చర్చ:ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2015 సంవత్సరం, 23 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

శుద్ధి అనుభవాలు[మార్చు]

User:Sathishdesicrew చేసిన ఈ అనువాదం వ్యాసాన్ని శుద్ధి పరచే ప్రయత్నంలో నా అనుభవాలు చేరుస్తున్నాను. ఇటువంటి వ్యాఖ్యలు ఇతర వ్యాసాలు శుద్ధిచేయడానికి సహాయపడతాయని భావిస్తాను. ఈ అనువాద వ్యాసం శుద్ధికి ముందు నాణ్యతలో అతి తక్కువ స్థాయిలో వుంది. మూల వ్యాసం లో కొంత నాణ్యతదోషాలున్నాయి కాని అనువాదంలో మరింత దోషాలు పెరిగినట్లనిపించింది. వాక్యాలలోఅంశాలు మరలమరల కనబడుతాయి. పేరాకు సమగ్రత వుండదు. బొమ్మలు, మూసలు ఆంగ్లం నుండి దిగుమతి కాలేదు. విపరీతంగా ఆంగ్ల పదాలు వాడడం జరిగింది. శుద్ధిచేయడానికి కనీసం ఏడెనిమిది గంటలు పట్టింది. బొమ్మలు కొన్ని మళయాళ వికీవ్యాసం నుండి అలాగే ఇటీవలి బొమ్మలు అంగ్ల వికీనుండి చేర్చాను. లోగో తెలుగువికీలో సముచిత వినియోగం క్రింద చేర్చాను. పెద్ద కంప్యూటర్ తెర వుంటేనే ఆంగ్లమూలం మరియు తెలుగు అనువాదం ప్రక్కప్రక్కన పెట్టుకుని అనువాదం శుద్ధి చేయటం సులభం అవుతుంది. సాధారణ తెలుగు వికీ సభ్యులు ఇలా చేయటం కష్టం అందుకనే గూగుల్ అనువాద వ్యాసాలు శుద్ధి ఎవరికీ చేయాలనిపించుటలేదు. ఇతర సభ్యులు కూడా వారి అనుభవాలు ఆయా చర్చాపేజీలలో చేర్చి ప్రాజెక్టు పేజీలో లింకులిస్తే, వీటిపై తదుపరి పని నిర్ణయించడంలో సహాయపడుతుంది. --అర్జున (చర్చ) 10:22, 31 మే 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఐఐటిలకు సంబంధించి తెలుగులో డిజిటల్ మూలాల కోసం వెతికితే, ఇటీవలి అంబేద్కర్ పెరియార్ విద్యార్ధి సమూహం వార్తలను తప్పించి మిగతా ఏవి తెలుగు లింకులు కనబడలేదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి విద్యాఅనుబంధాలలో వీటి గురించి వ్యాసాలు వచ్చివుండవచ్చు కాని అవేమి నెట్లో దొరకుటలేదు. దీనిని బట్టి చూస్తే తెలుగు వికీపీడియా ఈ కాలంలో కూడా నెట్లో ప్రముఖ వనరుగా వున్నదని అనుకోవాలి. --అర్జున (చర్చ) 05:17, 1 జూన్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]