చర్చ:కన్యాశుల్కం (నాటకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


కాపీ హక్కులు

[మార్చు]

నేను ఈ వ్యాసాన్ని ఈమాట నుండి సంగ్రహించాను. దీన్ని వికీపీడియాకు అనుగుణంగా మార్చగలరు. -- శ్రీనివాస 11:53, 21 నవంబర్ 2006 (UTC)

కాపీహక్కుల సంగతి ఆలోచించాలేమో? --వీవెన్ 13:30, 21 నవంబర్ 2006 (UTC)
ఈ వారం వ్యాసాల పరిగణలో ఉన్నందున ఈ వ్యాసంకాపీ హక్కులు విషయం పరిశీలిస్తున్నాను. కాపీ హక్కులు స్పష్టంగా లేవు. "ఈమాట"లో ఈ వ్యాసం రచయిత "ద్వా.నా.శాస్త్రి". గారి అనుమతి తీసుకున్నట్లు అనిపించడం లేదు. ఈ విషయమై ఇంతకు ముందు నేను శ్రీ సురేష్ కొలిచాల గారితో మెయిల్ ద్వారా కొంత సంభాషణ జరిపాను. ఈ మాట పత్రికకు అభ్యంతరం లేదు గాని రచయిత అనుమతి మాత్రం మనం (వికీపీడియా) నేరుగా తీసుకోవలిసిందే. అంతే కాకుండా చాలా మంది రచయితలు "వికీపీడియాలో ప్రచురించడానికి అనుమతి" ఇస్తారు. అలాగయినా లాభం లేదు. GFDL లైసెన్సుకు అనుమతిగా రచనను సమర్పిస్తేనే ఆ కృతిని వికీలో ఉంచగలం. ఎవరికైనా ద్వా.నా.శాస్త్రి గారితో పరిచయం ఉన్నట్లయితే వారి అనుమతి లభిస్తుందేమో ప్రయత్నించ గలరు. అలా కాని పక్షంలో వ్యాసాన్ని లేదా అందులో అధిక భాగాన్ని తొలగించాలి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 08:47, 25 జూలై 2008 (UTC)[ప్రత్యుత్తరం]
క్రమంగా ఈ వ్యాసాన్ని మార్పులు చేస్తూ వికీశైలిలో సమాచారాన్ని మూలాల నుంచి స్వీకరించి రాస్తూన్నాను. కొద్ది రోజుల్లోనే కాపీహక్కులున్న వ్యాస భాగాలను తొలగించి సర్వ సుందరమైన అచ్చమైన తెవికీ వ్యాసాన్ని తయారుచేసుకోగలమని ఆశిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:45, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తొలి కూర్పు - మలి కూర్పు

[మార్చు]

కన్యాశుల్కం నాటకం రెండు కూర్పులుగా వెలువడింది. మొదట 19వ శతాబ్ది చివరి భాగంలో గురజాడ కన్యాశుల్కము ప్రచురించగా, మళ్ళీ దాన్ని 1909లో తిరగరాసినంత పనిచేసి చాలా ప్రధానమైన మార్పులు చేసి మలికూర్పుగా ప్రచురించారు. నిజానికి కన్యాశుల్కానికే తలమానికమైన మధురవాణి ఉదాత్తత రెండవ కూర్పులోదే, అలానే అనేక రసవత్తరమైన సంభాషణలు, డామిట్ కథ అడ్డంగా తిరిగింది అన్న గిరీశం డైలాగు మొదలైనవెన్నో రెండవ కూర్పులోనివే. కానీ మొదటి కూర్పుతో దీనికి చెప్పుకోదగ్గంత భేదాలే కాక, చాలా చాలా పోలికలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కథ, పాత్రలు వంటివి రాసినప్పుడు ప్రతి సారీ అప్రసిద్ధ మొదటి కూర్పును ప్రస్తావిస్తూ అందులో ఇలా ఉంది అని రాస్తే మెరుగా? లేకుంటే రచన నేపథ్యంలో ప్రస్తావించి వదిలి మిగతా భాగమంతా రెండవ కూర్పునే కన్యాశుల్కముగా ప్రస్తావించి, మొదటి కూర్పు కోసం వేరే వ్యాసం ఒకటి రాస్తే మేలా? షేక్స్పియర్ పడ్డ అవస్థలో నోనొనో గురజాడ పడ్డ అవస్థలో పడ్డాను, ఏవంటారు మైడియర్ ఫెలో వికీపీడియన్స్? :) --పవన్ సంతోష్ (చర్చ) 06:40, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసాన్ని రెండో కూర్పు గురించి రాసి, మొదటి కూర్పు గురించి, ఈ రెంటికీ ఉన్న తేడాలగురించీ ఒక విభాగాన్ని కేటాయిస్తే సరిపోతుంది. లేదంటే వేరే వ్యాసం రాయొచ్చు. __చదువరి (చర్చరచనలు) 09:18, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]
సరేనండీ. అలాగే చేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:21, 1 అక్టోబరు 2016 (UTC)[ప్రత్యుత్తరం]