చర్చ:మద్యపానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మద్యాన్ని నిషేధిస్తే ఎన్నో మేళ్ళున్నాయి[మార్చు]

  • “చంద్రబాబు ప్రభుత్వం బెల్టు షాపుల ద్వారా పేద ప్రజల రక్త మాంసాలను పీల్చుతోంది”

“పేదల నోరు పగలదీసి మరీ మద్యం పోస్తున్నారు”.—-2004 లో రోశయ్య. “మంచి నీళ్లు దొరకని ప్రాంతంలో కూడా మద్యం దొరికేలా చేశారు.మద్యం విక్రయాలు విచ్చల విడిగా పెరిగిపోయాయి”- 2010 చంద్రబాబు నాయుడు. ‘రాష్ట్రంలో ఇంతమంది పేదలు ఉన్నారా? అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌ సందేహిస్తుంటే,’రాష్ట్ర ప్రజల ఆదాయం పెరిగింది,అందుకే మద్యం దుకాణాలకు గిరాకీ అంత భారీగా పెరిగింది అని రాష్ట్ర మంత్రులు అంటున్నారు. మద్యం విచ్చలవిడి వినియోగం వల్ల మానవ వనరులు నిర్వీర్యమై ప్రజలు తాగుడుకు బానిసలై సోమరిపోతుల్లా మారిపోతారు.మద్యం మత్తులో నేరస్తులుగా మారతారు.గుజరాత్ లో మద్య నిషే ధం అమలులో ఉన్నా, పారిశ్రామికీకరణ ద్వారా ఆదాయానికి లోటు లేకుండా చూసుకున్నారు.ఇతర రంగాలలో దుబారాను నివారించాలి.మద్యం పనిచేసే స్వభావానికి కష్టపడే మనస్తత్వానికి దూరంగా ప్రజలను నెట్టి వేస్తుంది.తాగుడుతోనే కాలక్షేపం చేస్తారు.భార్యలను పీడించి, వారి సంపాదనను కూడా తమ తాగుడుకే పురుషులు ఖర్చు చేస్తారు. ఫలితంగా సంసారాల్లో చిచ్చురేగి ఒకరినొకరు చంపుకొనే పరిస్థితికి దారి తీస్తుంది.రోడ్డు ప్రమాదాల్లో వేల సంఖ్యలో జనం మరణిస్తున్నారు.ఎక్కడ పడితే అక్కడ మద్యం లభించడం వల్ల రోడ్డు ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.ఎన్నో కుటుంబాలకు దిక్కు లేకుండాపోతున్నది.సమాజ హితం దృష్టిలో పెట్టుకుని బాధ్యతాయుతమైన పౌర సమాజ నిర్మాణం కోసం మద్యాన్ని నిషేధించాలి.

  • వోడ్కా (మద్యం)తయారీ కర్మాగారాలను(డిస్టిలరీ) మంచినీళ్ళ తయారీ కేంద్రాలుగా మార్చాలని రష్యా ప్రభుత్వం ప్రతిపాదించింది.అధికార యునెటైడ్ రష్యా పార్టీ ప్రభుత్వం మద్యపాన వ్యతిరేక ఉద్యమం చేపట్టింది. ప్రస్తుతం దేశంలో వోడ్కా తలసరి వార్షిక వినియోగం 18 లీటర్లు.ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి రెండు రెట్లు. కల్తీ వోడ్కా తాగడం వల్ల దేశంలో ఏటా 23 వేల మందికి పైగా మరణిస్తున్నారు.[1] --Nrahamthulla 03:43, 16 సెప్టెంబర్ 2010 (UTC)
  1. సాక్షి16.9.2010

విలీనం పై చర్చ[మార్చు]

