చర్చ:బాలకాండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తొలగింప బడుతున్న వ్యాసం లోని కూర్పు
  • 09:10, 4 ఏప్రిల్ 2008 125.16.17.152 ఐ.పి.అడ్రసునుండి ఒకరు క్రింది వ్యాసాన్ని వ్రాశారు. అప్పటికే ఈ విషయం బాలకాండ వ్యాసంలో ఉన్నందున ఆ వ్యాసం తొలగింపబడుతున్నది. రిఫరెన్సు కోసం ఆ విషయాన్ని ఇక్కడికి కాపీ చేస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 18:46, 8 ఏప్రిల్ 2008 (UTC)


బాలకాండ

శ్రీలు పొంగిన జీవగడ్డ కోసల రాజ్యం. దాని రాజాధాని అయోధ్య. దశరథుడు కోసలరాజు. ఆయనకు మువ్వురు భార్యలు. వారు కౌసల్య, సుమ్రిత, కౌక. రాముడు కౌసల్యానందనుడు, కైకేయి ప్రుతుడు భరతుడు. లక్ష్మణశత్రుఘ్నులు సుమిత్రా సుతులు. రామలక్ష్మణులు, భరతశత్రుఘులు విడదీయరాని జంటలు.

యాగ సంరక్షణ

దశరథ నందనులు పెరిగి పెద్దవారై, బాల్య క్రీడలు కట్టి పెట్టి, శాస్ర్తాలు పఠించారు. థనుర్వేద పారంగతు లౌతున్నారు. అంతలో విశ్వామిత్రుడు వచ్చి దశరథునికి తన రాక నెరిగించుమన్నాడు. దశరథుడు అర్ఘ్యపాద్యాలతో ఎదురేగి ఆయనకు స్వాగం పలికాడు. మీ రాకతో మా గృహం పావనమైంది. ఏమి ఆజ్ఞ? అన్నాడు రాజు. విశ్వామ్రితుడు తమ యజ్ఞాన్ని మారీచ సుబాహులనే రాక్షసులు ధ్వంసం చేస్తున్నారని, యజ్ఞరక్షణకు రాముని పంపుమని అన్నాడు. అది విని రాజు నిశ్చేష్టుడయ్యాడు. తేరుకొని యజ్ఞరక్షణకు తానే వస్తాను అన్నాడు. కాదు రాముడే రావలెనన్నాడు ముని. పురోహితుడైన వశిష్ఠుడు రాజా! ఆడి తప్పరాదు. విశ్వామిత్రుడు మహాతపశ్శాలి. దివ్యాస్త్రసంపన్నుడు. రామచం్రదుని పంపటానికి జంకవద్దుఅన్నాడు.

