చర్చ:కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు
స్వరూపం
ఈ వ్యాసమును ఇంత పేరుతో కంటే కుదించి కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు అని పెడితే వెదికే వాళ్ళకు అందుబాటులో ఉంటుంది..విశ్వనాధ్ (చర్చ) 06:00, 20 సెప్టెంబర్ 2012 (UTC)
వ్యాధుల వివరాలు/పుటలు లేవు
[మార్చు]ఈ వ్యాసము కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధుల జాబితా మాత్రమే. ఇందులో పేర్కొన్న వ్యాధుల వివరాలు, ప్రత్యేక పుటలు చాలాకాలంగా లేవు. చేరిస్తే బావుంటుంది. ధన్యవాదాలు VJS (చర్చ) 03:16, 16 డిసెంబరు 2022 (UTC)
- @Vjsuseela గారూ, ఈ వ్యాసం అస్సలు చదవడానికి అనువుగా లేదు. ఎవ్వరూ దీన్ని మెరుగుపరుస్తున్న దాఖలా కూడా లేదు. నేను తొలగింపుకు ప్రతిపాదించాను. ఆ ప్రతిపాదన పేజీలో మీ అభిప్రాయం రాయండి. పవన్ సంతోష్ (చర్చ) 05:27, 22 జూన్ 2023 (UTC)
- నా అభిప్రాయం రాయమన్నందుకు మీకు ధన్యవాదాలు. తెలుగు వికీపీడియా లో నేను గమనించింది ఏమంటే, ఒక విషయం (subject) మీద అనేక రచయతలు వ్రాస్తున్న /వ్రాయగల వ్యాసాలు 2 రకాల సమూహాలుగా అగుపడుతున్నాయి.
- 1. వర్గాలు/ఉపవర్గాలు - వ్యాసానికి వర్గం/ఉపవర్గం చేర్చడము ద్వారా వ్యాసము యాంత్రికంగా వర్గీకరణము అవుతుంది. దీని వలన సైద్ధాంతికంగా సమస్య లేదు. (నాకు ఎదురైన సమస్యను మరొకసారి సందర్భానుసారం ప్రస్తావిస్తాను).
- 2. జాబితాలు - ఈ పుట సృష్టించినవారు తమకు ఉండే విషయం పరిజ్ఞానం అనుసరించి వివిధ వ్యాసాలకు శీర్షికలు తయారు చేస్తారు. వీరే అన్ని వ్యాసాలు వ్రాసి లంకెలు ఏర్పరచుట ఒక సమాచారం /సూచికలా ఉంటుంది. కానీ ఇతరులు చూసి రాస్తారు అని వదిలితే ఎవరికీ ముఖ్యముగా (బయట నుండి) సమాచారం శోధించేవారికి ఉపయోగము లేదు. ఇలాంటి జాబితాలు తొలగించవచ్చు. లేదా ప్రత్యామ్నాయముగా ఈ ఉపయోగపడే జాబితాలన్నింటిని ఒక వర్గములో ఉంచి రచయితలకు రాయవలసిన అంశాల గురించి మార్గదర్శకముగా సూచించవచ్చు. VJS (చర్చ) 10:20, 22 జూన్ 2023 (UTC)
- @Vjsuseela మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. నిజమే. మనం సమాచారం కోసం చూసేవారి దృక్కోణాన్ని పట్టించుకోవాలి. చదవడానికి వీలుగా లేని జాబితాని వికీపీడియా పేరుబరిలో ఎక్కడో ఒకచోట పెట్టవచ్చునేమో కానీ మొదటి పేరుబరిలో ఉంచకూడదని నాదీ సూత్రప్రాయంగా అభిప్రాయం. దీన్ని మనం ఒకసారి నిర్వాహకుల నోటీసుబోర్డులోనో, మరెక్కడో చర్చించి నిర్ణయిద్దాం. ప్రస్తుతానికి వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు అన్న దగ్గర ఆ వ్యాసాన్ని ఏం చేయాలన్నదానిపై మీ సూచన రాయండి. పవన్ సంతోష్ (చర్చ) 12:44, 22 జూన్ 2023 (UTC)
- ప్రధాన వ్యాసంగా తొలగించడమే సముచితము. చాలా కంటెంట్ వుంది కాబట్టి వీలయితే రచయితల కొరకు భద్రపరచ వచ్చేమో పరిశీలించండి. VJS (చర్చ) 14:15, 22 జూన్ 2023 (UTC)
- @Vjsuseela మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు. నిజమే. మనం సమాచారం కోసం చూసేవారి దృక్కోణాన్ని పట్టించుకోవాలి. చదవడానికి వీలుగా లేని జాబితాని వికీపీడియా పేరుబరిలో ఎక్కడో ఒకచోట పెట్టవచ్చునేమో కానీ మొదటి పేరుబరిలో ఉంచకూడదని నాదీ సూత్రప్రాయంగా అభిప్రాయం. దీన్ని మనం ఒకసారి నిర్వాహకుల నోటీసుబోర్డులోనో, మరెక్కడో చర్చించి నిర్ణయిద్దాం. ప్రస్తుతానికి వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధులు అన్న దగ్గర ఆ వ్యాసాన్ని ఏం చేయాలన్నదానిపై మీ సూచన రాయండి. పవన్ సంతోష్ (చర్చ) 12:44, 22 జూన్ 2023 (UTC)
- నిజానికి ఇది వ్యాసం కాదు. ఒక రకమైన జాబితా. వ్యాధుల వర్గీకరణలో ఒక భాగంగా ఆంగ్ల వికీపిడియా నుండి అనువాదం చేయబడినది. చాలా శ్రమపడ్డారు. దయచేసి అలాగే ఉంచమని కోరుతున్నాను. వ్యాసం పేరును కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధుల జాబితా లేదా కండరాలు, ఎముకలు, కణజాల వ్యాధుల వర్గీకరణ గా మార్చండి. అప్పుడు ఏ సమస్యా తలెత్తదు. --Rajasekhar1961 (చర్చ) 10:55, 6 జూలై 2023 (UTC)