చర్చ:ఫైబర్ గ్రిడ్ పథకం

వికీపీడియా నుండి
(చర్చ:ఫైబర్‌ గ్రిడ్‌ పథకం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

శిష్ట వ్యవహారికం ప్రయోగించడం తెవికీకి సరిపడదు[మార్చు]

సుల్తాన్ ఖాదర్ గారూ మీరు తెలుగులోకి అనువదిస్తూ ఈ పేజీని శుద్ధి చేయడం చూశానండీ. మీ భాషాభిమానం ప్రశంసనీయం. ఐతే రెండు విషయాలపై మాత్రం నేను అంగీకరించలేకపోతున్నాను.

  1. తెలుగు వికీపీడియాలో వాడుక భాషే ఉపయోగించదగ్గది. మీరు చేసిన మార్పులు (మార్గము, గొట్టము, భావిస్తున్నది) ప్రధానంగా శిష్ట వ్యవహారికం కిందికి వస్తోంది. నిత్యం పత్రికల్లో ప్రయోగం చూసుకున్నా, ప్రజల వాడుక చూసుకున్నా మీరు రాసిన వాటిని మార్గం, గొట్టం, భావిస్తోంది అన్నట్టుగానే ప్రయోగిస్తున్నారు. భావిస్తున్నది అన్న ప్రయోగాన్ని పోలిన ఉన్నది వంటి పదాలను ఉంది అని మార్చడానికి తరచుగా సముదాయం ఆటో వికీ బ్రౌజర్ వాడడాన్ని బట్టి ఈ మార్పు ప్రామాణికం కాదని, మళ్ళీ భావిస్తున్నది అన్న దాన్ని భావిస్తుంది కింద ఎప్పుడో ఏ ఏ.డబ్ల్యు.బి. నడిపినప్పుడో మార్చాల్సిన భారం ఉందని తెలుస్తోంది.
  2. తెలుగు భాషలో ఇంగ్లీషు పదాల ప్రయోగం తగ్గాలి అన్నది భాషపై మమకారం ఉన్న వ్యక్తులుగా మనలో చాలామంది అంగీకరిస్తే అంగీకరించవచ్చు. అలానే వ్యక్తిగతంగా దానికోసం నిలబడవచ్చు. కానీ తెలుగు వికీపీడియాలో మాత్రం ప్రయోగంలో ఉన్న పదానికే పెద్దపీట. ఈ ప్రయోగంలో ఉన్న పదాన్ని గుర్తించేందుకు ప్రస్తుతం ఏ చర్చలో అయినా, ఆటో వికీ బ్రౌజర్ దిద్దుబాట్లలో అయినా గూగుల్లో అదెంత ప్రాచుర్యంలో ఉందన్న దాన్ని బట్టి పరిశీలిస్తున్నాం. పైప్ అన్న పదాన్ని తెలుగు లిపిలో ఇలానే గూగుల్లో వెతికితే 57,200 ఫలితాలు, పైపు అని వెతికితే 42,100, గొట్టము అన్నదానికి 12,600 ఫలితాలు, గొట్టం అన్న రూపాంతరానికి 29,000 ఫలితాలు వచ్చాయి. గొట్టము/గొట్టం రెండు రూపాంతరాల ఫలితాలు కలుపుకుని లెక్కించినా పైప్ అన్న పదానికి ఉన్న ప్రయోగం దరిదాపులకు కూడా రావట్లేదు. అలానే లైన్ (18,00,000 ఫలితాలు), లైను (55,800 ఫలితాలు) ప్రాచుర్యంతో పోలిస్తే గొట్టపు మార్గము (363 ఫలితాలు) కూడా తేలిపోతోంది.

