చలగపార

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చలగపార
చలగపారతో పొలం గట్టు ను ఏర్పాటు చేసుకుంటారు
పొలంలోని కాలువలో పారే నీటిని ఒక కయ్య నుండి మరొక కయ్యకు మార్చుటకు మడవను ఈ చలగపారతో మారుస్తారు.

చలగపారను వదులుగా ఉన్న మట్టిని తీయడానికి లేదా త్రవ్విన మట్టిని తీయడానికి దీనిని ఉపయోగిస్తారు. పొలాలలో మడవలు మార్చడానికి ఇది ఉపయోగపడుతుంది. ట్రాక్టర్, లారీ వంటి వాహనాలకు మట్టిని నింపేటప్పుడు తట్టలకు ఎత్తడం, వాహనముల లోని మట్టిని కిందకు లాగడానికి దీనిని ఉపయోగిస్తారు. ఇంటి నిర్మాణ సమయంలో అడుసు, మాల్ ను కలుపు కోవడానికి దీనిని ఉపయోగిస్తారు. చలగపార వ్యవసాయ దారునికి అతి ముఖ్యమైన పనిముట్టు. పాదులు చేయడానికి, చిన్న కాలువలు తీయడానికి, పొలానికి నీరు పెట్టడానికి ఈ పరికరం అతి ముఖ్యమైనది. దీనిని లోహంతో తయారు చేస్తారు. సాధారణంగా చలగపారలు మందమైన రేకు వలె అడుగు పొడవు, అర అడుగు పైన వెడల్పుతో ఉంటుంది. ఇది పట్టుకునేందుకు ఒక వైపు పంగాల వలె రాడ్డ్ లేదా కర్ర బిగించబడి ఉంటుంది. చాలా చోట్ల కాలువలు, గుంతలు త్రవ్వేటప్పుడు గడ్డపారతో నేలను ఒకరు త్రవ్వుతుంటే మరొకరు చలగపారతో త్రవ్విన మట్టిని తీసి పక్కన వేస్తుంటారు. చలగపార ఉపయోగించే కొలది అరుగుతూ పదునుగా తయారవుతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

గడ్డపార

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చలగపార&oldid=2880498" నుండి వెలికితీశారు