చర్చ:యేసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Cscr-featured.svg యేసు వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 52 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia

గౌరవనీయులైన సభ్యులకు, నమస్సులు. యేసు క్రీస్తు వ్యాసం చాలా బాగుంది. అయితే ఆంగ్ల వ్యాసాన్ని యధాతదంగా తర్జుమా చెయ్యాలన్న నిబంధన ఏమైనా ఉందా లేక ఆంగ్ల మూలానికనుగుణంగా స్వతంత్ర తర్జుమా చెయ్యొచ్చా? మచ్చుకు నేనొక పేరాను అదనపు సమాచారం జోడించి అనువదించాను. దీనిపై మీ అభిప్రాయం రాయండి. భవదీయుడు రవి ప్రసాద్

మూలం

Most Christians believe in Jesus as the Son of God sent to provide salvation and reconciliation with God by atoning for the sins of humanity. Most Christians are Trinitarian and believe that Jesus is God incarnate, while Nontrinitarian Christians adopt various other interpretations regarding the divinity of Jesus. The area of study concerning these issues is known as Christology. Other beliefs shared by most Christians include his Virgin Birth, his ascension into Heaven and his future Second Coming. Most Christians also believe that Jesus performed miracles and fulfilled biblical prophecy.

నా అనువాదం

మానవాళి పాపాలకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా తనను తాను సమర్పించుకోవటం ద్వార ప్రజలకు రక్షణ భాగ్యన్ని అనుగ్రహించటంతో పాటు దేవునితో సమాధాన పరచెందుకు పంపబడిన దేవుని కుమారుడు యేసు అని ఆయనను విశ్వసించిన క్రైస్తవుల నమ్మిక. క్రైస్తవ విశ్వాసంలో త్రిత్వ సిద్ధాంతం చాలా ప్రాముఖ్యమైంది. దేవుడని పిలువబడుతున్న ఒకేఒక దైవ తత్వం ఉందని, ఒక్కటైన ఈ దైవ తత్వంలో నిత్యత్వంలోనూ, శక్తిలోనూ సమానులైన ముగ్గురు “మూర్తులు” - తండ్రియైన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు ఉన్నారని, ఈ ముగ్గురూ దైవత్వంలో ఒక్కరు, నిత్యులు, వేరుచెయ్యటానికి వీలులేనటువంటివారు, అంతంలేనివారు, అనంతమైన శక్తి, జ్ఞానం, మంచితనం, కలవారు, ద్రుశ్యాద్రుశ్యములైన సమస్తాన్ని స్రుష్టించి, సంరక్షిస్తున్న ఒక్కరని ఈ త్రిత్వ సిద్ధాంతం పేర్కొంటుంది. యేసు త్రితంలోని రెండవ మూర్తి అయిన కుమారుడైన దేవుడని త్రిత్వాన్ని అంగీకరించే క్రైస్తవులు నమ్ముతారు. అయితే త్రిత్వ సిద్ధాంతాన్ని అంగీకరించని క్రైస్తవులు ( ఉదాహరణకు యెహోవా సాక్షులు, తదితరులు) యేసు దైవత్వానికి సంబంధించి భిన్న అభిప్రాయాలను కలిగి ఉన్నారు. యేసు దేవ మానవ గుణలక్షణాలకు ఇంకా సర్వమానవ పాప పరిహారార్థమై కల్వరి సిల్వలో ఆయన ఒనర్చిన బలియాగానికి సంబంధించిన అధ్యయనాని “క్రీస్తు శాస్త్రం”గా పేర్కొంటారు. యేసు పరిశుద్ధాత్మ శక్తితో కన్య గర్భాన జన్మించాడని, శ్రమ, మరణ పునరుత్థానాల అనంతరం పరమునకు ఆరోహణమయ్యాడని, యుగాంతాన తిరిగి రానై ఉన్నాడని క్రైస్తవులు నమ్ముతారు. యేసు క్రీస్తు తన జీవిత కాలంలో అనేక అద్భుతాలు చేశాడని, పూర్వ నిబంధనలో ప్రత్యక్ష పర్చబడిన ప్రవచనాలను పరిపూర్ణం చేశాడని కూడా క్రైస్తవులు నమ్ముతారు.

