చర్చ:త్రిపురాంతకం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మ్యాపు పరిమాణం[మార్చు]

User:Chaduvari గారికి, మ్యాపు పరిమాణం పెద్దదిగా వుంచింది ఆ మండలం చుట్టు పక్కల ప్రాంతాలు కనబడటానికి. అది మీకు పెద్దదిగా అనిపిస్తే దానిని పరామితులు సవరించి తగ్గించవచ్చు. దానిని తొలగించటం వలన వికీపీడియా చదువరులకు అవసరమైన పరిసరాల వివరాలు అందవు. మీ సవరణ ఇంకొకసారి పరిశీలించండి. --అర్జున (చర్చ) 04:24, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ, మూడు సంగతులు..
1. సమాచారపెట్టెలో ఒక మ్యాపు ఈ సరికే ఉంది. ఇది రెండో మ్యాపు.
2. ఎడిట్ మోడులో ఈ మ్యాపు ఏదో లోపాన్ని చూపిస్తోంది.
3. మ్యాపు పేజీని మింగేస్తోంది.
__చదువరి (చర్చరచనలు) 04:45, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి,
1. సమచారపెట్టెలోని తొలి పటం కేవల మండల ఆకృతి చూపే రేఖాచిత్రం. దానివలన పరిసరాల గ్రామాలు, పట్టణాలు తెలియవు. ఇక రెండవది ఆంధ్రప్రదేశ్ లో మండలం స్థానం తెలిపేది. ఈ పటం మండల స్థానంతో పాటు పరిసరాల వివరాలు చూపగలిగే వాడుకరి స్పందనలకు తగినట్లు మార్చిచూపే పటం. ప్రస్తుతం OSM లో మండలాకృతి లేదు కావున తొలి పటం అవసరం. ముందుకాలంలో మండలాకృతి చేర్చగలిగితే తొలిపటం తొలగించి దీనిని చేర్చవచ్చు. మండలాలు తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటికే చేర్చారని విన్నాను. కావున పరిశీలించినతరువాత తెలంగాణ మండలాల్లో తొలిపటమునకు బదులు ఈ పటం వుంచవచ్చు.
2. 2010 వికీఎడిటర్ వాడేటప్పుడు సమస్య లేదు. విజువల్ ఎడిటర్ లో పెట్టెలాగా కనబడుతుంది. బహుశా, preview చూపగలిగే శక్తి ప్రస్తుత విజువల్ ఎడిటర్ కు లేదనుకుంటాను.
3. పేజీలో పెద్దదిగా కనబడడం గురించి క్రిందటి స్పందనలో వివరించాను. --అర్జున (చర్చ) 04:59, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, సమాచారపెట్టె లోని మ్యాపుపై నొక్కినపుడు పరిసర గ్రామాలు, పట్టణాలు కనబడే వివరమైన మ్యాపు కనబడేలా పెట్టండి. మొత్తం అన్నీ ఒకే పేజీలో, ఒకే సారి కనబడేలా పెట్టాల్సిన వసరం లేదు కదా!? నేను చెప్పదలచినదల్లా ఒక్కటే.. పేజీలో ఏంపెట్టాలి, ఎంతెంత బొమ్మలు/మ్యాపులు, ఎన్నేసి బొమ్మలు/మ్యాపులు పెట్టాలి అనే విషయంలో మనం విచక్షణ వాడాలి. అనుభవమున్నవారు, మీక్కూడా చెప్పాల్సిన పని లేదు. ఇక, లోపం సంగతి.. నాకు లోపం కనబడింది - లోపసందేశంతో సహా. ఇలాంటి మ్యాపే పెట్టిన వేరే పేజీలు గతంలో చూసాను, వాటిలో అది కనబడలేదు.__చదువరి (చర్చరచనలు) 05:15, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