  • మద్యం అనునది ఒక ద్రవం. ఇది కొంత మొత్తంలో సేవించటం (మద్యపానం) కొన్ని దేశాలలో, వర్గాలలో ఆమోదయోగ్యమే. కొందరికి ఒక చుక్క మద్యం సేవించిననూ అది మద్య వ్యసనం.
  • మద్యానికి, మత్తుపానీయాలకు ఒకే వ్యాసం ఉండవచ్చును
  • మద్యపానం వేరు, మద్య వ్యసనం వేరు. పాశ్చాత్య దేశాలలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న సమయాలలో మోతాదు మించని మద్యపానం ఆమోదయోగ్యం. ఉదా: వివాహం, మృత్యువు. అక్కడి వాతావరణం అతి శీతలంగా ఉండటం వలన, కొంత మద్యం సేవించటం వలన వారి శరీరంలో ఉష్ణం పెరిగి, వారి పనులను చేసుకోవటంలో సహకరిస్తుంది. మాంసాహారం త్యజించి కూడా పాశ్చాత్య దేశాలలో జీవించవచ్చును అని నిరూపించిన వారు ఎలాగైతే ఉన్నారో, ఏ మాత్రం మద్యపానం చేయకుండా కూడా పాశ్చాత్య దేశాలలో జీవించవచ్చును అని నిరూపించినవారు కూడా అలాగే ఉన్నారు. శైవం లో ఒక వర్గం అయిన వామాచారంలోను, పంచ మకరాలలో మద్యం ఒకటి. అయితే వామాచార సిద్ధాంతాల ప్రకారం ఇది కూడా మోతాదు మించకూడదు. ఇది మద్యపానం.
  • మద్యవ్యసనం వేరు. అంటే ఒక వ్యక్తి అవసరం లేకున్ననూ ప్రతి రోజు (మోతాదుకి మించి), లేదా ప్రతి పూటా, లేదా 24/7 మద్యం సేవిస్తూ తన నిత్యకృత్యాలను గాలికి వదిలివేస్తే అది మద్యవ్యసనం. ఇది మద్యాన్ని దుర్వినియోగపరచటం. (అంటే ఆహారానికి, భోజనానికి, తిండిబోతుతనానికి ఎంత తేడా ఉన్నదో, మద్యానికి, మద్యపానానికి, మద్యవ్యసనానికి అంతే తేడా ఉన్నది.)
  • మద్యం సేవించటం మొదలు పెట్టగనే, మద్యానికి బానిస అవుతారనేది కేవలం అపోహ. పాశ్చాత్య ప్రభావం భారతదేశంపై రోజురోజుకీ పెరిగిపోవటం, ప్రైవేటీకరణ వలన ఒత్తిడి గల ఉద్యోగాలు, మద్యం ఒక భోగం అని యువతలో నాటుకుపోయిన భావన ల వలన ఇది వరకటి కంటే, ఇప్పుడు మద్యం వినియోగం పెరిగిన మాట వాస్తవమే. అయితే, సాంఘిక విలువలలో ఇంత మార్పు వచ్చినా, బాధ్యతాయుతంగా మద్యపానం చేసేవారు కూడా ఉన్నారు. ఉదా: పెద్ద పెద్ద సంస్థలు సైతం కొన్ని ఉత్సవాలలో వారి ఉద్యోగులకు మద్యపానాన్ని అందిస్తాయి. మోతాదు ఎంత? ఎంత తాగవచ్చును? ఎక్కడ ఆపాలి అనే నిర్ణయాలు ఉద్యోగుల వ్యక్తిగత విచక్షణకు వదిలివేస్తాయి. ఉచితంగా వస్తోంది కాబట్టి మోతాదుకి మించి తాగి తూలిపోయే ఉద్యోగులూ ఉంటారు. ఉచితంగా వచ్చినంత మాత్రాన మోతాదు మించకూడదు, ఇది కేవలం భేషజాలను/ఒత్తిళ్ళను ప్రక్కకు తోసి సరదాగా, సంతోషంగా కాసేపు గడపటానికి మాత్రమే అని ఎరిగి కావలసినంత మద్యపానం మాత్రం చేసి, క్షేమంగా ఇంటికి వెళ్ళే ఉద్యోగులూ ఉంటారు. వీరిలో మహిళలూ ఉన్నారు.
  • ఇక మద్యపానం కష్టపడి పని చేసే తత్త్వాన్ని దూరం చేస్తుంది అనే వాదనకు, కొసమెరుపుగా ఒక చిన్న ప్రతివాదన. కాలం చేసినా వారు గొప్ప నటులు అని మనం ఈ రోజుకీ తలచుకొనే చాలా మంది, షాట్ కు ముందు ఒక చిన్న షాట్ వేసి, తమ హావభావాలతో మనల్ని మెప్పించినవారే! మద్యం సేవించి కష్టపడే వారు ఉన్నారు. కష్టపడిన తర్వాత మద్యం సేవించే వారూ ఉన్నారు.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దారిమార్పులు చేయవచ్చని నా సూచన. - శశి (చర్చ) 14:43, 2 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

విలీనం చేయాల్సిన లక్ష్యిత వ్యాసం లేని కారణంగా విలీన మూస తొలగించాను.➤ కె.వెంకటరమణచర్చ 06:31, 22 జూన్ 2022 (UTC)[ప్రత్యుత్తరం]