చర్చ:పిప్పలి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎర్రలింకుల సంస్కరణ పేరుతో విస్తరించిన వ్యాసమట ఇది. అసలు ఈ వ్యాసం ఎర్రలింకుగా ఎలా ఏర్పడింది.

డిసెంబర్ 2, 2011 న YVSREDDY ఈ వ్యాసమును సృష్టించి 3,097 బైట్లుకు విస్తరించాడు.
డిసెంబర్ 2, 2011 న YVSREDDY చే సృష్టించబడిన పిప్పలి వ్యాసంలోని సమాచారం
పిప్పలు
పిప్పలి చెట్టు
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
P. longum
Binomial name
Piper longum

పిప్పలు లేదా పిప్పలి కారపు రుచిని కలిగిఉండు ఒక మిరియపురకం. దీనిని ఆంగ్లంలో భారతీయ పొడుగు మిరియాలు (Indian long pepper) అంటారు. ఇది ఒక పుష్పించే ఎగబ్రాకే మొక్కగా పెరుగుతుంది. దీనిని పండ్ల కోసం పెంచుతారు. ప్రతి పండులోను చిన్న చిన్న గింజలుంటార్యి. ఆ పండ్లను ఎండబెట్టి సీజనింగ్ చేసి మిరియాలు వలెనే ఉపయోగిస్తారు. ఈ రెండింటిలోనుండే ఆల్కలాయిడ్ పైపరిన్ (piperine) వీటి ఘాటు రుచుకి మూలకారణం.

ఉపయోగాలు[మార్చు]

ఎండబెట్టిన పిప్పళ్లు.

వీటిని ఆహార పానీయములలోను మరియు ఆయుర్వేద ఔషధాలలోను విరివిగా వినియోగిస్తున్నారు.

చరిత్ర[మార్చు]

పిప్పలు క్రీ.పూ ఆరు ఐదు శతాబ్దాల మధ్య గ్రీసుకు చేరింది. తొలిసారిగా దీన్ని ప్రస్తావించిన హిప్పోక్రేట్స్ దీన్ని మసాలా దినుసుగా కాకుండా ఔషధ మొక్కగా వర్ణించాడు.[1] ఐరోపావాసులు కొత్త ప్రపంచాన్ని కనుగొనక ముందు గ్రీకు మరియు రోమన్ ప్రజలకు పిప్పలి చిరపరిచితమైన మరియు ప్రముఖమైన మసాలాదినుసుగా ఉండేది.

మూలాలు[మార్చు]

  1. Maguelonne Toussaint-Samat, Anthea Bell, tr. The History of Food, revised ed. 2009, p.

vargam:పైపరేసి vargam:ఔషధ మొక్కలు


నిర్వాహకుల పొరపాటు వలన తొలగింపబడిన ఈ వ్యాసం తిరిగి పొరపాటున 3 అక్టోబరు 2022‎ న Chaduvari గారిచే సృష్టించబడినది
3 అక్టోబరు 2022‎ న Chaduvari గారిచే సృష్టించబడిన పిప్పలి వ్యాసంలోని సమాచారం
పిప్పలి
పిప్పలి ఆకులు, పండ్లు
శాస్త్రీయ వర్గీకరణ edit
Kingdom: Plantae
Clade: Tracheophytes
Clade: Angiosperms
Clade: Magnoliids
Order: Piperales
Family: Piperaceae
Genus: Piper
Species:
P. longum
Binomial name
Piper longum

పిప్పలి పైపెరేసి వృక్ష కుటుంబం లోని పుష్పించే తీగ. దాని పండు కోసం ఈ తీగను సాగు చేస్తారు. ఈ పండును ఎండబెట్టి, మసాలా దినుసుగా ఉపయోగిస్తారు. దీన్ని భారతీయ పొడవాటి మిరియాలు (పైపర్ లాంగమ్) అనీ తిప్పలి అనీ పిలుస్తారు. దీని రుచి దాని దగ్గరి బంధువు నల్ల మిరియాల (పైపర్ నిగ్రం) రుచిని పోలి ఉంటుంది. కానీ దాని కంటే కారంగా ఉంటాయి.

పిప్పలి పండు లోపల చాలా చిన్నచిన్న గింజలుంటాయి. ఇవి ఒక్కొక్కటి గసగసాల పరిమాణంలో ఉంటుంది. నల్ల మిరియాలలో ఉన్నట్లే, ఇందులో కూడా ఆల్కలాయిడ్ పైపెరిన్ ఉంటుంది. దీని వలన ఈ పండుకు ఘాటుదనం చేకూరుతుంది. పిప్పలి లోని మరొక జాతి పైపర్ రెట్రోఫ్రాక్టమ్, జావా, ఇండోనేషియాలకు చెందినది. ఈ మొక్క పండ్లను మిరపకాయలను పోలి ఉండడం చేత అవే అని భావిస్తారు. ఇవి క్యాప్సికమ్ జాతికి చెందినవి.