తండ్రి పనుపున రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట బైలు దేరారు. సరయూనదీ తీరాన రామునకు ముని బల, అతిబల విద్యలు ఉపదేశించాడు. ఆ రాత్రి వారు అక్కడే విశ్రమించారు. తెల్లవారుతుంది. విశ్వామిత్రుడు కౌసల్యాసుప్రజా రామ! పూర్వాసంధ్యా ప్రవర్తతే! ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికమ్ అంటూ మేలు కొల్పాడు. రామలక్ష్మణులు న్రిదలేచి, కాలకృత్యాలు తీర్చుకొని బైలుదేరారు. వారు సరయూ గంగా సంగమ ప్రాంతం చేరారు. ఇక్కడ వేయి ఏనుగుల బలం గల తాటక అనే యక్షిణి ఉంది. దానికి నరమాంసం అంటే ఇష్టం. ఒకనాడు ఆమె అగస్త్యుని ఆరగించబోయింది. ఆయన దానిని రాక్షసివి కమ్మని శపించాడు. అది అగస్త్యాశ్రమ ప్రాంతాన్ని నాశనం చేస్తూంది. ఓ రామా! తాటకను స్త్రీ అని సందేహించక చంపు అన్నాడు ఋషి. అంతలో తాటక వచ్చింది; రాళ్ల వాన కురిపించింది. రాముడు తాటకను సంహరించాడు. సంతసించిన ముని రామునకు అనేక దివ్యాస్త్రాలు ఉపదేశించాడు. తర్వాత కొంతదూరం నడిచి వారు సిద్ధాశ్రమం చేరారు. విశ్వామ్రితుడు యజ్ఞదీక్ష స్వీరించాడు. అది అరురోజుల దీక్ష. రామ లక్ష్మణులు ఐదురోజుల పాటు నిద్రాహారాలు లేకుండా యజ్ఞాన్ని రక్షించారు. తాటక కొడుకులు మారీచసుబాహులు అనుచరగణంతో వచ్చారు. ఆగ్నేయాస్త్రంతో సుబాహుని చంపి వాయవ్యాస్త్రంతో మారీచుని నూరుయోజనాల దూరానగల సముద్రంలో పడగొట్టాడు రాముడు. అహల్యాశాపవిమోచనం యజ్ఞం పూర్తయింది. వారికి మిథిలానగరంలోని శివధనుస్సు కథ తెలిసింది. రామలక్ష్మనులను వెంట పెట్టుకొని విశ్వామ్రితుడు మిథిలవైపు సాగుతున్నాడు. అప్పుడు వారికి గౌతమాశ్రమం కనిపించింది. ఇంద్రుడు గౌతముని భార్య అహల్యను చూచి మోహపడి మోసగించిన వైనం, గౌతముడు ఇంద్రుని, అహల్యను శపించిన కథ ముని రామునికి వినిపంచాడు. 'ఓ రామా! నీ వీ ఆశ్రమంలో కాలుపెట్టిన క్షణంలో అహల్యకు శాపవిముక్తి అని గౌతములు చెప్పారు అన్నాడు ముని. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో గౌతమాశ్రమం ప్రవేశించాడు. అంతే, అహల్య లేచి నిలబడింది. రామలక్ష్మణులు నమస్కరించారు. ఆమె ఆశీర్వదించింది. గౌతముడు వచ్చి అహల్యను స్వీకరించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలసి మిథిలానగరం చేరాడు. అదివిన్న జనకుడు గౌతమపుత్రుడైన శతానందుడనే పురోహితులను ముందుంచుకొని, వారికి స్వాగతం చెప్పాడు. అప్పటికే వారికి అహల్యా శాపవిమోచన వార్త తెలిసింది. నగరంలోనికి వారిని ఆహ్వానించాడు రాజు. శివధనుర్భంగము - సీతారమకల్యాణం విదేహరాజ్యానికి మిథిల రాజధాని. దాని రాజు జనకుడు. అతని అసలు పేరు సీరధ్వజుడు. అతడొకప్పుడు యజ్ఞభూమిని దున్నుతుండగా నాగేటి చాలులో ఒక పసిపిల్ల దొరికింది. సీత అంటే నాగేటి చాలు. అందుకే ఆమెకు సీత అని పేరు పెట్టి, పెంచుకొన్నాడు రాజు సీత పెరిగి పెద్దదైంది. వారింట్లో శివధనుస్సుంది. దానిని ఎక్కుపెట్టిన వారికి సీతనిచ్చి పెళ్లిచేస్తాను అన్నాడు జనకుడు. ఎందరెందరో రాజకుమారులు వచ్చారు. భంగపడి వెళ్లారు. జనకుడు రామలక్ష్మణులను చూసి వీరెవ్వరని అడిగాడు. వీరు అయోధ్య రాజైన దశరథుని పుత్రులు రామలక్ష్మణులు. రాముడు తాటకను, యజ్ఞ విధ్వంసకుడైన సుబాహుని చంపి, మారీచుని తరిమి కొట్టాడు. దారిలో