చర్చ:చక్రేశ్వరి శివాలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అసహజమైన అనువాదం[మార్చు]

జేవీఆర్కే ప్రసాద్ గారూ ఈ వ్యాసం అసహజమైన అనువాదాలతో, శుద్ధి చేయని యాంత్రికానువాదంతో వుంది. ప్రస్తుత (నవంబరు 13) రివిజన్‌ పరిశీలిస్తే అసహజమైన వాక్యాలే కాక ఆంగ్ల వికీపీడియా వ్యాసం తీసుకుని గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అనువదించి చూస్తే ఇది యాంత్రికానువాదాలు చేసిన ఫలితం అని గమనించాను. గూగుల్ ట్రాన్స్‌లేట్‌ సహా పలు యాంత్రికానువాదాలు ప్రస్తుతం ఆంగ్లం నుంచి తెలుగుకు వ్యాకాల స్థాయిలో నాణ్యమైన అనువాదం అటుంచి కనీసం కొద్దిపాటి అర్థవంతమైన అనువాదాన్ని కూడా ఇవ్వడం లేదన్నది గతంలో తెవికీలో పలుమార్లు చర్చకు వచ్చిన విషయమే. 2010లో గూగుల్ సంస్థ చేసిన అనేక యాంత్రికానువాద ప్రచురణలను సంస్కరించుకోవడానికి మనకి 7 సంవత్సరాల కాలం కూడా సరిపోలేదు. ఈ నేపథ్యంలో దయచేసి ఈ వ్యాసాన్ని సహజమైన భాషలోకి సంస్కరించగలరు.

"గూఢచారులు రెండు చేతుల సాయుధ శైవలు 'ద్వారపాలకులు' 'కుడి చేతుల్లో త్రిశూలాన్ని కలిగి ఉంటాయి మరియు' 'వరద' ' రూపం ఎడమ చేతిలో ఉన్నాయి." అన్నది ప్రస్తుతం మీరు The niches enshrine two armed Saivite dwrapala holding trident in their right hands and varada in left hands. అన్నదానికి చేసిన అనువాదం కాగా, దీన్ని హాయిగా "ఇరువైపులా (గోడలు తొలిచి ఏర్పరిచిన) గూళ్ళలో శైవ ద్వారపాలకులు వారి కుడిచేతుల్లో త్రిశూలం, ఎడమచేతుల్లో అభయముద్రలతో ఉన్నట్టు శిల్పాలు చెక్కారు" అని చేయవచ్చు. ఐతే ఇలా అనువదించాలంటే మనకు తెలియని పదాలను మాత్రమే విడిగా ఏ ఆంధ్రభారతిలోనో, మరేదైనా చోట అనువదించి సరళంగా అనువదించుకోవచ్చు. ఒక్కసారి వాక్యం వాక్యం మొత్తాన్ని గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అనువదించారంటే ఇక దాన్ని మనం మలచడం చాలా కష్టం, ఇబ్బందికరమూను. మీరు ఆ పద్ధతి వల్ల అటు నాణ్యతకీ దెబ్బ, ఇటు మీకు అనువదించడంలో విపరీతమైన కష్టం. కాబట్టి వాక్యాలు, పేరాలు యాంత్రికానువాదం చేయొద్దని, చేసినవి సరళమైన తెలుగులోకి తీసుకురమ్మని సూచిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 13:41, 13 నవంబర్ 2017 (UTC)

పవన్ సంతోష్ గారు, ఈ వ్యాసం అసహజమైన అనువాదాలతో, శుద్ధి చేయని యాంత్రికానువాదంతో వుంది అని మీ అభిప్రాయము చెప్పారు. నేను నాకు తెలిసింది సొంత వాక్యములు, మీరు గమనించ లేదు. ఉదా: యోని పీఠం అనే పదం అసలు గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో లేదు. ఈ పదం ఉందో లేదో వీలయితే ఒకసారి చూడవచ్చు. ఇలాంటి పదాలు నా స్వంతం అనేకం ఉన్నాయి. మీకు అనుభవం ఉన్నట్లు అందరికీ ఉండదు. అయినా మార్చటానికి ప్రయత్నం చేస్తాను. మీకు అత్యవసరం అనుకుంటే, మరేదైన అయితే వ్యాసాన్ని పూర్తిగా తొలగించండి, నాకు అభ్యంతరం ఏమీ లేదు. ఇకముందు నేను ఇలాంటి సరికొత్త సబ్జక్ట్ వ్యాస ప్రయత్నాలు విషయములో జాగ్రత్తగా ఉంటాను. వికీ నాణ్యతకీ దెబ్బ వచ్చేవిధంగా మరియు ఇలా చెప్పించుకోకుండా మరింత జాగ్రత్తగా ఉంటాను.JVRKPRASAD (చర్చ) 14:57, 13 నవంబర్ 2017 (UTC)
ఈ వ్యాసం కొంతవరకు శుద్ధి చేసినందున తొలగింపు మూసను తొలగిస్తున్నాను.--కె.వెంకటరమణచర్చ 16:35, 13 నవంబర్ 2017 (UTC)