చరిత్ర[మార్చు]

పిప్పలి గురించి ప్రాచీన కాలం నుండి ఆయుర్వేదంలో వాడుతున్నారు. ఆయుర్వేదంలో దాని ఔషధ, ఆహార గుణాలను వివరించారు. ఇది సా.పూ. ఆరవ లేదా ఐదవ శతాబ్దంలో గ్రీస్‌కు చేరుకుంది. అయితే హిప్పోక్రేట్స్ దీనిని మసాలాగా కాకుండా ఔషధంగా భావించాడు. కొలంబియన్ మార్పిడికి ముందు, గ్రీకులు, రోమన్లకు పిప్పలి ఒక ముఖ్యమైన, ప్రసిద్ధమైన మసాలా దినుసుగా ఉండేది.

నల్ల మిరియాల పురాతన చరిత్ర తరచుగా పిప్పలితో ముడిపడి ఉంటుంది. ఈ త్రెంటి మధ్య తికమక కూడా ఉండేది. థియోఫ్రాస్టస్ వృక్షశాస్త్రంపై చేసిన తొలి కృషిలో ఈ రెండింటినీ వేరు చేశాడు. రోమన్లకు రెండింటి గురించీ తెలుసు. వాళ్ళు రెంటినీ పైపర్ అనే పిలిచేవారు. ఎండిన నల్ల మిరియాలు, పిప్పలి ఒకే మొక్క నుండి వచ్చాయని ప్లినీ భావించాడు.

గుండ్రని, నల్ల మిరియాలు పన్నెండవ శతాబ్దం నుండి ఐరోపాలో పొడవైన మిరియాల (పిప్పలి)తో పోటీపడటం ప్రారంభించాయి. పద్నాలుగో శతాబ్ది నాటికి పిప్పలిని తొలగించి దాని స్థానాన్ని ఆక్రమించింది. నల్ల మిరియాల చౌకైన, మరింత ఆధారపడదగిన వనరుల కోసం చేసిన అన్వేషణ, ఆవిష్కరణ యుగానికి ఆజ్యం పోసింది.

అమెరికన్ ఖండాలను, మిరపకాయలనూ (స్పానిషులో పిమియంటో అంటారు) కనుగొన్న తర్వాత, పిప్పలికి ప్రజాదరణ మసకబారింది. [1] కొన్ని మిరపకాయలు ఎండినప్పుడు, పొడవాటి మిరియాల (పిప్పలి) ఆకారాన్నీ, రుచినీ పోలి ఉంటాయి. ఐరోపాకు మరింత అనుకూలమైన ప్రదేశాలలో ఇది పెరుగుతుంది. నేడు, సాధారణ వాణిజ్యంలో పిప్పలి చాలా అరుదు.

వ్యుత్పత్తి[మార్చు]

పెప్పర్ అనే పదం పిప్పలి అనే పదం నుండి ఉద్భవించింది. ఈ మొక్క భారతదేశానికి చెందినది. బెల్ పెప్పర్‌లో పెప్పర్ అనే పదం, పూర్తిగా భిన్నమైన మొక్కలను సూచిస్తుంది (క్యాప్సికమ్ కుటుంబంలో). అయితే ఆ పేరు వ్యుత్పత్తి కూడా ఇదే. ఆ వాడుక 16వ శతాబ్దంలో మొదలైంది. [2]

వాడుక[మార్చు]

ఎండిన పిప్పలి
గంథోడ, పిప్పలి వేరు

పిప్పలిని ఇప్పటికీ భారతీయ, నేపాలీ కూరగాయల ఊరగాయలు, కొన్ని ఉత్తర ఆఫ్రికా మసాలా మిశ్రమాలు, ఇండోనేషియా, మలేషియాల్లో వాడతారు. ఇది పిప్పలి అనే పేరుతో భారతీయ కిరాణా దుకాణాల్లో సులభంగా అందుబాటులో ఉంటుంది. పాకిస్తాన్ లోను, లక్నో లోనూ ప్రజలు తినే నిహారి వంటకంలో వాడే ప్రధానమైన మసాలా దినుసు పిప్పలి. మధ్యయుగ కాలంలో ఐరోపా వంటకాల్లో "స్ట్రాంగ్ పౌడర్" వంటి మసాలా మిశ్రమాలలో పిప్పలిని వాడినప్పటికీ, ప్రస్తుత కాలంలో దీన్ని చాలా అరుదుగా వాడతారు.

మూలాలు[మార్చు]

  1. (June 1980). "Connaissez-vous le poivre long?".
  2. "Pepper entry in Online Etymology Dictionary". Douglas Harper. February 18, 2016.

