Jump to content

చర్చ:ఖాదర్ పాషా దర్గా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి


నాయుడుగారి జయన్న గారూ, ఈ వ్యాసంలో మీరు, నిత్య ఆరాధన, మరియు కొలవడం లాంటి పదాలు వాడారు. కానీ ఈ పనులు దర్గాలలో చేయరు, ఫాతిహా ఖ్వానీ (చదివింపులు), గౌరవాభినందనలు చేస్తారు. ఔలియా కీర్తన (గౌరవాభినందన) లు వేరు, అల్లాహ్ కీర్తన (స్తోత్రం) వేరు. అల్లాహ్ కీర్తనను హమ్ద్ అనీ ఔలియాల కీర్తనను "మన్కబత్" అనీ అంటారు. ఔలియా అల్లాహ్ అనగా అల్లాహ్ యొక్క సన్నిహితులు. అన్యదా భావింపకండి, కేవలం విషయ పరిచయం కొరకు మాత్రమే వ్రాస్తున్నాను. అహ్మద్ నిసార్ (చర్చ) 18:16, 19 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు

[మార్చు]

అహ్మద్ నిసార్ గారూ! నమస్కారాలు. ఇందులో అన్యదా భావించవలసినదేమీ లేదు. మీకింకా ధన్యవాదాలు. తెలియని విషయాలు తెలియజేసినందుకు. వీటి గురించిన పూర్తి అవగాహనలేకపోవడం వలన వాటిని సమానార్థకాలుగా మాత్రమే వాడాను, మీరు సూచించిన విధంగానే సవరిస్తాను, కృతజ్ఞతలు.Naidugari Jayanna (చర్చ) 14:01, 20 సెప్టెంబరు 2014 (UTC)[ప్రత్యుత్తరం]