చర్చ:సావిత్రి (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సావిత్రి (నటి) వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2006 సంవత్సరం, 1 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia


భారతీయ సినిమా ప్రాజెక్టు ఈ వ్యాసం భారతీయ సినిమా ప్రాజెక్టులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతీయ సినిమాలకు సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
వికిప్రాజెక్టు భారతదేశం ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశంలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో భారతదేశానికి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
విశేషవ్యాసం విశేషవ్యాసం ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై విశేషవ్యాసం-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)
తెలుగు ఈ వ్యాసాన్ని తెలుగు ప్రాజెక్టు ద్వారా నిర్వహిస్తున్నారు.


ఫొటోలు

[మార్చు]

రెండు ఫొటోలు ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ఒకదానిని తేసేసాను. దానిని పూర్తిగా తేసేయలేదు కామెంట్లలో పెట్టాను. ఆంగ్ల వికీపీడియాలోని ఫొటోను ఆమె నటించిన సినిమాల దగ్గర పెట్టాను. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 08:59, 30 డిసెంబర్ 2005 (UTC)

విశేషవ్యాసంగా ఈ వ్యాసం...

[మార్చు]

ఈ వ్యాసానికి కొత్త విషయాలు, బొమ్మలు జోడించి, మెరుగుపరచి, విశేషవ్యాసంగా మలుద్దాం రండి. జనవరి 2, సోమవారం లక్ష్యంగా పెట్టుకుందాం. అవసరమైన సమాచారం:

  • పూర్తి సినిమాల చిట్టా
  • సావిత్రి గురించి ప్రముఖుల వ్యాఖ్యలు
  • ఆమె బాల్య విశేషాలు
  • జీవిత చరమాంకం విశేషాలు -మొదలైనవి. __చదువరి(చర్చ, రచనలు) 09:48, 30 డిసెంబర్ 2005 (UTC)
  • సావిత్రి గారి జీవితం గురించి మహానటి సావిత్రి పుస్తకంలో ఉంది, జననం నుండి మరణం వరకు.--Mukteshvari 19:05, 13 ఆగష్టు 2009 (UTC)
సావిత్రి గారి పూర్తి సినిమాల చిట్టా ఇక్కడ (imdb) ఉంది. నేను వాటిని అనువాదించగలను. --మాకినేని ప్రదీపు (Makineni Pradeep) 10:41, 30 డిసెంబర్ 2005 (UTC)


అలాగేనండి. నేను ఆమె జీవిత విశేషాల గురించి చూస్తాను. __చదువరి(చర్చ, రచనలు) 10:45, 30 డిసెంబర్ 2005 (UTC)


చాలా సంతొషం. కాని రెండొవ చిత్రము(నర్తనశాల లోనిది) అంతగా బాగోలేదు. అది తీసివేయుట మేలు. Kiranc 11:43, 30 డిసెంబర్ 2005 (UTC)
అయితే, ఆమె జీవిత విశేషాల సమాచారం నాకు దొరకలేదు, ఎవరిదగ్గరైనా ఉంటే, వ్యాసంలో చేర్చగలరు. __చదువరి(చర్చ, రచనలు) 10:42, 1 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఏకవచన ప్రయోగం

[మార్చు]

వ్యాసంలో అంతటా ఏకవచనం ఉపయోగించదం అంత సముచితంగా లేదు.దీనిని మార్చే విషయంలో మీకు ఎమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి Kiranc 06:16, 3 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