నిజానికి తెలుగు భాషలోకి వీలున్నంతలో తెలుగు పదాలనే ఉపయోగించాలని నేనూ భావించినా ఆ ప్రయోగాలు ప్రాథమిక, ద్వితీయ స్థాయి మూలాలైన ఇతర చోట్ల ప్రయోగంలోకి వచ్చాకా తృతీయ స్థాయి మూలమైన తెవికీలో రావాలన్న నియమానికి కట్టుబడి ఇలా రాయక తప్పలేదు. ఇక శిష్ట వ్యవహారికం ప్రయోగం అయితే తెవికీలో సరికాదనే నా వ్యక్తిగత అభిప్రాయం. మీ ఉద్దేశం తెలియజేయగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 12:23, 10 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ సంతోష్ గారూ... తెలుగు పదాలు మెల్లగా చచ్చిపోతున్నాయి. మీకు ఏది సమంజసం అనిపిస్తే అది చేయండి. అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్ళగలిగే శక్తి, ఓపిక నాకు లేదు. ఈ వ్యాసంలో నేను చేసిన మార్పులను తొలగిస్తాను. --సుల్తాన్ ఖాదర్ (చర్చ) 12:35, 10 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
క్షమించండి సుల్తాన్ ఖాదర్ గారు. వ్యక్తిగతంగా నేను తెలుగు భాష విస్తరించాలనేవాణ్ణే, కానీ పాలసీల పరంగా ఇలా మాట్లాడాల్సి వచ్చింది. అలానే నేనేమీ అధికారిని కాను, అలానే అధికారులకో, నిర్వాహకులకో పాలసీలు నిర్ణయించడంలో ప్రత్యేకమైన హక్కులేమీ ఉండవు. ఇక మిమ్మల్ని తెలియక ఏదైనా బాధ పెట్టివుంటే తప్పుగా తీసుకోకండి. --పవన్ సంతోష్ (చర్చ) 12:54, 10 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ గారూ... తెవికీ నియమాలకు వ్యతిరేకంగా ఏదైనా దిద్దుబాటు చేసినట్లు తెలిస్తే సరిదిద్దుకుంటాను. అంతేకాని ఒకరు రాసిన వ్యాసాలను ఇంకొకరు అసలు దిద్దుబాటు చేయకూడదు అంటే ఎలా? మీకు తెలియని విషయం కాదు. అలాగే ఆఫ్ వికీలో ఈ విషయం చర్చకు పెట్టడం ఎంతవరకు సమంజసం? నేను అడ్డుపుల్ల వేశానా? రాజశేఖర్ గారు తమ అభిప్రాయం అడిగితే నా అభిప్రాయం చెప్పాను. ఎక్కడా వేరొకరి పేరు కూడా ఎత్తలేదు. దీనిని ఆఫ్ వికీలో ఎత్తి చూపించి నేనేదో తప్పు చేసినట్లు మాట్లాడటం ఎంతవరకు సబబు? సభ్యులందరూ సమన్వయంతో పనిచేసుకుంటూ వెళుతున్నపుడు అధికారి స్థాయి సభ్యుడే ఇలా చేస్తే ఎలా చెప్పండి. నాతో చర్చించడానికి నా చర్చా పేజీ ఉన్నది, రచ్చబండ ఉన్నది. రచ్చబండలో నా అభిప్రాయాలపై సమ్మతి తెలుపుతూ ఆఫ్ వికీలో మరోలా చర్చ లేవనెత్తడం ఎందుకు? అర్థం చేసుకోగలరని మనవి. మిమ్మలను బాధించి ఉంటే క్షంతవ్యుడను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 13:45, 10 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]
మీరన్న నేపథ్యం నాకు అర్థమైంది.. ఆఫ్ వికీ నేను చర్చించలేదు, అలాంటి ముఖ్యమైన పాలసీ చర్చలు మరెక్కడా జరిగితే చూస్తూ ఉన్నదీ లేదు. జరుగుతున్న చర్చను కూడా నేను ఆఫ్ వికీ చేయకూడదని అక్కడే నిష్కర్షగా చెప్పేశాను. అలానే ఆ చర్చను వీలున్నంతవరకూ ఆన్-వికీ యాక్టివిటీ వైపుకు మళ్ళించాను. నా గమనింపులోకి వచ్చినంతవరకూ నేను నియమానుసారం మళ్ళించాను. ఇకపైనా అంతే.
కానీ నేను రాసిన వ్యాఖ్యల ధోరణి వేరు. ఇది పూర్తిగా సదుద్దేశంతో, మరెక్కడ చర్చ జరుగుతుందో కూడా తెలియకనే రాసింది. మీరు కాలరేఖను పరిశీలించినా ఈ విషయం, నా స్పష్టమైన వైఖరి మీకు ఈపాటికి తెలిసే ఉంటుంది కదా. సముదాయం చర్చించి అంగీకరించిన అంశాలను, సముదాయంలోనే చర్చించాలని లేదా ఇష్టాయిష్టాలకు సంబంధం లేకుండా అమలు చేసుకుంటూ వెళ్ళాలని నేను వేరే పాలసీ విషయంలోనూ చెప్పడం గమనించిన మీదటైనా మీకు అర్థమయ్యే ఉంటుంది. నా వైఖరి సహృదయతతో అర్థం చేసుకుంటారనే భావిస్తున్నాను. దయచేసి మీరు నొచ్చుకోవద్దు. ఉంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 14:43, 10 మార్చి 2017 (UTC)[ప్రత్యుత్తరం]