చదువరి గారికి, మొదటి రెండు పటాలు పెద్ద సమాచారమున్న పటాలు కాదు. ఈ పటమే వివరాలున్న పటము. దీనిపైనే వీక్షకులు ఎక్కువ దృష్టిపెట్టే అవకాశముంది. పటములు ఎక్కువైనందున నాకైతే ఇబ్బంది అనిపించలేదు. ఒక పటము వేయి పదాలకు సమానమని అంటారు కదా. ప్రస్తుత పరిస్థితులలో మంచి పద్ధతి అనుకున్నది నేను వాడాను. అది మీ దృక్పధంలో వేరుగావుండవచ్చు. చర్చల ద్వారానే అందరికీ ఆమోదయోగ్యమైనదిగా మార్చగలము. ఇక లోపం కనబడింది అంటున్నారు దానిగురించి దోషనివేదిక చేయండి లేక చేయటానికి సహకరించండి. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 01:55, 16 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ విషయం నేను లోగడకూడా అర్జునగారి దృష్టికి ఇక్కడ తీసుకు వెళ్లాను.మనం ఒకటి చెపితే, దానికి అర్జున గారు ఇంకొకటి ఏదో చెప్పే అలవాటు ఉందని నాకనిపిస్తుంది. చెప్చినందుకు సానుకూల దృక్పదం ఉన్నట్లు అనిపించదు.అసలు ఇవి గ్రామ వ్యాసాలా లేక పటాల వ్యాసాలా అన్నట్లు ఉంటున్నవి.ప్రతి వ్యాసంలో రెండు మ్యాపులు ఉంటున్నవి.పొనీ అవి సక్రమంగా ఉన్నాయా అంటే అదీ లేదు.పెద్ద మ్యాపుగా కనపడాలి లేదా కావాలనుకుంటే మ్యాపుకు ఒక పేజీ సృష్టించి, ఆ మండల వ్యాసంలో మండల/జిల్లా స్థానం చూపు మ్యాపు ఇక్కడ" ఉంది అని లింకు ఇవ్వచ్చు. కొమరంభీం జిల్లా వ్యాసం చూడండి. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఎవరైతే మాకేంటి అన్నట్లుగా జిల్లా మ్యాపు కొమురం భీమ్ ఫొటోను 3 వంతులు మింగేసింది.ఒక రకంగా చెప్పాలంటే మనం తప్పు చేసినట్లే. అర్జున గారు 2019 జూన్ 12న పటం ఎక్కించినరోజు చూసే ఉంటారు గదా?కనీసం ఆరోజైనా ఒక అబిప్రాయానికి రావాలిగదా?ప్రణయ రాజ్ తనకు అనుభవం లేదనే ఉద్దేశ్యంతో ఈ విషయం స్వయంగా అర్జున గారి దృష్టికి తీసుకు పోవటానికి ఇబ్బంది పడి, అతని కన్నా అనుభవంలేని నాకు కొద్ది రోజుల క్రితం వాట్సాప్ లో "jilla pages lo arjuna garu map pettaru kada, adhi article ni disb chesthundhi. adhi adugali" అని మెసేజ్ పెట్టాడు.సందర్బం వచ్చిందనే ఉద్దేశ్యంతో చెప్పాల్సివచ్చింది. నా ఉద్దేశంలో అనుభవం కన్నా విచక్షణా జ్ఞానం గొప్పదనిభావిస్తాను.నా ఆలోచనలు, అభిప్రాయాలు ఎవరినైనా భాధ కలిగిస్తే క్షంతవ్యుడను.--యర్రా రామారావు (చర్చ) 09:41, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అవును యర్రా రామారావు గారు చెప్పింది నిజమే. సాదా ఫారము వాడి ఫోటోలు ఎక్కించినప్పుడు వాటికి సరైన వివరం రాయడంలేదు, ఇలా అయితే వికీ నిర్వాహణ కష్టం అని... రోజుకొక వ్యాసం రాసే క్రమంలో వికీపీడియా శిక్షణా శిబిరం జరుగుతున్న సమయంలో వ్యాసాన్ని ప్రారంభించి,దానికి సంబంధించిన సమాచారాన్ని ఒక వార్తా