చర్చ:తెలంగాణా తల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆంధ్రలో తెలంగాణ తల్లి విగ్రహాల తయారీ[మార్చు]

పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని నత్తారామేశ్వరంలో తెలంగాణ తల్లి విగ్రహాలను ధ్వంసం చేయటానికి సమైక్యాంధ్ర నాయకులు, విద్యార్థులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. శిల్పి కేశవరావుకు హైదరాబాదులో ఓ శాఖ ఉంది. దాని ద్వారా విగ్రహాల తయారీకి ఆర్డర్లు వచ్చాయి. ఆయన నత్తారామేశ్వరంలో వీటి తయారీని మొదలుపెట్టారు. ఇది తెలిసి భీమవరానికి చెందిన సమైక్యాంధ్ర నాయకులు, విద్యార్థులు నత్తారామేశ్వరం వచ్చి విగ్రహాలను పరిశీలించారు. నమూనా విగ్రహం తప్ప మిగిలినవి వారికి కనిపించలేదు. దీంతో వారు శిల్పిని నిలదీశారు. తెలంగాణా నినాదంతో ఆంధ్రలో విగ్రహాలు తయారు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక విగ్రహాల తయారీని విరమించుకుంటానని, హైదరాబాదులో కూడా నిలిపివేస్తానని శిల్పి హామీ ఇవ్వటంతో ఆందోళనకారులు శాంతించారు.తయారైన విగ్రహాల తరలింపు: తెలంగాణా నాయకుల ఆర్డరుపై తయారు చేసిన తెలంగాణా తల్లి విగ్రహాలను ఇక్కడి నుంచి తరలించేందుకు శిల్పి ఏర్పాట్లు చేశారు. విగ్రహాలు ధ్వంసం చేస్తారన్న సమాచారం ముందుగా తెలియడంతో ఆయన వాటిని భద్రపరిచారు.(ఈనాడు7.12.2009)