చర్చ:సూఫీ తత్వము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  • సూఫీల బోధనలు మన భారతీయ ఋషుల భావాలకు దగ్గరగా ఉంటాయి.వీరి వల్లనే ఇస్లాం ఇండియాలో బాగా ప్రచారమయ్యింది."మంచివారికి ప్రేమ మధురమైన బాధ.చెడ్డవారికి ప్రేమ ఒక అందమైన అబద్దం.హింసకు పాల్పడటానికి ఒక సాకు.సార్వజనీన సోదరభావం ప్రేమ. ప్రేమే దైవం.దేవునికున్న99 పేరుల్లో ఒకటి 'అల్-వదుద్' అంటే "ప్రియమైనవాడు" "దయగల ప్రేమికుడు"(ఖురాన్ 11:90,85:14) అందరికీ దేవుని ప్రేమ లభిస్తుంది.ఇష్క్ అంటే దేవుని ప్రేమ.దేవుని కరుణే విశ్వంపై ప్రేమగా కురుస్తుంది. దేవుడు ప్రేమలోని అందాన్ని గుర్తించాలని కోరుకుంటాడు, ఎవరికీ వారు అద్దంలో చూసుకున్నట్లుగా, దేవుడు తననితాను తన సృష్టిలో చూసుకుంటాడు.ప్రతి వస్తువూ దేవుని సృష్టితం కాబట్టి బయటకు అసహ్యంగా కనిపించే దాని లోపల కూడా అందాన్ని చూడాలి. దేవుడిని ప్రేమించే ప్రయాణంలో ప్రతి మతమూ తన దైవం పట్ల "ప్రేమమతం" గా మారుతుంది.ఆయా మతాల దృష్టిలో తమ దేవుడు ప్రేమికుడు, ప్రేమించబడ్డవాడు, మరియు అతిప్రియతముడు.ప్రేమ ద్వారానే మానవజాతి శాశ్వతమైన పవిత్రతను గౌరవాన్ని పొందగలదు. దేవుని పట్ల ప్రేమతో భక్తులు"ప్రేమ మైకంలో" ఉంటారు".--Nrahamthulla (చర్చ) 16:56, 23 జూలై 2012 (UTC)
కొన్ని ఉప విభాగాలలోని అంశాలను ధృవపరిచే మూలాలు లేవు. మూలాలను చేర్చి వ్యాస నాణ్యతను పెంచవససి ఉన్నది. అంతవరకు "ఈవావ్యా" మూసను తొలగిస్తున్నాను. వ్యాసం అభివృద్ధి చెందిన తదుపరి మూసను చేర్చండి.--కె.వెంకటరమణచర్చ 05:53, 27 ఏప్రిల్ 2018 (UTC)