Jump to content

చర్ల మండలం

వికీపీడియా నుండి

చర్ల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండల కేంద్రం.[1].

చర్ల
  మండలం  
తెలంగాణ పటంలో ఖమ్మం, చర్ల స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, చర్ల స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, చర్ల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°24′N 80°29′E / 18.4°N 80.49°E / 18.4; 80.49
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం చర్ల
గ్రామాలు 59
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 4,29,247
 - పురుషులు 21,167
 - స్త్రీలు 21,780
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.43%
 - పురుషులు 58.56%
 - స్త్రీలు 42.43%
పిన్‌కోడ్ 507133

ఈ మండల కేంద్రం గోదావరి నది ఒడ్డున, పర్ణశాలకు దగ్గరలో ఉంది.

గణాంకాలు

2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా  - మొత్తం 4,29,247 - పురుషులు 21,167 - స్త్రీలు 21,780.పిన్ కోడ్ నం.507 133.,ఎస్.టి.డి.కోడ్ = 08747.

ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.

లోగడ చర్ల మండలం, ఖమ్మం జిల్లా,భద్రాచలం రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా చర్ల మండలాన్ని 74 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా, భద్రాచలం రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2].[3].

భౌగోళికం

చర్ల గోదావరి నదీ తీరాన ఈ ప్రాంతంలో ఉంది.18°05′00″N 80°49′00″E / 18.0833°N 80.8167°E / 18.0833; 80.8167.[4] ఇది సగటు సముద్రమట్టానికి సుమారు 78 మీటర్లు అనగా 259 అడుగుల ఎత్తులో ఉంది.

విశేషాలు

  • తాలిపేరు ప్రాజెక్టు : ఇది తాలిపేరు నదిపై నిర్మించిన మధ్య తరహా నీటి పారుదల పధకం. ఇది పెద మిడిసిలేరు గ్రామం వద్ద నిర్మించబడి, సుమారు 26,000 ఎకరాల పంట భూములకు సాగునీరు అందిస్తుంది.[5]
  • రాహుల్ విజ్ఞాన్ విద్యాలయం

ప్రముఖులు

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గ్రామ పంచాయితీ

ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీమతి పున్నం జ్యోతిర్మయి సర్పంచిగా గెలుపొందారు.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. సుబ్బంపేట (జి)
  2. కొయ్యూరు (జెడ్)
  3. సుబ్బంపేట (జెడ్)
  4. రామానుజపురం
  5. చీమలపాడు
  6. గన్నవరం (జెడ్)
  7. సింగసముద్రం
  8. రేగుంట (జెడ్)
  9. రేగుంట (జి)
  10. ఉప్పెరగూడెం
  11. సీ. కతిగూడెం
  12. గొమ్ముపుల్లిబోయినపల్లి
  13. కొటూరు
  14. చింతకుంట (జెడ్)
  15. పులిబోయినపల్లి
  16. గంపల్లి (జెడ్)
  17. చెర్ల (జి)
  18. మొగుల్లపల్లి (జి)
  19. లింగాపురం (జెడ్)
  20. కొత్తపల్లి (జెడ్)
  21. కేశవపురం
  22. రిచెపేట
  23. భూముల్లంక
  24. చెర్ల (జెడ్)
  25. దోసిల్లపల్లి
  26. ఉంజుపల్లి
  27. వద్దిపేట్ (జెడ్)
  28. పుసుగుప్ప (పచ్చీ)
  29. ఉయ్యాలమడుగు (జి)
  30. తిప్పాపురం
  31. చలమల (జెడ్)
  32. బత్తినపల్లి
  33. పెద మిడిసిలెరు (జెడ్)
  34. పెద మిడిసిలెరు చల్క్-ఈ
  35. పెద మిడిసిలెరు చల్క్-ఇ
  36. కుర్నాపల్లి
  37. చిన మిడిసిలెరు (జి)
  38. జంగాలపల్లి
  39. బొదనల్లి (జి)
  40. బొదనల్లి (జెడ్)
  41. చింతగుప్ప
  42. కలివేరు (జెడ్)
  43. తెగద (జెడ్)
  44. తెగద (జి)
  45. గొమ్ముగూడెం (జెడ్)
  46. లింగాల (జెడ్)
  47. పెద్దిపల్లి
  48. ముమ్మిడారం (జెడ్)
  49. జెట్టిగూడెం (జెడ్)
  50. ఆర్. కొత్తగూడెం
  51. కుదునూరు (జెడ్)
  52. కుదునూరు (జి)
  53. దేవరపల్లి (జెడ్)
  54. గోగుబాక (జెడ్)
  55. రల్లగూడెం
  56. మామిడిగూడెం చల్క్
  57. పులిగుండల
  58. కొత్తపల్లి (జి)
  59. పుసుగుప్ప (పచ్చ్- 2)
  60. మామిడిగూడెం (జెడ్)

మూలాలు

వెలుపలి లంకెలు