చర్చ:కోపర్నీషియం

వికీపీడియా నుండి
(చర్చ:కోపర్నిషీయం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మరియు, యొక్క తొలగింపు[మార్చు]

వెంకటరమణ గారూ నమస్తే. అత్యావశ్యకమైన ఇటువంటి వ్యాసాలను అభివృద్ధి చేసినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసంతో పాటు అనేక వ్యాసాల్లో నేను గమనించిన వ్యాకరణ సమస్యలను వికీపీడియా:శైలి/తరచు జరుగుతున్న వ్యాకరణ, భాషా దోషాలు అన్న పేజీ దగ్గర జాబితా వేశాను. వాటన్నిటిలో అగ్ర తాంబూలం - మరియు, యొక్క- అన్న రెండు పదాలకు దక్కుతుంది.

  1. మరియు: ఇది ఇంగ్లీష్ Andకు సమానార్థకంగా మనవారు వాడుతున్నారు. ఎక్కువగా అనువాదాల్లోనే వస్తుంది. ఐతే చాలా వ్యాసాల్లో ఒక్క మరియు కూడా లేకుండా సుబోధకంగా వ్యాసాన్ని రాసేవయచ్చు. అందుకు "," (కామా) ఒక్కటీ చాలు.
  2. యొక్క: సమాసంలో అదృశ్యంగా ఉండేదీ, విగ్రహవాక్యాలు నేర్పించేప్పుడు తప్ప ఆధునిక వచనంలో ఉపయోగం లేనిదీ - "యొక్క". మరియు అన్నదానికైనా, కామా అవసరమవుతుందేమో కానీ యొక్క తీసివేస్తే చాలా సందర్భాల్లో ఏ మార్పూ అక్కరలేదు. ఒక్కొక్కసారి ఈ దేశం యొక్క మట్టి అన్నది ఈ దేశపు మట్టి అని మార్చాల్సిరావచ్చు.

ఇవి నా అభిప్రాయాలు, ఐతే మీ ఉద్దేశాలను కూడా చెప్పగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 07:16, 27 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారు, మీ సూచనలను సరైనవి. అనేక వేల బైట్ల ఆంగ్ల వ్యాసాన్ని శుద్ధి చేసే క్రమంలో ఇలాంటి అనువాద పొరపాట్లు వస్తాయి. నేను విస్తరించిన టైగర్ ప్రాజెక్టు వ్యాసాలలో ఈ మార్పులు చేసాను. ఇలాంటివి ఇతర వ్యాసాలలో కూడా ఉండవచ్చు కనుక ఆటోవికీబ్రౌజరు ద్వారా శుద్ధి చేయవచ్చు. నా అభ్యంతరం లేదు. మన లక్ష్యం నాణ్యమైన వ్యాసం.--కె.వెంకటరమణచర్చ 09:59, 27 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కె.వెంకటరమణ గారూ! సూచనలను సూటిగా స్వీకరించినందుకు మీకు ధన్యవాదాలు. వేల బైట్ల ఆంగ్ల వ్యాసాన్ని శుద్ధి చేసేప్పుడు పొరపాట్లు వస్తాయి. నిజమే! అయితే అన్నీ సెమీ-ఆటోమేషన్ ద్వారా ఏడబ్ల్యుబీతో అవ్వవు. సాధారణంగా ఏ రచన అయినా మరొకరి కన్ను దాటి పోకుండా వ్యాకరణాది విషయాల్లో సరికాదనే చెప్తారు, సంపాదకుని అవసరం ఎంతటి రచయితకన్నా ఉంటుంది. మరో చెంప, ఎందరు వాడుకరులు రాస్తే అంత మెరుగ్గా వ్యాసం అవుతుందన్న అధ్యయనాలూ ఉన్నాయి. కాబట్టి ఎవరు రాసినా మరొకరు శుద్ధి చేయడానికి ముందుకువచ్చి, అభివృద్ధి చేస్తే ఈ సమస్యలు పరిష్కరించవచ్చు. మన తెలుగు వికీపీడయిన్లకు ఈ విషయం సూచించి, తదుపరి ప్రయత్నాలు చేద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 06:09, 28 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
మీరన్నట్లు మానవీయంగా చేయడమే మంచిదనిపించింది. find and replace ద్వారా చేసినా కొన్ని వాక్యాల నిర్మాణంలో దోషాలు వస్తున్నాయి. కనుక ఒక్కొక్కటి సరిచేసినప్పుడు ఏర్పడిన వాక్య నిర్మాణ దోషాలు తెలుసుకొని మానవీయంగా చేసాను. ఇక ముందు వ్యాసాలలో ఇటువంటి తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాను. మరొకరు రాసిన వ్యాసాలలో ఇటువంటివి ఉంటే సరిచేస్తాను. --కె.వెంకటరమణచర్చ 06:28, 28 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]