చాంద్రమానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మానం అంటే కొలిచేది అని ఒక అర్థం. చాంద్రమానం అంటే భూమికి అనుగుణంగా చంద్రుడి గమనాన్ని బట్టి తిధులు, వారాలు, నెలలు లేదా మాసాలు, సంవత్సరాలు నిర్ణయించుకునే విధానం. తెలుగు, కన్నడ వారి క్యాలెండర్లు, పంచాంగాలు చాంద్రమానం ప్రకారం ఉంటాయి.

ఇప్పుడు సాధారణంగా అందరం పాటిస్తున్న గ్రిగెరియన్ క్యాలెండర్ సౌరమానం ప్రకారం ఉంటుంది. అంటే సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కాలాన్ని ఆధారం చేసుకున్నది. భూమి తన చుట్టూ తాను తిరిగే (భూభ్రమణం) సమయం ఒక రోజు. భూమి సూర్యుడి చుట్టూ తిరిగే (భూ పరిభ్రమణం) కాలాన్ని (365. 2563666 రోజులు) ఒక సంవత్సరం (365 రోజులు) గా పరిగణించి, దాన్ని 12 నెలలుగా విభజిస్తారు. ప్రతి సంవత్సరం మిగిలి పోయిన పావు రోజును నాలుగో సంవత్సరంలో కలిపి 366 రోజులుగా గణిస్తారు. దీన్ని లీప్ యియర్ అంటారు.

సౌరమానానికి సంవత్సరం పునాది అయితే చాంద్రమానానికి నెల ఆధారం. చాంద్రమానం ప్రకారం నెల అంటే ఒక పౌర్ణమి నుంచి మరో పౌర్ణమి వరకు ఉన్న కాలం. దీన్ని కొంత మంది ఒక అమావాస్య నుంచి అమావాస్య వరకు కూడా లెక్కిస్తారు. తెలుగు వారు అమావాస్య నుంచి అమావాస్య వరకు లెక్కిస్తారు. చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కాలం (సౌరమానం ప్రకారం 27.32 రోజులు) నెల లేదా మాసంగా లెక్కిస్తారు. ఇందులో 30 తిధులు ఉంటాయి. అంటే చాంద్రమానంలోని తిథి సౌరమానంలోని రోజుకన్నా తక్కువ నిడివి కలది. 30 తిధులను రెండు పక్షాలుగా విభజిస్తారు. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు శుక్ల పక్షం, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు కృష్ణ పక్షం.

ప్రతి పక్షంలో 15 తిధులు ఉంటాయి. ఇలా శుక్ల, కృష్ణ పక్షాలు కలిసిన నెలలు ఒక ఏడాది లేదా సంవత్సరంలో 12 ఉంటాయి. రెండు నెలలు ఒక ఋతువు. రెండు ఋతువులు ఒక సీజన్ లేదా కాలం. మూడు కాలాలాలు అంటే వేసవి కాలం, వర్షాకాలం, చలికాలం కలిపి ఒక సంవత్సరం. ఇలాంటి సంవత్సరాలు 60 కలిపి ఒక వృత్తం. తెలుగు వారు పాటించే సంవత్సరాలకై తెలుగు సంవత్సరాలు చూడండి.

చాంద్రమానంలో నెలకు 30 తిథులు ఉన్నా, 27.32 రోజులు మాత్రమే ఉంటాయి కనుక దీన్ని సౌరమానంతో సమన్వయం చేసి, సర్దుబాటు చేసేందుకు వీలుగా చాంద్రమానంలో అధికమాసము అనే వ్యవస్థను ఏర్పాటు చేశారు.

తెలుగువారు పండగలన్నీ చాంద్రమానం ప్రకారమే జరుపుకుంటారు.

ఇవి కూడా చూడండి - కాలమానము కాలమానాలు

https://en.wikipedia.org/wiki/Earth's_orbit https://en.wikipedia.org/wiki/Orbit_of_the_Moon