చర్చ:ఆంధ్ర విశ్వవిద్యాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రవిశ్వకళా పరిషత్తు vs. ఆంధ్ర విశ్వవిద్యాలయం[మార్చు]

ఈ వ్యాసంలో ఆంధ్రవిశ్వకళా పరిషత్తు బొమ్మను చేర్చారు. కానీ, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి, విశ్వకళా పరిషత్తుకు ఉన్న సంబందాన్ని వివరించలేదు. ఈంతకీ ఈ రెండిటికీ ఉన్న సంబంధమేమిటి? __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 15:07, 21 మే 2007 (UTC)

ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటగా ఆంధ్రవిశ్వకళా పరిషత్తుగా ప్రారంభమయింది. ఆ తరువాత ఎప్పుడో పేరు మార్చారని విన్నాను --వైఙాసత్య 15:12, 21 మే 2007 (UTC)
ఇప్పుడే ఈ పేజీని చూసాను. ఇక్కడ ఇదే లోగోను వారి లోగోగా ప్రకటించారు. ఇంకొంచెం పరిశోధిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయేమో. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 16:24, 21 మే 2007 (UTC)
ఆంధ్ర విశ్వ కళాపరిషత్ 1926 లో స్థాపించబడింది కదా, వారి వెబ్ సైటు ప్రకారం. 1925 లో స్థాపించబడిందని వ్రాశారెందుకు? దానిని 1926 కు మార్చాను. అభ్యంతరం లేదుకదా. ----కంపశాస్త్రి 03:36, 30 ఆగష్టు 2007 (UTC)

ఆంధ్ర విశ్వకళాపరిషత్ అన్నా విశ్వవిద్యాలయం అన్నా ఒకటేనని అనుకుంటున్నాను. నేను వైజాగ్ వెళ్లినప్పుడు ఆంధ్రా యూనివర్శిటీ అని ఆంగ్లంలో, ఆంధ్ర విశ్వకళాపరిషత్ అని తెలుగులో బోర్డు ఉన్నట్టు గుర్తు. ఐనా పూర్వం ఆంధ్ర విశ్వకళాపరిషత్ అని వ్యవహరించేవారు కనుక గతం గురించిన వ్యాసాల్లో ఆ పేరుతో లింకులు ఎర్ర అక్షరాలతో ఉన్నాయి కనుక ఇక్కడ ఆ పేరుతో రీడైరెక్ట్ చేయడం మంచిదని నా సూచన. --Pavan santhosh.s (చర్చ) 05:06, 25 జనవరి 2014 (UTC)

రెండూ ఒక్కటే. నేను అక్కడ చదువుకున్నవాడినే. స్థాపించినప్పుడు ఆంధ్ర విశ్వకళాపరిషత్తు అనేవారు; తర్వాత ఆంధ్ర విశ్వవిద్యాలయంగా మారింది.Rajasekhar1961 (చర్చ) 05:21, 25 జనవరి 2014 (UTC)