చల్లా కొండయ్య
చల్లా కొండయ్య Challa Kondaiah | |||
| |||
పదవీ కాలం 1979 – 1980 | |||
ముందు | ఆవుల సాంబశివరావు | ||
---|---|---|---|
తరువాత | అల్లాడి కుప్పుస్వామి | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | అనంతపురం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | 1918 జూలై 4
చల్లా కొండయ్య (Challa Kondaiah) (జ. జూలై 4, 1918 - ?) ప్రముఖ న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.[1]
వీరు అనంతపురం జిల్లాలోని చల్లావారిపల్లె గ్రామంలో చల్లా వెంకట కొండయ్య, లక్ష్మమ్మ దంపతులకు 1918 సంవత్సరంలో జన్మించారు. వీరు తాడిపత్రిలో మెట్రిక్యులేషన్, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, చెన్నై లా కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. చెన్నైలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఆంధ్ర విద్యార్థి విజ్ఞాన సమితికి ప్రధాన కార్యదర్శిగా కృషిచేశారు.
1944లో న్యాయవాదిగా నమోదుచేసుకొని కోకా సుబ్బారావు గారి వద్ద జూనియర్ గా చేరారు. 1948 నుండి సొంత ప్రాక్టీసు మొదలుపెట్టారు. చెన్నై, గుంటూరు, హైదరాబాదు పట్టణాలలో తమ వృత్తిని నిర్వహిస్తూ వచ్చారు. 1958లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారత ప్రభుత్వ ఆదాయపన్ను శాఖలో స్టాండింగ్ కౌన్సిల్ గా ఎనిమిది సంవత్సరాలు తమ విధి నిర్వహించారు.
1967లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 1976లో మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయబడి, 1977లో తిరిగి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చారు. వీరు మార్చి 1979 నుండి జూలై 1980 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. వీరి కాలంలో అనేక విజయాలు సాధించారు:
- హౌసింగ్ బార్డు జడ్జిమెంట్ ఆర్టికల్ 226 ని 151 ఐ.పి.సి.తో కొట్టేసి విజయం సాధించారు.
- భారత ఎమర్జన్సీ కాలంలో అక్రమ కేసులను కొట్టేయించారు.
- 12 కోట్ల నిజాం నగల కేసు విషయంలో మార్గదర్శక సూత్రాలను సూచించారు.
- అర్బన్ లాండ్ సీలింగ్ ఛైర్మన్ గా ఆస్తుల పరిరక్షణకు న్యాయపరంగా సహాయం చేశారు.
- వీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషన్ ఛైర్మన్ గా ఉండి దేవాలయాలలో వారసత్వం హక్కును తీసేయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరి ఆధ్వర్యాన జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ను నియమించింది. దేవాలయాల ఆస్తుల నిర్వహణపై ప్రభుత్వానికి పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. దీని ఆధారంగా ప్రభుత్వం 1987 లో దేవాదాయ చట్టాన్ని చేసింది.[2]
- తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ గా నిత్యాన్నదాన పథకాన్ని అమలుచేశారు.
- అనంతపురం జిల్లా కోర్టు కాంప్లెక్సులోని ఆడిటోరియాన్ని ఇతని పేరుమీద జస్టిస్ చల్లా కొండయ్య ఆడిటోరియం గా నామకరణం చేశారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-07-29. Retrieved 2009-10-02.
- ↑ "ది హిందూలో జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ మీద వ్యాసం". Archived from the original on 2007-12-07. Retrieved 2010-08-08.
- ↑ "ది హిందూలో వ్యాసం". Archived from the original on 2012-11-05. Retrieved 2009-10-02.
వెలుపలి లంకెలు
[మార్చు]- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
- అంగ్ల వికీపీడియాలో వ్యాసం