ఎకవచన ప్రయోగమే విగ్నాన సర్వస్వానికి సబబని నిర్ణయించడమైనది. ఈ విషయము గురించి వికీపీడియా:రచ్చబండ (పాలసీలు) లో చర్చించవచ్చు --వైఙాసత్య 06:27, 3 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడ పాలసిలు చూసాను. కాని ఇటీవలి వ్యక్తుల విషయంలో అది అంత బాగోదు. ఉదాహరణకి "ఆమె నేటికి ఆరాధింపబడుతూంది" అనే కన్నా "ఆమె నేటికి ఆరాధింపబడుతున్నారు" అంటే బాగుంటుంది. Kiranc 09:12, 3 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
మీరన్నది నిజమేగానీ, ఏకవచనప్రయోగంలో తప్పులేదు. పైగా అన్ని సందర్భాల్లోనూ ఒకే విధానముంటే బాగుంటుంది. కాబట్టి ప్రస్తుతమున్న పద్ధతినే కొనసాగించాలని నా అభిప్రాయం. __చదువరి(చర్చ, రచనలు) 09:25, 3 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
అవునండి అందరికీ ఏకవచనమువ్ ఆడటమే మంచిది
లేకపోతే చాలా సమస్యలు రావచ్చు
ఉదాహ్రణకు
వై యస్ కి బహువచనము వాడలేదని ఒకరు
చంద్రబాబుకు వాడలేదని ఒకరు మనని ఇరగతీస్తారు :)
Chavakiran 06:28, 4 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
అవును మీరన్నది నిజమే. మనం ఎవరిని అతిగా గౌరవించక్కర్లేదు. కాని నా సూచన ఏమిటంటే, "నటించింది , నటించాడు" అనే కన్నా "నటించారు" అంటే బాగుంటుంది. అది వారిని అతిగౌరవించినట్టు కాని, అగౌరవించినట్టు కాని కాదు అని నా భావన.
Kiranc 04:31, 5 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]
చిన్న clarification. నేను ఎవరికి "శ్రీ", "శ్రీమతి", "గారు", "గౌరవనీయులు" వంటి విశేషణాలు వాడమనటం లేదు.
Kiranc 04:35, 5 జనవరి 2006 (UTC)[ప్రత్యుత్తరం]

సావిత్రి

[మార్చు]

సావిత్రి గురించి చాల చక్కని వెబ్ పేజి:http://www.mahanatisavitri.com/index.html Kumarrao 10:45, 18 జూన్ 2010 (UTC) Kumarrao 16:20, 22 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]


ఈ వ్యాసాన్ని ఉపయోగించుకున్నవారు

[మార్చు]

ఈ వ్యాసంలోని సమాచారాన్ని చాలా వరకూ ఉన్నదున్నట్లుగా మార్చి 10 2008న, పిరమిడ్ సాయిమిరా థియేటర్ లిమిటెడ్ వారు తమ తెలుగు బ్లాగులో వాడుకున్నారు. వారు వ్యాసాన్ని తమ బ్లాగులో ప్రచురించే ముందు దానిని కొద్దిగా మెరుగుపరచినారు. తెలుగు వికీపీడియాలోని ఒక వ్యాసం ఇలా వాడుకోగలగే దశకు తీసుకుని వెళ్లినందుకు అందరికీ ధన్యవాదాలు. కాకపోతే PSTLవారు సమాచారాన్ని ఇక్కడి నుండి సేకరించినట్లుగా ఎక్కడా పేర్కొనలేదు!. __మాకినేని ప్రదీపు (+/-మా) 10:42, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

బాగా గమనించారు ప్రదీప్ గారు. ఇక్కడి వ్యాసాన్ని వాడుకున్నందుకు తెవికీకు గర్వకారణమే, కనీసం తెలుగు వికీపీడియా నుంచి సేకరించినట్లు చివరన సూచించితే బాగుండేది.-- C.Chandra Kanth Rao(చర్చ) 13:42, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అవును మనందరం పెంచిన మొక్క పూతకు వచ్చినట్లుంది. మూలాన్ని చెప్పకపోవడం సంగతి ఇప్పుడు అంతగా పట్టించుకోనవుసరం లేదు. ఏమయినా వారికి ఒక సందేశాన్నిద్దాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:14, 10 మార్చి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
(Message sent on 10/3/2008)

Dear Sir,

I am a member of Telugu Wikipedia.

http://te.wikipedia.org/wiki/


We have noted the article about MAHANATI SAVITRI in

http://pstlap.blogspot.com/2008/03/blog-post_10.html

and believe you have taken the content from Telugu Wikipedia and improved it further.