డిసెంబర్ 2, 2011 న YVSREDDY చే సృష్టించబడి 3,097 బైట్లకు విస్తరించబడిన ఈ పిప్పలి వ్యాసమును పొరపాటున నిర్వాహకులు తొలగించినట్లున్నారు. తెలుగు వికీపీడియా నిర్వాహకులు తమ పొరపాటును గుర్తించి డిసెంబర్ 2, 2011 న YVSREDDY చే సృష్టించబడిన ఈ వ్యాసమును తిరిగి పునఃస్థాపించి తెలుగు వికీపీడియా చరిత్రను సరిచేయగలరు. ఇంకా ఇటువంటి పొరపాట్లు నిర్వాహకులు ఇతర వ్యాసాలలో కూడా చేసివున్నారేమో గుర్తించి వాటిని కూడా సరిచేసి తెలుగు వికీపీడియా చరిత్రను సరిచేయగలరని సవినయంగా తెలుగు వికీపీడియా నిర్వహకులను కోరుచున్నాను. YVSREDDY (చర్చ) 06:15, 12 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

@YVSREDDY గారూ పాత వ్యాసంలో ఉన్న సమాచారంలో
  • తొలగించేనాటికి ఆ పేజీ సగం ఇంగ్లీషులో ఉంది. అనువదించకుండా అలాగే వదిలేసారు.
  • మిగతా సగంలో మూడు నిర్వహణ మూసలు ఉన్నాయి. వాటిని తీసేస్తే మిగిలినది చాలా తక్కువ సమాచారం.
  • ఇక, ఆ పేజీ చరిత్ర చూస్తే.. మీరు ఆ పేజీని 2011 డిసెంబరు 2 న కేవలం 1105 బైట్లతో ఒక మొలకగా సృష్టించారు.
  • ఆ తరవాత మీరు ఆ పేజీలో ఒక్క దిద్దుబాటు కుడా చెయ్యలేదు, బైటు కూడా చేర్చలేదు. "డిసెంబర్ 2, 2011 న YVSREDDY ఈ వ్యాసమును సృష్టించి 3,097 బైట్లుకు విస్తరించాడు" అని పైన మీరు చెప్పిన మాట అబద్ధం. ఎందుకు ఈ అబద్ధం చెప్పారు?
  • ఒక సంవత్సరం తరవాత, 2013 జనవరి 30 న వేరే వాడుకరి దానిలో ఒక తొలగింపు మూస పెట్టారు.
  • ఆ తరవాత మరో వాడుకరి దానిలో కొంత ఇంగ్లీషు సమాచారం పెట్టి విస్తరించారు. ఆ ఇంగ్లీషు పాఠ్యంలో కొంత మాత్రమే అనువదించగా మిగతాది చివరిదాకా అలాగే ఉండిపోయింది.
  • తొలగించిన ఆ పేజీ లోని పాఠ్యాన్ని మీరు తెచ్చి ఇక్కడ పెట్టారు. కానీ, ఇంగ్లీషులో ఉన్న సమాచారాన్ని పెట్టలేదు. ఎందుకు?
  • పేజీలో ఉన్న నిర్వహణ మూసలను చూపించలేదు. ఎందుకు?
మీ ఆరోపణలకు తోడ్పడని సమాచారాన్ని దాచారు, మీ తప్పులను దాచారు, అబద్ధాలు చెప్పారు. నిర్వాహకులు తప్పు చేసారు అని ప్రచారం మాత్రం చేస్తున్నారు. ఇది అన్యాయం. మీరు ఇక అబద్ధాలు చెప్పడం ఆపండి. మీరు చేసిన తప్పులను దాచడం ఆపండి. ఇతరులు తప్పు చేసారనే అబద్ధపు ప్రచారాలు చెయ్యడం ఆపండి. నిర్వాహకుల సమయాన్ని వృథా చెయ్యడం ఆపండి. నమస్కారం. __చదువరి (చర్చరచనలు) 00:53, 13 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • చదువరి గారు నమస్కారం
  • "వాడుకరి:YVSREDDY/పిప్పలి" కూర్పుల చరితం ఈ లింకును పరిశీలిస్తే 17 మే 2020‎ న YVSREDDY ఈ వ్యాసానికి సంబంధించిన సమాచారాన్ని భద్రపరచడం జరిగింది. ఆ తరువాత ఇప్పటివరకు ఎటువంటి మార్పులు చేయని వాడుకరి:YVSREDDY/పిప్పలి పేజిలోని సమాచారమును మాత్రమే ఇక్కడ చేర్చడం జరిగింది. నేను 2011 డిసెంబరు 2 న కేవలం 1105 బైట్లతో ఈ వ్యాసాన్ని సృష్టించినా, తరువాత ఈ వ్యాసంలో ఎటువంటి మార్పులు చేయకపోయినా ఈ వ్యాసం అయితే విస్తరించడం జరిగింది కదా. ఆ విస్తరించిన వాడుకరుల చరిత్రను చెడపవద్దనే కదా నేను ఈ వ్యాసమును పునఃస్థాపించమంటున్నాను. నేను సృష్టించిన ఈ వ్యాసాన్ని విస్తరించిన ఆ వాడుకరిని నాతో పాటు అందరూ తెలుసుకునేందుకైనా ఈ వ్యాసాన్ని పునఃస్థాపించగలరు. 