చర్చ:సంగీత వాద్యపరికరాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సంగీతం ప్రాముఖ్యత[మార్చు]

సంగీతానికి రక్తం ఉరకలేస్తుంది.వీనులవిందైన గానామృతంవల్ల రక్తప్రవాహం సాఫీగా సాగిపోతుందని పరిశోధకులు తాజాగా పేర్కొంటున్నారు. స్నానాల గదిలోనైనా కాస్తంత తీరిక చేసుకొని కూనిరాగాలతో పాటు సంగీతాన్ని ఆస్వాదించమంటున్నారు. శ్రవణానందకరమైన పాటలు వింటున్నప్పుడు రక్తనాళాలు వ్యాకోచిస్తాయని చెబుతున్నారు. నవ్వినప్పుడు వచ్చే ఫలితాలనే.. పాటలు వినటం ద్వారా సాధించవచ్చట.వ్యాయామం చేయటం, గుండెపోటు మందులు వాడినప్పుడు లభించే ఫలితాలను సంగీతం వినటంతో పోల్చవచ్చు. రక్తనాళాలు వ్యాకోచించటంవల్ల రక్తం సాఫీగా ప్రవహిస్తుంది. రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడే ప్రమాదం తక్కువ. గుండెపోటు వచ్చే అవకాశాలూ తగ్గుతాయట.(సంతకంలేదు)

సంగీత మొలక వ్యాసాలు విలీనం[మార్చు]

ఈ వ్యాసాలు అన్నీ సంగీత వాయిద్యానికి సంబంధించిన వ్యాసాలు.ఇవి చాలాకాలం నుండి మొలకలుగా ఉన్నవి.

మూలాలు లేవు. వీటిని విస్తరించాలన్నా పెద్ద సమాచారం లభించదు. వికీపీడియా:వికీప్రాజెక్టు/మొలకల విస్తరణ ఋతువు 2020 భాగంగా పైవ్యాసాలు సంగీత వాద్యపరికరాల జాబితా పేజీలో విలీనం చేస్తున్నాను.--యర్రా రామారావు (చర్చ) 03:51, 6 సెప్టెంబరు 2020 (UTC)