I and all wiki colleagues are happy and proud that you have found Telugu Wikipedia article useful.

It is our desire to develop more articles to reference standard.

We would appreciate more if you quote the source of article as "Telugu Wikipedia http://te.wikipedia.org/wiki/ "

I would also request you and your colleagues to contribute to various articles in Telugu Wikipedia.

Regards

ఇంటిపేరు

[మార్చు]

మహానటి ఇంటిపేరు ఒకచోట కొమ్మారెడ్డి అని, మరొకచోట నిశ్శంకర అనీ ఉన్నది. ఆంగ్ల వికీ వ్యాసములో కూడా అలానే ఉన్నది. ఎది సరైనది? ఎవరైనా వివరించ గలరు.Kumarrao 16:20, 22 ఫిబ్రవరి 2009 (UTC)[ప్రత్యుత్తరం]

http://www.mahanatisavitri.com/index.html లో సావిత్రి వంశవృక్షం ఉన్నది. అనుమానము నివృత్తి ఐనది.Kumarrao 10:47, 18 జూన్ 2010 (UTC)[ప్రత్యుత్తరం]

శాస్త్రీయ నృత్యం

[మార్చు]

సావిత్రి శాస్త్రీయ నృత్యం నేర్చుకొన్నది అని ఉన్నది. శాస్త్రీయ నృత్యం అనగా కూచిపూడి యేనా? భరతనాట్యం వగైరాలు నేర్చుకొని ఉన్నా/లేకున్నా, కూచిపూడి ఖచ్చితంగా నేర్చుకొని ఉండి ఉంటుందని భావిస్తున్నాను. దీనిపై స్పష్టత ఇస్తే కూచిపూడి నృత్య కళాకారుల వర్గం చేర్చాలో వద్దో నిర్ధారించుకొనవచ్చును. - శశి (చర్చ) 13:48, 21 అక్టోబర్ 2013 (UTC)

పుట్టినరోజు

[మార్చు]