2011 లో నేను ఈ వ్యాసాన్ని సృష్టిస్తే ఎంతోమంది వాడుకరులు ఈ వ్యాసంలో మంచి దిద్దుబాట్లు చేసివుంటారు. అందువలనే ఈ వ్యాసం చాలా బాగుంది. ఎంతో మంది కలిసి విస్తరించిన ఈ వ్యాసాన్ని తొలగించి వారందరి సేవలను తొక్కిపడేసి దశాబ్దం తరువాత 3 అక్టోబరు 2022‎ న మీరేదో చాలా గొప్ప పని చేస్తున్నట్లు వికీపీడియా:వికీప్రాజెక్టు/ఎర్రలింకుల సంస్కరణ పేరుతో ఈ వ్యాసాన్ని సృష్టించి మహాదానందాన్ని పొందుతున్నారు. YVSREDDY (చర్చ) 03:23, 13 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
    ఈ చర్చలో చదువరి గారు అడిగివాటికి సమాధానం చెప్పకుండా అలవాటు ఉన్న వైవిఎస్ఆర్ గారు దాటవేసే ప్రయత్నానికి నూటికి నూరుపాళ్లు న్యాయం చేసారనిపిస్తుంది. యర్రా రామారావు (చర్చ) 05:47, 13 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
    @YVSREDDY గారూ మీరు నన్ను అపార్థం చేసుకున్నారు. మీ వాదనలోని లోపాన్ని, మీరు చెప్పని సంగతులను, మీరు చెప్పిన అబద్ధాన్నీ వెల్లడించాలని ఇక్కడి చర్చలో పాల్గొన్నాను తప్ప, నా చర్చ ఈ వ్యాస కర్తృత్వం గురించి కాదు. ఈ పేజీయే కాదు, ఏ పేజీకైనా సృష్టికర్తగా నేనే ఉండాలన్న దుగ్ధ నాకు లేదు. ఒకసారి వికీలో రాసామంటే ఇక అది నాది కాదు అనే స్పృహ నాకుంది. నేను మహదానందం పొందే పనులు వికీలో వేరే ఉన్నాయి. ఇలాంటి చిన్న విషయాలపై చర్చకు నే పోను. చర్చ:పాత్రికేయులు పేజీలో నేను రాసినది ఒకసారి మళ్ళీ చదవండి -"ఆ తప్పును సరిచేసేందుకు విలీనాన్ని సరిచేసాను. ఈ విషయాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు రెడ్డి గారు." అని రాసాను. అక్కడ మీరు చెప్పినది రైటు కాబట్టి ఇక దానిపై వాదనకు పోవాల్సిన పనే లేదు.
    -----------
    ఇక, ఇక్కడి చర్చలో నేను చెప్పాల్సినది ఐపోయింది. తోటి వాడుకరులు రెడ్డి గారి వాదనను పరిశీలించి, ఏది సరైనదని భావిస్తే అది చెయ్యవల్సినదిగా కోరుతున్నాను. __ చదువరి (చర్చరచనలు) 06:00, 13 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
  • చదువరి గారు "పిప్పలు ఓకరకపు మిరియపు రకం అని మాత్రమే రెడ్డి గారు రాసారు. దానిని విస్తరించినది రాజశేఖర్ గారు. మిగిలిన వారూను." అని 19 ఫిబ్రవరి 2013న విశ్వనాధ్ గారు ఒక చర్చలో తెలిపారు. అంటే ఈ వ్యాసాన్ని నేను విస్తరించకపోయినా, విస్తరించిన వ్యాసాన్నే తొలగించారనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. కనుక నా వాదనను మీరే పరిశీలించి డిసెంబర్ 2, 2011 న YVSREDDY చే సృష్టించబడి, పలువురిచే విస్తరించిబడి, పొరపాటున తొలగించబడిన ఈ వ్యాసాన్ని తిరిగి పునఃస్థాపించి తెలుగు వికీపీడియా చరిత్రను సరిచేయగలరు. YVSREDDY (చర్చ) 09:11, 3 అక్టోబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]