అహల్యను ఉద్దరించాడు. శివధనుస్సును చూడవచ్చాడు అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఎనిమిది చ్రకాల బండి మీద ఐదువేల మంది శివధనుస్సును కష్టపడి తెచ్చారు. విశ్వామిత్రుడు రాముని వంక చూశాడు. రాముడు శివధనుస్సుకు నమస్కరించి, నిలబెట్టి అల్లెతాడు బిగించాడు. ఫెళ్లుమని ధనుస్సు విరిగింది. అయోధ్యకు దూతలు పోయి జనకుని ఆహ్వానం అందించారు. దశరథుడు వశిష్ఠునితో మంత్రులతో చతురంగబలాలతో విదేహ చేశాడు. మిథిల ప్రవేశించాడు. జనకుని కుమార్తెలు సీత, ఊర్మిళలు జనకుని తమ్ముడైన కుశధ్వజుని కూతుళ్లు మాండవి శ్రుతకీర్తి అనువారు. వీరితో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాలు ఘనంగడా జరిగాయి. పరశురామ గర్వభంగం దశరథ మహారాజ కొడకులతో కోడళ్లతో అయోధ్యు తరలివస్తుండగా పరశురాముడు ఒక చేత గం్ర విదేహరాజ్యానికి మిథిల రాజధాని. దాని రాజు జనకుడు. అతని అసలు పేరు సీరధ్వజుడు. అతడొకప్పుడు యజ్ఞభూమిని దున్నుతుండగా నాగేటి చాలులో ఒక పసిపిల్ల దొరికింది. సీత అంటె నాగేటి చాలు. అందుకే ఆమెకు సీత అని పేరు పెట్టి, పెంచుకొన్నాడు రాజు సీత పెరిగి పెద్దదైంది. వారింట్లో శివధనుస్సుంది. దానిని ఎక్కుపెట్టిన వారికి సీతనిచ్చి పెళ్లిచేస్తాను అన్నాడు జనకుడు. ఎందరెందరో రాజకుమారులు వాచ్చరు. భంగపడి వెళ్లారు. జనకుడు రామలక్ష్మణులను చూసి వీరెవ్వరని అడిగాడు. వీరు అయోధ్య రాజైన ధశరథుని పుత్రులు రామలక్ష్మణులు. రాముడు తాటకను, యజ్ఞ విధ్వంసకుడైన సుబాహుని చంపి, మారీచుని తరిమి కొట్టాడు. దారిలో అహల్యను ఉద్ధరించాడు. శివధనుస్సును చూడవచ్చాడు అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఎనిమిది చక్రాల బండి మీద ఐదువేల మంది శివధనుస్సును కష్టపడి తెచ్చారు. విశ్వామిత్రుడు రాముని వంక చూశాడు. రాముడు శివధనుస్సుకు నమస్కరించి, నిలబెట్టి అల్లెతాడు బిగించాడు. ఫెళ్లుమని ధనుస్సు విరిగింది. అయోధ్యకు దూతలు పోయి జనకుని ఆహ్వానం అందించారు. దశరథుడు వశిష్ఠునితో మంత్రులతో చతురంగబలాలతో విదేహ చేరాడు. మిథిల ప్రవేశించాడు. జనకుని కుమార్తెలు సీత, ఊర్మిళలు జనకుని తమ్ముడైన కుశధ్వజుని కూతుళ్లు మాండవి శ్రుతకీర్తి అనువారు. వీరితో రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహాలు ఘనంగా జరిగాయి. పరశురామ గర్వభంగం ధరథ మహారజు కొడుకులతో కోడళ్లతో అయోధ్యకు తరలివస్తుండగా పరశురాముడు ఒక చేత గండ్రగొడ్డలిని, మరోచేతిలో వింటినిపట్టి, ప్రత్యక్షమయ్యాడు. ఆయన సకల క్షత్రియుల్ని ఇరువది యొక్క సార్లు సంహరించిన పర్రాకమశాలి. దశరథుడు ఆయన శరణు వేడాడు. అయినా ఆయన కరుణించలేదు. అప్పుడు శివుని విల్లు విరిచావట! ఇప్పుడీ హరివిల్లు ఎక్కుపెట్టు. నీతో యుద్ధంచేస్తా అన్నాడు. పరశురాముడు. రాముడు పరశురామునకు నమస్కరించాడు. నాక్షాత్రాన్ని పరిహసిస్తే సహించనంటూవిల్లందుకొని ఎక్కుపెట్టి మీరు తపస్సుతో ఆర్జించిన పుణ్యలోకాలనా? లేక మీ గమన శక్తినా? దేనిని నాశనం చేయను? అన్నాడు రాముడు. పాపం, పరశురామునకు తెలిసివచ్చింది. నీ చేతిలో ఓడినందుకు సంతోషిస్తున్నా, నా గమన శక్తిని నాకు మిగిలించు అంటూ సాగిపోయాడు. అప్పటికి దశరథునకు స్పృహవచ్చింది. అంతా అయోధ్యదిశగా కదిలారు.