చర్చ:కలవారి కోడలు (గేయం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుచున్నది పప్పు కడవలో పోసి

అప్పుడే యేతెంచె ఆమె పెద్దన్న కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు నింపె

ఎందుకూ కన్నీరు ఏమి కష్టంబు? తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు

ఎత్తుకో బిడ్డను ఎక్కు అందలము నీ అత్తమామలకు చెప్పిరావమ్మా!

పట్టె మంచము మీద పడుకున్న మామా మా అన్నలొచ్చారు మమ్మంపుతారా?

నేనెగ నేనెరుగ మీ అత్తనడుగు

కుర్చిపీటమీద కూర్చున్న అత్తా మా అన్నలొచ్చారు మమ్మంపుతారా?

నేనెరుగ నేనెరుగ మీ బావనడుగు

భారతము చదివేటి ఓ బావగారూ మా అన్నలొచ్చారు మమ్మంపుతారా?

నేనెరుగ నేనెరుగ మీ అక్కనడుగు

వంటజేసేతల్లి ఓ అక్కగారూ మా అన్నలొచ్చారు మమ్మంపుతారా?

నేనెరుగ నేనెరుగ నీ భర్తనడుగు

రచ్చలో మెలిగేటి రాజేంద్రభోగీ మా అన్నలొచ్చారు మమ్మంపుతారా?

కట్టుకో చీరలు పెట్టుకో సొమ్ములు పోయిరా సుఖముగా పుట్టినింటికిని!

ఇది నా చిన్నప్పుడు కంఠతా పట్టి అప్పజెప్పిన పాట.రాసిందెవరో తెలియదు.దీనినే తెలంగాణాలో బతుకమ్మ ఉయ్యాలపాటగా ఇలా పాడుతారు:


కలవారి కోడలు ఉయ్యాలో కలికి కామాక్షి ఉయ్యాలో కడుగుతున్నది పప్పు ఉయ్యాలో కడవల్లో బోసి ఉయ్యాలో అప్పుడే వచ్చాడు ఉయ్యాలో ఆమె పెద్దన్న ఉయ్యాలో కాళ్ళకు నీళ్ళిచ్చి ఉయ్యాలో కన్నీరు నింపె ఉయ్యాలో ఎందుకూ కన్నీరు ఉయ్యాలో ఏమి కష్టాలు ఉయ్యాలో తుడుచుకో చెల్లెలా ఉయ్యాలో ముడుచుకో కురులు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో ఎక్కు అందలము ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో కట్టుకో చీరె ఉయ్యాలో మీ అత్తమామలకు ఉయ్యాలో చెప్పి రావమ్మా ఉయ్యాలో కుర్చీ పీటమీద ఉయ్యాలో కూర్చున్న అత్త ఉయ్యాలో మా అన్నలొచ్చిండ్రు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో నీ మామనడుగు ఉయ్యాలో పట్టె మంచం మీద ఉయ్యాలో పండుకున్న మామ ఉయ్యాలో మా అన్నలొచ్చిండ్రు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో నీబావ నడుగు ఉయ్యాలో భారతం చదివేటి ఉయ్యాలో బావ పెదబావ ఉయ్యాలో మాఅన్న లొచ్చిండ్రు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో మీ అక్కనడుగు ఉయ్యాలో వంటలు చేసేటి ఉయ్యాలో ఓ అక్కగారు ఉయ్యాలో మాఅన్న లొచ్చిండ్రు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలో నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో నీభర్త నడుగు ఉయ్యాలో రచ్చలో కూచున్న ఉయ్యాలో రాజేంద్రభోగి ఉయ్యాలో మాఅన్న లొచ్చిండ్రు ఉయ్యాలో మమ్మంపు తార ఉయ్యాలో పెట్టుకో సొమ్ములు ఉయ్యాలో కట్టుకో చీర ఉయ్యాలో పోయిరా సుఖముగా ఉయ్యాలో పుట్టింట్లో పెళ్ళికి ఉయ్యాలో ఇరుగు పొరుగులార ఉయ్యాలో ఓ అమ్మలార ఉయ్యాలో చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఉయ్యాలో చేయించి మళ్ళొత్తా ఉయ్యాలో