 25.82 16.59
100లు/50లు 1/13 0/1 4/29 0/8
అత్యుత్తమ స్కోరు 100* 50* 134 76*
వేసిన బంతులు 23,438 15,775 41,266 19,411
వికెట్లు 355 400 772 506
బౌలింగు సగటు 29.58 27.53 24.64 26.63
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 12 4 34 4
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 0 4 0
అత్యుత్తమ బౌలింగు 7/71 8/19 7/28 8/19
క్యాచ్‌లు/స్టంపింగులు 31/– 60/– 57/– 83/–
మూలం: Cricinfo, 2016 డిసెంబరు 24

చమిందా వాస్ (జననం 1974 జనవరి 27) శ్రీలంకకు చెందిన మాజీ క్రికెట్ ఆటగాడు. 1994లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేసిన వాస్, ఫాస్ట్ బౌలర్‌గా మంచి పేరు సంపాదించాడు. అదే సంవత్సరం విదేశాలలో శ్రీలంక జట్టుకు తొలి టెస్ట్ మ్యాచ్ విజయాన్ని అందించాడు. న్యూజీలాండ్తో నేపియర్లో జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్సులో 47/5, రెండో ఇన్నింగ్సులో 43/5 గణాంకాలతో మ్యాచ్‌ను గెలిపించాడు. 2001-02లో వెస్ట్‌ఇండీస్తో జరిగిన సీరీస్‌లో 26 వికెట్లు సాధించి సీరీస్ విజయానికి దోహదపడ్డాడు. అదే సీరీస్‌లో ఒక మ్యాచ్‌లో 14 వికెట్లు పడగొట్టి ఆ ఘనత సాధించిన ఇద్దరు ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు.

టెస్ట్ క్రికెట్ గాణాంకాలు

[మార్చు]

చమిందా వాస్ 102 టెస్ట్‌మ్యాచ్‌లు ఆడి 29.33 సగటుతో 331 వికెట్లు సాధించాడు. ఒకే ఇన్నింగ్సులో 5 వికెట్లను 11 సార్లు, ఒకే టెస్ట్‌లో 10 వికెట్లను 20 సార్లు పొందాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 71 పరుగులకు 7 వికెట్లు. బ్యాటింగ్‌లో 23.54 సగటుతో 2815 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ, 12 అర్థసెంచరీలు ఉన్నాయి. అతను సాధించిన ఏకైక సెంచరీ 2007, జూన్ 26న బంగ్లాదేశ్ పై సాధించాడు. సెంచరీ పూర్తికాగానే 577/6 స్కోరు వద్ద శ్రీలంక ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో అతని అత్యధిక స్కోరు 100 (నాటౌట్) వద్ద నిలిచిపోయింది.

వన్డే గణాంకాలు

[మార్చు]

చమిందావాస్ 312 వన్డేలలో శ్రీలంక క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి 392 వికెట్లను సాధించాడు.[1] ఒకే వన్డేలో 5 వికెట్లను 4 సార్లు సాధించాడు. వన్డేలలో అతడి అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 19 పరుగులకు 8 వికెట్లు. 2005 డిసెంబర్ 12న భారత్ పై ఆడుతూ 300 వికెట్ల మైలురాయిని చేరుకొని ముత్తయ్య మురళీధరన్ తర్వాత ఈ ఘనత పొందిన రెండో శ్రీలంక బౌలర్‌గా అవతరించాడు. వన్డేలలో 2 సార్లు హాట్రిక్ కూడా సాధించాడు. మొదటి సారి వన్డేలలో అతను అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ (19/8) సాధించిన మ్యాచ్‌లోనే న్యూజీలాండ్‌పై సాధించగా రెండో పర్యాయం 2003 ప్రపంచ కప్ సమయంలో బంగ్లాదేశ్ పై ఆడుతూ సాధించాడు. ఆట ప్రారంభంలోనే తొలి మూడు బంతులకు 3 వికెట్లు సాధించడం వన్డే చరిత్రలోనే అది ప్రథమ పర్యాయం. బ్యాటింగ్‌లో కూడా 1953 పరుగులు సాధించాడు. వన్డేలలో అతడి అత్యధిక స్కోరు 50 పరుగులు (నాటౌట్).

ప్రపంచ కప్ క్రికెట్

[మార్చు]

చమిందా వాస్ శ్రీలంక ప్రపంచ కప్ సాధించిన 1996లో తొలిసారిగా ప్రపంచ కప్ టోర్నమెంటులో ఆడినాడు. ఆ తరువాత 1999, 2003, 2007లలో కూడా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2003 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై సాధించిన అపురూపమైన హాట్రిక్ అతనికి మంచిపేరు తెచ్చింది.

మూలాలు

[మార్చు]
  1. క్రికెట్ ఇన్ఫో చమిండావాస్ ప్రొఫైల్