సావిత్రి పుట్టినరోజు ఏమిటనేది అనేక చోట్ల అనేక విధాలుగా ఉంది. ఈ వ్యాసంలో కూడా రెండు రకాలుగా రాసారు. ఇంగ్లీషు వికీపీడియాలో మరో రకంగా ఉంది. జాలంలో వెతికితే ఇవేవీ కాకుండా వేరే రోజులు ఉన్నాయి. మహానటిసావిత్రి.కామ్ అనే వెబ్ సైటులో 1935 డిసెంబర్ 6 అని ఉంది. ఏదో నిర్ధారించుకుని వ్యాసంలో మార్చాలి. వాడుకరి:రవిచంద్ర, వాడుకరి:స్వరలాసిక వాడుకరి:Pavan santhosh.s గార్లు ఈ సంగతి చూడాలని విజ్ఞప్తి.__చదువరి (చర్చరచనలు) 05:24, 24 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ఏది ప్రమాణంగా తీసుకుందాం? నా వరకైతే సావిత్రం జీవిత కథ పుస్తకం నుంచి తీసుకుంటే బాగుంటుందని అభిప్రాయం. ఎందుకంటే వెబ్ లోనో మరో చోట అయితే పెద్దగా పరిశోధన లేకుండా రాసే అవకాశం ఉంది. పుస్తకం కాబట్టి కనీసం సంపాదకులైనా పరిశీలించి ఉండవచ్చనే నమ్మకం. రవిచంద్ర (చర్చ) 05:38, 24 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ వ్యాసంలోనే * జనవరి 11, 1934 * జనవరి 11, 1936 * జనవరి 11, 1937 అని మూడు రకాలుగా ఉన్నాయి. ఇక మహానటిసావిత్రి.కామ్ అనే వెబ్ సైటులో 1935 డిసెంబర్ 6 అని ఉంది. "మహానటి సావిత్రి: వెండితెర సామ్రాజ్ఞి" అనే పుస్తకం ప్రకారం జనవరి 4, 1936 (http://pustakam.net/?p=8441) అని ఉంది. వీటిలో ఏది కరెక్టో తెలుసుకోవాలంటే తెలుగు సినిమా చరిత్రపై అథారిటీ ఉన్న రావికొండలరావు, పైడిపాల, కిరణ్‌ప్రభ (సావిత్రిపై రేడియో ప్రోగ్రాం చేశారు), ఎమ్బీయస్ ప్రసాద్ వంటి వారిని సంప్రదించాలి. నేనా ప్రయత్నంలో ఉన్నాను.--స్వరలాసిక (చర్చ) 06:43, 24 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
స్వరలాసిక గారూ సూపర్! అదే మన తక్షణ కర్తవ్యం :-) రవిచంద్ర (చర్చ) 07:27, 24 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
కిరణ్‌ప్రభ గారు సావిత్రి గారి బర్త్ సర్టిఫికెట్ పంపారు. దాని ప్రకారం ఆమె జన్మదినం 1935 డిసెంబర్ 6. "ఇది మూర్తిగారు, సోమరాజుగారు వ్రాసిన ఇంగ్లీషు పుస్తకంలోది.." అని పేర్కొన్నారు. దీనిపై చదువరి,వాడుకరి:రవిచంద్ర, పవన్ సంతోష్‌లు స్పందించ గలరు. --స్వరలాసిక (చర్చ) 03:26, 26 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అదే సరైంది అని నేను భావిస్తున్నాను.రవిచంద్ర (చర్చ) 04:53, 26 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పుట్టినరోజుకు సంబంధించిన భిన్న వాదనలు ఒక నోట్‌లో ప్రస్తావిద్దాం. బర్త్ సర్టిఫికెట్ ప్రాథమిక మూలమైనా, ఇక్కడ మనకున్న చిక్కుముడిని అదే విప్పగలుగుతోంది. దానికి తోడు అది సోమరాజు, మూర్తి అన్న రచయితలు పరిశోధించిన ద్వితీయ స్థాయి మూలంలో నిర్ధారితమైంది. కనుక ఆ పుస్తకం పేరును కిరణ్ ప్రభ గారి నుంచి తెలుసుకుని కోట్ చేస్తూ రాయడం సరైన పని. క్రాస్ రిఫరెన్సింగ్ చేసుకుంటూ వాస్తవాన్ని సాధించినందుకు వాడుకరి:స్వరలాసిక గారికి అనేకానేక అభినందనలు, సానుకూలంగా స్పందించి సహకరించిన కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (చర్చ) 07:23, 26 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పుట్టినరోజుకు సంబంధించిన ఆధారాలను సేకరించి ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చిన స్వరలాసిక గారికి అబినందనలు, ధన్యవాదాలు. __చదువరి (చర్చరచనలు) 00:40, 12 ఆగస్టు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

పుట్టినరోజుకు సంబంధించిన ఆధారం

[మార్చు]

మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి తో విలీనం గురించి

[మార్చు]

వాడుకరి:యర్రా రామారావు గారూ, మహానటి సావిత్రి - వెండితెర సామ్రాజ్ఞి అనే పేజీ ఆ పేరుతో ఉన్న పుస్తకం గురించి, ఈ పేజీ -సావిత్రి గురించి. కాబట్టి ఈ రెంటినీ విలీనం చెయ్యాల్సిన అవసరం లేదు. పరిశీలించండి.__చదువరి (చర్చరచనలు) 08:07, 24 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]

వాడుకరి:Chaduvari గారూ, రెండు వ్యాసాల టైటిల్సు దాదాపుగా ఒకే విధంగా ఉన్నందున అలా భావించాను. ఇటీవల వచ్చిన మహానటి సావిత్రి సినిమా వ్యాసం అని కూడా అనుకోవటానికి అవకాశం ఉంది.అవకాశం ఉంటే టైటిలు కొద్దిగా మారిస్తే బాగుంటుందేమో ఆలోచించగలరు.విలీనం మూస తొలగించాను.--యర్రా రామారావు (చర్చ) 02:45, 25 జూలై 2018 (UTC)[ప్రత్యుత్తరం]