చర్చ:గద్వాల పురపాలక సంఘము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వేరే వ్యాసం అవుసరమా?[మార్చు]

ఇలా పురపాలక సంఘాలకు వేరే వ్యాసాలు అవుసరమా? గద్వాల వ్యాసమే అంతంత మాత్రంగా ఉంది. ఈ వ్యాసాన్ని గద్వాల వ్యాసంతో కలిపేయవచ్చును గదా? - మీ అభిప్రాయాలను చెప్పండి. వ్యాఖ్యలను బట్టి మిగలిన చోట్ల కూడా అదే విధానాన్ని అనుసరిద్దాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 17:34, 3 ఏప్రిల్ 2008 (UTC)

నేను గద్వాల పురపాలక సంఘములో అధికారులను సంప్రదించి చాలా సమాచారము సేకరించాను. కాబట్టి ఆ సమాచారము ఆధారముతో ప్రత్యేక పేజీ ఉండాలని భావించాను. మున్సీపాలిటీ చరిత్ర, వార్డులు, ఇంతవరకు పనిచేసిన మున్సిపల్ చైర్మెన్‌ల పేర్లు, మున్సిపల్ ఎన్నికలు మొదలగు వివరాలతో ప్రత్యేకంగా పురపాలక సంఘం పేరుతో వ్యాసం ఉండటమే బాగుంటుందని నా అభిప్రాయం. ఇది వరకు ఇచ్చాపురం పురపాలక సంఘం వ్యాసం కూడా ఉంది.-- C.Chandra Kanth Rao(చర్చ) 18:11, 3 ఏప్రిల్ 2008 (UTC)
అలాగే --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:27, 3 ఏప్రిల్ 2008 (UTC)

మన వ్యాసం కాపీ[మార్చు]

ఈ వ్యాసంలోని చాలా భాగాన్ని బొమ్మతో సహా timesofap.blogspot.com వాళ్ళు కాపీ చేసినట్లు ఈ మధ్యనే గమనించాను. కనీసం తెలుగు వికీపీడియానుంచి తీసుకున్నట్లు కూడా వ్రాయలేరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 21:06, 29 డిసెంబర్ 2008 (UTC)

వికీలో ఉన్న వ్యాసాలేవీ కాపీ హక్కులున్నవి కావు. నాకు తెలిసి ఎవరయినా వికీ నుండి వ్యాసాలను తీసుకోవచ్చు. తాత్కిలికంగా ఇది తప్పు అనిపించినా దీర్ఘకాలంలో ఇలాంటివి వికీకి మరింత ప్రాచుర్యాన్ని తీసుకురాగలవు. --Svrangarao 22:57, 29 డిసెంబర్ 2008 (UTC)
రంగారావు గారు, చెప్పింది సబబే కానీ, వికీ వ్యాసాలకు కూడా ఇది ఫలానా దగ్గరినుండి తెచ్చుకున్నాం అని చెప్పటం సాంప్రదాయము, మర్యాద, GFDL ప్రకారము అవసరమున్నూ. మరీ గద్దించినట్టు కాకుండా మర్యాదగా ఆ బ్లాగు పోస్టులో వికీకి లింకివ్వమని అడగటం మనం చెయ్యచ్చు --వైజాసత్య 00:42, 30 డిసెంబర్ 2008 (UTC)
వికీ వ్యాసాలను ఎవరూ తీసుకోరాదని నా ఉద్దేశ్యం కాదు. మేము చేసే ప్రతి దిద్దుబాటుకి "మీ రచనలను వేరే ఎవ్వరూ వాడుకోరాదని మీరు భావిస్తే, వాటిని ఇక్కడ ప్రచురించకండి" వాక్యానికి లోబడే చేస్తున్నాము. అయితే కనీసం వ్యాసాన్ని వాడుకున్నవారు ఈ వ్యాసాన్ని నుండి తీసుకున్నాం అని రాస్తే బాగుంటుంది. లేకుంటే మనమే వారి నుంచి కాపీ చేసినట్లు కూడా కొందరు భావించవచ్చు. నేను చర్చ తీయడానికి కారణం అదే. -- C.Chandra Kanth Rao(చర్చ) 14:22, 30 డిసెంబర్ 2008 (UTC)
అవును, నేను నిన్ననే వాళ్ళ బ్లాగులో ఒక వ్యాఖ్య వ్రాశాను --వైజాసత్య 15:09, 30 డిసెంబర్ 2008 (UTC)

ఈ వ్యాసమేగాదు, చాలా వ్యాసాలు కాపీచేశారండోయ్, ఆ బ్లాగు మొత్తం పేజీ ఓసారి గమనించండి.[1] ఉదా; సినిమాలు, సచిన్ టెండూల్కర్, ఉర్దూ భాష మున్నగునవి. వైజాసత్యగారి వ్యాఖ్య ఈరోజు ఆబ్లాగులో చూసాను. నిసార్ అహ్మద్ 16:30, 30 డిసెంబర్ 2008 (UTC)

అవును చాలా వ్యాసాలు కాపీచేశారు. నాకు గూగుల్ సెర్చ్‌లో గద్వాల పురపాలక సంఘం వ్యాసం తగిలితే ఇదొకటే అనుకున్నాను.ఆ బ్లాగులో ఉన్న పెద్ద వ్యాసాలన్నీ మనవే. బొమ్మలు, పట్టికలు, ఇన్ఫోబాక్స్ లతో సహా పూర్తిగా కాపీ చేసి ఒక్క ముక్క కూడా తెవికి గురించి వ్రాయలేదు. మార్టినా నవ్రతిలోవా, ఫిడెల్ కాస్ట్రో, తోకచుక్క, కోతికొమ్మచ్చి, ఇస్రో, శోభన్ బాబు, భారత నావికాదళం, విడుదల వారీగా తెలుగు సినిమాల జాబితా, బ్రాహ్మణగూడెం, ఐఐటి,ఐసిఐసిఐ బ్యాంకు...ఇలా చాలా వ్యాసాలు యధాతథంగా కాపీచేశారు. -- C.Chandra Kanth Rao(చర్చ) 18:07, 30 డిసెంబర్ 2008 (UTC)