చాందిని తమిలరసన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చాందిని తమిలరసన్
Chandini Tamilarasan.jpg
జననం
చాందిని తమిలరసన్

(1990-08-12) 12 ఆగష్టు 1990 (వయస్సు 30)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

చాందిని తమిలరసన్ తెలుగు, తమిళ చలనచిత్ర నటి. 2010లో వచ్చిన సిద్ధూ +2 అనే తమిళ చిత్రంతో సినిమారంగంలోకి ప్రవేశించిన చాందిని, 2013లో వచ్చిన కాళిచరణ్ చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[1]

జననం - విద్యాభ్యాసం[మార్చు]

చందిని 1990, ఆగస్టు 12న తమిలరసన్, పద్మాంజలి దంపతులకు చెన్నై లో జన్మించింది. విజువల్ కమ్యూనికేషన్‌ లో డిగ్రీ పూర్తిచేసింది.

సినీరంగ ప్రస్థానం[మార్చు]

చాందిని పదిహేడు సంవత్సరాల వయస్సు నుండే అందాల పోటీల్లో పాల్గొని, కొన్నాళ్లకు మిస్‌ చెన్నై’గా ఎంపికైంది. డిగ్రీ పూర్తయిన తరువాత చెన్నైలోని టీవీలో రియాల్టీషో నిర్వాహకరాలుగా పనిచేసింది. ఆ షో చూసిన దర్శకుడు భాగ్యరాజా తన సిద్దు +2 సినిమాలో హీరోయిన్‌ గా అవకాశం ఇచ్చాడు. 2013లో వచ్చిన కాళిచరణ్ చిత్రంతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టి, కిరాక్, చిత్రం భళారే చిత్రం, ఐనా ఇష్టం నువ్వు,[1] లవర్స్, ఎపి02[2] వంటి చిత్రాలలో నటించింది.

నటించిన చిత్రాల జాబితా[మార్చు]

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2010 సిద్ధూ +2 పవిత్ర తమిళం
2013 నాన్ రాజావాగ పోగిరేన్ వల్లి తమిళం
2013 కాళిచరణ్[2] తెలుగు
2014 లవర్స్ తెలుగు అతిథి పాత్ర
2014 కిరాక్[3] తెలుగు
2016 చిత్రం భ‌ళారే విచిత్రం[4] తెలుగు
2016 విల్ అంబు కనకవల్లి తమిళం
2016 నైయపుడై తమిళం
2016 కన్నుల కాస కాట్టప్ప షాలు తమిళం
2017 ఎన్నోడు విళైయాడు మిన్ని తమిళం
2017 కట్టప్పవ కానోం షీలా తమిళం అతిథి పాత్ర
2017 పాంబు సట్టై చాందిని తమిళం అతిథి పాత్ర
2017 కావన్ నిమ్మి తమిళం
2017 బల్లూన్ తమిళం అతిథి పాత్ర
2018 మన్నర్ వగైయఱా సెల్వరాణి తమిళం
2018 అచమిల్లై అచమిల్లై తమిళం చిత్రీకరణ
2018 ఐనా ఇష్టం నువ్వు తెలుగు చిత్రీకరణ
2018 తామీ తమిళం చిత్రీకరణ
2018 కాదల్ మున్నెట్రా కళగం తమిళం చిత్రీకరణ
2018 పాలాండు వాళ్గా తమిళం చిత్రీకరణ
2018 నాన్ అవళై సందిత పోతు తమిళం చిత్రీకరణ
2018 రాజా రంగుస్కి తమిళం చిత్రీకరణ
2018 వనన్గాముడి తమిళం చిత్రీకరణ

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ఆంధ్రజ్యోతి. "నిజంగా భయపడ్డాను: చాందిని". Retrieved 15 June 2017.[permanent dead link]
  2. 2.0 2.1 123తెలుగు.కాం. "చాందిని హీరోయిన్ గా 'ఎపి02'" Check |url= value (help). www.123తెలుగు.com. Retrieved 15 June 2017.[permanent dead link]
  3. టాలీవుడ్ టైమ్స్. "ఈ నెల 22న వస్తున్న 'కిరక్'". www.tollywoodtimes.com. Archived from the original on 10 ఆగస్టు 2014. Retrieved 15 June 2017. Check date values in: |archive-date= (help)
  4. టాలీవుడ్ టైమ్స్. "కార్తిక డ్రీమ్ క్రియోష‌న్స్ 'చిత్రం భ‌ళారే విచిత్రం'". www.tollywoodtimes.com. Retrieved 15 June 2017.[permanent dead link]