చర్చ:వల్లివేడు (పాకాల)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వల్లివేడు రివెన్యూ గ్రామం క్రింద మరికొన్ని సుమారు 20 చిన్న గ్రామాలున్నాయి. అందులో రెండు పంచాయితీలున్నాయి. రెండు పంచాయితీలున్నందున ఇద్దరు సర్పంచులు కూడ వుంటారు. కాని..... రివెన్యూ ఇన్పొ బాక్సులో సర్పంచు పేరు. అని మాత్రమే వున్నది. అనగా ఒక సర్పంచు అని గదా.... ఇదే విధంగా అనేక రివెన్యూ గ్రామాల క్రింద రెండు అంతకన్నా ఎక్కువ పంచాయితీలు వుండ వచ్చు.అలాగే సర్పంచులు కూడ ఒకరి కంటే ఎక్కువ వుండ వచ్చు. నా సందేహం ఏమంటే? ....... ప్రస్తుతం వ్రాస్తున్నది రివెన్యూ గ్రామాల వ్యాసాలు మాత్రమే. పంచాయితీ గ్రామాల వ్యాసాలు కాదు. అ లెక్కన పంచాయితీ గ్రామాల సంఖ్య రెవెన్యూ గ్రామాలకంటే అనేక రెట్లు ఎక్కువ వుండే అవకాశమున్నది. అదియును గాక.... ఈ రివెన్యూ గ్రామము అనగా..... కొన్ని పంచాయితీ గ్రామాల కలయిక/ లేదా కొన్ని సాధారణ గ్రామాల కలయిక అయినందున ఆయా గ్రామాల చరిత్ర మొదలగు వాటిని వ్రాయడానికి అవకాశముండదు. వ్రాయ దలిస్తే కేవలం ఆ రివెన్యూ గ్రామం గురించి మాత్రమే వ్రాయగలరు. లేదా.... విడిగా ఆయా గ్రామాల గురించి వ్రాయ వచ్చును. ఇటు వంటి ఇబ్బంది అన్ని రివెన్యూ గ్రామ వ్యాసాలకున్నదని గమనించగలరు.  : వాడుకరి భాస్కరనాయుడు. Bhaskaranaidu (చర్చ) 06:15, 4 మార్చి 2014 (UTC)[ప్రత్యుత్తరం]