చర్చ:తెలుగు ఆవిష్కరణలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వ్యాసం పేరు[మార్చు]

వ్యాసం పేరు "తెలుగు ఆవిష్కరణలు" అని కాకుండా "తెలుగు వారి ఆవిష్కరణలు" అని ఉంటే బాగుంటుంది. అంతేకాకుండా ఈ వ్యాసంలో ఆవిష్కరణలు మాత్రమే కాకుండా ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు తెలుగు వారి విశిష్టతలు లేదా తెలుగు నేల విశిష్టతలు అని ఉంటే బాగుంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 20:00, 12 అక్టోబర్ 2010 (UTC)

మీ సూచన బాగుంది. తెలుగు సంస్కృతి అనే పదము ఎలా వుంటుంది. ఇప్పటిదాక దీనిపై సంస్కృతి వ్యాసంలో ఉదహరించటం తప్ప ప్రత్యేక వ్యాసం కనపడలేదు.--అర్జున 03:57, 13 అక్టోబర్ 2010 (UTC)
తెలుగు సంస్కృతి పేరు బాగానే ఉంది కాని ప్రస్తుతం వ్యాసంలో ఉన్న సమాచారానికి ఇది సరిపోదేమో ! సంస్కృతి అంటే ప్రజల ఆచార వ్యవహారాలు, పద్దతులు, వాడకం, జీవన విధానం, కట్టుబాట్లు తదితరాలు. ప్రస్తుతం వ్యాసంలో వీటిపైనా కొన్ని అంశాలున్నాయి కాని పూర్తిగా ఆ అంశాలు లేవు కదా. తెలుగు సంస్కృతి పైన కూడా ఒక ప్రత్యేక వ్యాసం ఉండాలనే మీ అభిప్రాయం బాగుంది. దీనిపైన సమాచారం సేకరణకు కూడా చాలా అవకాశం ఉంటుంది. సి. చంద్ర కాంత రావు - చర్చ 18:44, 13 అక్టోబర్ 2010 (UTC)
అవును. ఈ వ్యాసంలో వివరాలను మరింతగా వర్గీకరించవలసివుంది. తెలుగు ప్రథమాలు వ్యాసంతోఅనుసంధానం చేయవలసివుంది. తెలుగు సంస్కృతి గా మార్చి మెరుగు పరచితే బాగుంటుంది.-- అర్జున 03:26, 14 అక్టోబర్ 2010 (UTC)

తెలుగు ప్రముఖుల నిర్ణయం[మార్చు]

  • ఈ వ్యాసంలో దేశ గౌరవాన్ని అమ్మకానికి పెట్టిన బజారుద్దీన్ పేరు రాశారు కానీ వి.వి.ఎస్.లక్ష్మణ్ పేరు మరిచారు. అజహర్ కనీసం తెలుగు వాడు కూడా కాదు.... కనుక అజహర్ పేరు తొలగించాలి. --శశికాంత్ 03:31, 15 అక్టోబర్ 2010 (UTC)
మీరు చేర్చవచ్చు. తెలుగు ని నేలగానా మాతృభాషగా చూద్దామన్నది అసలైన ప్రశ్న. --అర్జున 10:14, 15 అక్టోబర్ 2010 (UTC)