చర్చ:కన్యాశుల్కం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గురజాడ మహాకవి రచించిన గొప్ప నాటకం కన్యాశుల్కం. నిజానికి తెలుగు సాహిత్యలోకంలో కన్యాశుల్క నాటకం ద్రువతార. ఇందులో సమాజమంతా ఉంది. సమాజంలోని అన్ని మనస్తత్వాల వ్యక్తులు ఇందులో ఉన్నారు. వ్యావహారిక భాషలో గురజాడ ఈ నాటకాన్ని రచించి గిడుగు రామమూర్తి గారి వ్యావహారిక భాషోద్యమానికి చేయూతనిచ్చాడు. కన్యాశుల్కంలో సమకాలీన సామాజిక సమస్యలన్నీ గురజాడ వివరించాడు. మధుర వాణి, గిరీశం, రామప్పంతులు, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధాని, కరటక శాస్రి, వెంకటేశమ్, బుచ్చమ్మ వంటి పాత్రలు సజీవ శిల్పాలు.