చర్చ:రామాయణ కల్పవృక్షం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు పుస్తకాలు ఈ వ్యాసం వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో పుస్తకాలకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మంచిఅయ్యేది ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మంచివ్యాసం అవ్వగలిగే-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


నోట్స్ తొలగించి పద్యాలు వ్యాసంలో చేర్చడం గురించి[మార్చు]

కొండూరి వారూ,
విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యం విషయంలో మీరు తెవికీలో చేస్తున్న కృషి బహు బాగుందండీ. మీ ప్రయత్నం, నేపథ్యం, ఉత్సాహం, శక్తి చూస్తూంటే చాలా సంతోషంగా ఉంది. ఐతే ఓ చిన్న సూచన, మీరు నోట్స్ లో ఉన్న పద్యాలు తొలగించి వ్యాసంలో చేర్చారు కదా. ఇంతకీ ఈ నోట్స్ ఎందుకంటే, వ్యాసంలో చేర్చిన ఫలానా విషయానికి ఇదీ మూలం అని పుస్తకాన్ని కాకుండా, ఓ పాఠ్యాన్నో, కొటేషన్నో ఉదహరించాల్సి వస్తే నోట్ వాడుతున్నాను నేను. ఇప్పుడు ఆ నోట్ తీసి వ్యాసంలో చేర్చడం వల్ల నేను చేర్చిన వాక్యం నిరాధారం అన్నట్టు కనిపిస్తోంది కదా అన్న చిన్న అనుమానం ఉండింది. ఇంతకీ మీరు వ్యాసంలో పద్యాలను చేర్చి, నోట్ నుంచి తొలగించడంలో ఏం ఉద్దేశించారో తెలియదు కనక నా ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాను ముందుగా. ఈ విషయంలో మీ కారణం చెప్తే చర్చించి ఏదో విధంగా నిర్ణయించుకోవచ్చు. ఏమంటారు. --పవన్ సంతోష్ (చర్చ) 12:32, 18 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

మర్చేపోయాను. నా దగ్గర విశ్వనాథ వారి రచనలపై వచ్చిన అనేక విమర్శ రచనలు, వ్యాస సంకలనాలు లాంటివి ఉన్నాయి. మీ దగ్గరా ఉండే వుండొచ్చు. కానీ ఫలానాది కావాలనిపిస్తే ఓసారి నా చర్చ పేజీలో రాయండి. ఉంటే పంచుకుందాం. ఈ వ్యాసాలను పరిపూర్ణంగా అభివృద్ధి చేయడం నా ఎన్నో ఏళ్ళ స్వప్నం, నేను కొంత చేసి ఎటెటో వెళ్ళిపోయాను. మళ్ళీ ఇన్నాళ్ళకు ఇలా మీరు తారసపడడం చూస్తే చాలా సంబరంగా ఉందండీ. "అలఘు స్వాదు రసావతార ధిషణాహంకార సంభార దోహల బ్రాహ్మీమయమూర్తి"ని గురించి తెవికీలో సాధ్యమైనంత పరిపూర్ణంగా సమాచారం చేరుద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 12:41, 18 ఫిబ్రవరి 2017 (UTC)[ప్రత్యుత్తరం]

పవన్ గారు,

మొదటగా, ధన్యవాదములు.. నేను విశ్వనాథ వారి వీరాభిమానిని. వారి సాహిత్యం అన్నా వారి పద్యాలన్నా చెవులు కోసు కుంటాను. వారి రచనలు ఎన్నో చదివి వారి మీద ఎందరో వ్రాసిన వ్యాసాలు, పుస్తకాలూ చదివి వారి మీద మరింత అభిమానము పెంచుకున్నాను. తెలుగు వికీ లో విశ్వనాథ సాహిత్యం అభివృద్ధికి, విస్తరణకి, మరింత ప్రాచుర్యము కోసము మీరు, మీ వంటి వారు ఎందరో ఇస్తున్న ప్రోత్సాహం వల్ల నేను నా చేతనయిన సహాయ సహకారములు అంద చేస్తున్నాను. ఇక ముందు కూడా కొనసాగిస్తాను. "విశ్వనాథ సాహిత్యములో తెలుగు పద్య వైభవము" అనే అంశము మీద నేను కొన్ని సంవత్సరాల క్రితం పరిశోధనలు చేసి కొన్ని వ్యాసములు రచనలు చేయటం జరిగింది. వాటినికుడా తెవికీ లో ఉంచే ప్రయత్నం చస్తాను.
ఇక "నోట్సు" విషయానికి వస్తే, "నోట్సు" వాడుక దాని వెనుక ఉన్న పరమార్థం నాకు తెలుసు కాని, నోట్సులో ఉన్నఆయా పద్యముల సవరణ మరియు ఛందస్సును చేర్చాలి అని ప్రయత్నిచి నప్పుడు నాకు తెవికి లో కుదరలేదు అందుకని నోట్సును తొలగించి సరాసరి పద్యాన్ని ఛందస్సుతో సహా ఉంచటం జరిగింది అంతే గానీ మీ వాక్యం నిరాధారము అని చెప్పటం నా ఉద్దేశ్యం కాదు. మీరు నేను వ్రాసిన పద్య సవరణలతో పద్య ఛందస్సు తో కలిపి తిరిగి నోట్సులో చేర్చి పెట్టె ప్రయత్నం చేశాను కాని కుదరలేదు. మీకు అవకాశము ఉంటె మీరు చేర్చ వచ్చు. :ధన్యవాదములు...
వాడుకరి:కొండూరు రవి భూషణ శర్మ,