మక్కీకి మక్కి అనువదించాలన్న నియమమేమీ లేదు. అయితే ఆంగ్ల వ్యాసాన్ని ఎంతో మంది శ్రమకోర్చి, చర్చినిచి వీలైనంత తటస్ఠంగా రూపొందిచడము జరిగింది. అదీ కాకా చాలా మూలాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని తక్కువ శ్రమతో సమగ్ర వ్యాసం తెలుగులో అందించాలన్నదే ఈ ప్రయత్నం. మీ అనువాదం బాగుంది అయితే నావి కొన్ని సూచనలు.
  • ఇప్పటికే ఉన్న మూలాల లింకులను తీసివేయకుండా జాగ్రత్త వహించండి.
  • కొంచెము సరళమైన భాషలో రాయండి. (యుగాంతాన తిరిగి రానై ఉన్నాడని క్రైస్తవులు నమ్ముతారు -> యూగాంతాన తిరిగి వస్తాడని క్రైస్తవులు నమ్ముతారు.)
  • ఇక్కడ త్రిత్వ సిద్ధాంతాన్ని గురించి విస్తరించాల్సిన అవసరం లేదనుకుంటా. ఇప్పటికే ఈ వ్యాసం చాలా పొడవయ్యింది. త్రిత్వ సిద్ధాంతము ప్రత్యేక వ్యాసములో రాసి దానికి లింకిస్తే సరిపోతుంది. 32 కిలోబైట్లను మించితే బ్రౌజర్లు కొంత కష్టపడతాయి.
--వైఙాసత్య 18:07, 30 నవంబర్ 2006 (UTC)

రవి, ఇది చాలా చర్చనీయమైన అంశమైన కారనముచేత మనము ఆంగ్ల వ్యాసాన్ని యధాతదంగా తర్జుమా చేద్దాం.

సుధాని.

సవరణ[మార్చు]

ఈ వ్యాసమును చాలా వరకూ సవరణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఏసు ప్రభువు దేవుడు కాదు, కేవలం ప్రవక్త మాత్రమే అని క్రైస్తవుల నమ్మకాలు దెబ్బతీస్తున్నట్టు ఎవరో ఇస్లాము భక్తుడు భాషా ప్రయోగం తెలియకో లేదా ఆలోచన లేకో వ్రాసినట్టు ఉన్నది. ఈ వ్యాసము అందరూ చదవగలిగే విధంగా వాడుక భాషలో ఉంటే బాగుంటుంది. వ్యాసము మరీ పెద్దగా ఉంటే చదవడం కష్టంగా ఉంటుంది. ఎవరి నమ్మకాలు దెబ్బతినకుండా నేను సవరణలు చేస్తున్నాను. సహకరించండి! భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 09:59, 25 డిసెంబరు 2014 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ఈ వ్యాసానికి యేసు అను పేరు అసంపూర్ణం. దయచేసి ఎవరైనా ఈ వ్యాసాన్ని యేసు క్రీస్తు కు తరలించండి. (భూపతిరాజు రమేష్ రాజు (చర్చ) 14:34, 30 డిసెంబరు 2014 (UTC))Reply[ప్రత్యుత్తరం]

ఆధారాలు[మార్చు]

మతాలకి, విశ్వాసాలకి సంబంధించిన ఏ వ్యాసాలైనా సున్నితమైన వ్యాసాలు కాబట్టి ఎవరు రాసినా సరైన మూలాలు ఉంటేనే రాయండి. నాకు తెలిసి ఇలాంటి వ్యాసాలను ఆంగ్లవికీ నుంచి స్వేచ్ఛానువాదం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. --రవిచంద్ర (చర్చ) 15:55, 28 మే 2016 (UTC)Reply[ప్రత్యుత్తరం]

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:యేసు&oldid=1884163" నుండి వెలికితీశారు