వెబ్సైటు నుండి యధాతదంగా కాపీ పేస్టు చేసి దాన్ని సవవరిస్తున్న సమయంలోనే వ్యాసానికి మూస పెట్టి చదువరులు వచ్చిచూసి ఈ వ్యాసం కాపీ పేస్టు చేసి రాసారు అని వారు అనుకుంటారు అని వికీపీడియా గురించి అంతలా శ్రద్ధ తీసుకున్న అర్జున గారికి జిల్లా వ్యాసాలలో అంత పెద్ద పటం పెట్టి వ్యాసాన్ని డిస్ట్రబ్ చేస్తే, అది చదువరులకు ఇబ్బందిగా ఉంటుందన్న ఆలోచన రాలేదా. గతంలో కొన్ని జిల్లా పేజీలలో ఈ పటాలను చూసాను, కానీ మొన్న కొమరంభీం జిల్లా వ్యాసం చూసిన నాకు జిల్లా మ్యాపు కొమురం భీమ్ ఫొటోను 3 వంతులు ఆక్రమించడం చూసి రామారావు గారికి తెలపడం జరిగింది.-- Pranayraj Vangari (Talk2Me|Contribs) 10:20, 15 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు, Pranayraj Vangari గార్లకు, మీరు చర్చలో పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు. పై వాఖ్యలను బట్టి మీకు మ్యాపు పరిమాణం ఎక్కువవటం ఇష్టంలేనట్లుగా తెలిసింది. యర్రా రామారావు గారి సలహాకి (ఆ మండల వ్యాసంలో మండల/జిల్లా స్థానం చూపు మ్యాపు ఇక్కడ ) స్పందన.
పటాలు వ్యాసాలలో వున్నప్పుడే వ్యాసంలోని సమాచారం పటం సహాయంతో అర్థం చేసుకోవడానికి సులువుగా వుంటుంది. ఆ పద్ధతే మనం వికీలో వాడుతాం. ఇక కొమరంభీం జిల్లా వ్యాసం గురించి ప్రస్తావించారు. వ్యాసం ఎలా కనబడుతుంది అనేది, వాడుకరి గణక వ్యవస్థ పై అధారపడుతుంది. నేను వాడేది పెద్ద రిజల్యూషన్ గల మానిటర్ కావున నేను దానికి అనుగుణంగా పెట్టాను. అది మొబైల్ లో సరిగా కనిపిస్తున్నదని నిర్ధారించాను. అయితే ఇలానే వుంచాలని నేనేమి పట్టు పట్టటంలేదు కదా. మొబైల్ వీక్షకులకు (దాదాపు 50 శాతం పైగా) ఎంత సైజు బొమ్మ పెట్టినా చిన్నదిగా నే చూపిస్తుంది. సభ్యులు స్పందనలు వచ్చినప్పుడే దానిని మరింత మెరుగుచేయగలము. అందుకని మీ మానిటర్ ని బట్టి మీరు మ్యాపు పరిమాణాన్ని దిద్దండి. అభ్యంతరమేమిలేదు. ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 02:13, 16 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ మీరు చెప్పినట్లు కొమరంభీం జిల్లా వ్యాసం లో మ్యాప్ పరిమాణం తగ్గించి చూసాను.కానీ మన అవకాశాన్ని బట్టి ఎడమ,మధ్య,కుడి వైపులకు మార్చుకునే సదుపాయం ఉన్నప్పుడే దీనికి పూర్తి సార్థకత ఉంటుంది.దీనిని సరిదిద్దగలరు.--యర్రా రామారావు (చర్చ) 05:18, 16 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

యర్రా రామారావు గారికి, ఈ రూపం చూసి అవసరమైతే ఇంకా మార్చండి. దీనికొరకు మరింత అనుకూలమైన <maplink> వాడాను.--అర్జున (చర్చ) 05:34, 16 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]