చరణ్‌జిత్ సింగ్ చన్నీ
చరణ్‌జిత్ సింగ్ చన్నీ | |
---|---|
జననం | |
విద్య | బి.ఎ, ఎల్.ఎల్.బి , ఎం.బి.ఎ. |
జీవిత భాగస్వామి | కమల్జిత్ కౌర్ |
పిల్లలు | నవజిత్ సింగ్, రిథమ్‌జిత్ సింగ్ |
చరణ్‌జిత్ సింగ్ చన్నీ (జననం: 1963 మార్చి 1) [1] ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను పంజాబ్ రాష్ట్ర 16వ ముఖ్యమంత్రిగా 2021 సెప్టెంబరు 20 నుండి 2022 మార్చి 16 వరకు పనిచేశాడు.[2] చరణ్‌జిత్ సింగ్ చన్నీ భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. గతంలో అమరీందర్ సింగ్ ఆధ్వర్యంలో సాంకేతిక విద్య, శిక్షణ మంత్రిగా, పంజాబ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు.[3]
ప్రారంభ జీవితం, విద్య
[మార్చు]చన్నీ దళిత వర్గానికి చెందిన వ్యక్తి. అతను మక్రోనా కాలన్ గ్రామంలో జన్మించాడు. అతను పంజబ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం, పిటియు జలంధర్ నుండి ఎం.బి.ఎ. చదివాడు.[2] అతనికి వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు.[4]
రాజకీయ జీవితం
[మార్చు]చాన్నీ 2015 నుండి 2016 వరకు పంజాబ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2017లో అమరీందర్ సింగ్ మంత్రివర్గంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక శిక్షణ శాఖ మంత్రిగా నియమించబడ్డాడు.[2]
2021 సెప్టెంబరులో, అతను కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత పంజాబ్ తొలి దళిత సిక్కు ముఖ్యమంత్రిగా నియమించబడ్డాడు.[2] చరణ్ జిత్ చన్నీ 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో చమ్‌కౌర్ సాహిబ్, భదౌర్ నియోజకవర్గాలనుండి శాసనసభకు పోటీ చేసి ఓడిపోయాడు.[5] అతను 2023 ఆగస్ట్ 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Ministers". punjabassembly.nic.in. Retrieved 2021-09-20.
- ↑ 2.0 2.1 2.2 2.3 Sep 19, TIMESOFINDIA COM / Updated:; 2021; Ist, 20:24. "Charanjit Singh Channi: Who is Charanjit Singh Channi, the new Punjab chief minister | India News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-20.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link) - ↑ The Economic Times (6 June 2024). "Bullish Wins & Bearish Losses: Here are the key contests and results of 2024 Lok Sabha polls". Archived from the original on 27 July 2024. Retrieved 27 July 2024.
- ↑ Sharma, Manraj Grewal (19 September 2021). "Who is Charanjit Singh Channi, the man all set to be next Punjab CM?". The Indian Express.
- ↑ Andhra Jyothy (10 March 2022). "రెండు చోట్లా ఓడిన సీఎం చన్నీ". Archived from the original on 10 March 2022. Retrieved 10 March 2022.
- ↑ Namasthe Telangana (20 August 2023). "కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పునరుద్ధరించిన ఖర్గే.. సచిన్ పైలట్, శశిథరూర్, రఘువీరాలకు చోటు". Archived from the original on 20 August 2023. Retrieved 20 August 2023.