చర్చ:ముప్పారం (ధర్మసాగర్‌)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముప్పారం[మార్చు]

ముప్పారం గ్రామం ధర్మసాగర్‌ మండలంలో ఒక గ్రామం.. ఈ గ్రామానికి ఒకప్పుడు ముప్పవరం అని పేరు. ఈ ఊర్లో ముఖ్యానాది గుడి ఉన్నందున ఈ ఊరికి ఆ పేరు వచ్చిందని ఈ ఊరి పెద్దలు చెప్తారు. ఈ ఊరు...పల్లె సంసృతి, సంప్రదాయాలకు నిలయం. ఈ ఊరి ప్రజలంతా కలిసి ఒక కుటుంబంలా ఉంటారు. ఈ విలేజ్‌లో కొత్తవాడ అను ఒక కాలనీ ఉంటుంది. అక్కడ ఉండే యూత్‌ పిల్లలు చాలా అల్లరి పిల్లావాళ్లు. కాని చాలా బ్రిలియాంట్స్ ప్రతి స్టూడెంట్‌ కి ఎదో ఒకదాంట్లో టాలెంట్ ఉంటుంది. కవితలు ,పాటలు రాస్తారు. గేమ్స్‌ బాగా ఆడతారు. వీళ్ళంతా ఇప్పుడు వివిధ రంగలలో సెట్లయ్యారు.

ఆ ఊరి అందాలు ఈ ఊరి చుట్టు కొండలు కాపాల కాసినట్లు ఉంటాయి. ఈ ఊరిని కంటికి రెప్పలా కపాడుతున్నాయా అనిపిస్తుంది ముప్పారం ఊరి చెరువు విశాలంగా ఉంటుంది. కాని చుక్క నీరు కనిపించదు పెద్దమ్మ గుడి ఊరి ప్రజలకు ఏ ఆనారోగ్యం సోకకుండా పోలిమెరలో పోలెరమ్మలా ఉంది. ఇక్కడ లభించే తాటి కళ్లు అమృతంలా ఉంటుంది.

ఈ ఊరికి ఉన్న ఇబ్బందులు: ముప్పారం ముద్దు బిడ్డలు ముప్పతిప్పలు పడుతున్న రైతు బిడ్డలు దళారులు మోసాలతో కూళీలుగా మారుతున్నారు. ఇక్కడి విద్యార్ధులు కాలేజ్‌కి వెళ్ళాలంటే 25 కిలోమీటర్లు దూరంలో ఉన్న హన్మకొండకు వెళ్ళాలి. అందరూ పేదవారే కాబట్టి బస్సులో ప్రయాణీస్తారు. ఆ బస్సు సౌకర్యం సరిగ్గా ఉండదు. 100 మంది ఎక్కాల్సిన బస్సులో 300 మంది ఎక్కుతారు.ఈ ఊరి విద్యార్థులా ఇక్కట్లు అన్ని ఇన్ని కావు. ఇక్కడి రాజకీయాల గురించి ఇక చెప్పద్దు.