Jump to content

చరణ్ నార్జారీ

వికీపీడియా నుండి
చరణ్ నార్జారీ

పదవీ కాలం
1977–1980
ముందు డి. బాసుమతారి
తరువాత సమర్ బ్రహ్మ చౌదరి
నియోజకవర్గం కోక్రాఝర్

వ్యక్తిగత వివరాలు

జననం (1933-05-28)1933 మే 28
హతిమత గ్రామం, గోల్పారా జిల్లా , అస్సాం , బ్రిటిష్ ఇండియా
మరణం 2019 జులై 23(2019-07-23) (వయసు: 86)
గౌహతి, అసోం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ప్లెయిన్ ట్రైబల్స్ కౌన్సిల్ ఆఫ్ అస్సాం
జీవిత భాగస్వామి భబానీ బ్రహ్మ దత్త
సంతానం ధరిత్రి నర్జారీ, సంగ్రిలా నర్జారీ, కహినూర్ నర్జారీ, మినిలా నర్జారీ, సామ్రాట్ నర్జారీ
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

చరణ్ నర్జారీ (28 మే 1933 - 23 జూలై 2019) అసోం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోక్రాఝర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

చరణ్ నార్జారీ స్వతంత్ర అభ్యర్థిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కోక్రాఝర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ధరణీధర్ బసుమతారిపై 42903 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 1996 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 122609 ఓట్లతో 5వ స్థానంలో, 1998 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 115875 ఓట్లతో 4వ స్థానంలో నిలిచాడు.[2]

మరణం

[మార్చు]

చరణ్ నర్జారీ వయస్సు సంబంధిత సమస్యల కారణంగా అనారోగ్యంతో బాధపడుతూ 2019 జూలై 23న గౌహతిలోని డౌన్ టౌన్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించాడు.[3][4][5]

మూలాలు

[మార్చు]
  1. "Kokrajhar Lok Sabha Election - Assam". Hindustan Times. 2024. Archived from the original on 28 July 2025. Retrieved 28 July 2025.
  2. "Kokrajhar Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2024. Archived from the original on 28 July 2025. Retrieved 28 July 2025.
  3. "Veteran political leader Charan Narzary passes away at a private hospital in Guwahati" (in ఇంగ్లీష్). Sentinel Digital. 24 July 2019. Archived from the original on 28 July 2025. Retrieved 28 July 2025.
  4. "Bodo movement leader Charan Narzary passes away at 87". NorthEast Now. 23 July 2019. Archived from the original on 28 July 2025. Retrieved 28 July 2025.
  5. "Veteran tribal leader Charan Narzary remembered on 6th death anniversary" (in ఇంగ్లీష్). Sentinel Digital. 24 July 2025. Archived from the original on 28 July 2025. Retrieved 28 July 2025.