చాట్రాయి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
చాట్రాయి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం చాట్రాయి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 4,512
 - పురుషుల సంఖ్య 2,329
 - స్త్రీల సంఖ్య 2,183
 - గృహాల సంఖ్య 1,091
పిన్ కోడ్ 521 214
ఎస్.టి.డి కోడ్ 08673
చాట్రాయి
—  మండలం  —
కృష్ణా జిల్లా జిల్లా పటములో చాట్రాయి మండలం యొక్క స్థానము
కృష్ణా జిల్లా జిల్లా పటములో చాట్రాయి మండలం యొక్క స్థానము
చాట్రాయి is located in ఆంధ్ర ప్రదేశ్
చాట్రాయి
ఆంధ్రప్రదేశ్ పటములో చాట్రాయి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°58′59″N 80°51′32″E / 16.983166°N 80.858946°E / 16.983166; 80.858946
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రము చాట్రాయి
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 51,558
 - పురుషులు 26,350
 - స్త్రీలు 25,208
అక్షరాస్యత (2001)
 - మొత్తం 56.63%
 - పురుషులు 62.38%
 - స్త్రీలు 50.61%
పిన్ కోడ్ 521214

చాట్రాయి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన మండల కేంద్రం. పిన్ కోడ్ నం. 521 214., ఎస్.టి.డి.కోడ్ = 08673.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

మనిషి తన నివాసం కోసం కొత్తగా ఇళ్ళుకట్టుకోవడం ప్రారంభించిన రోజులవి! కొబ్బరాకులతో, తాటిఆకులతో ఇల్లు వేసుకునే మనిషి అనంతరం కొండరాళ్ళతో ఇల్లుకట్టుకోవడం ప్రారంభించాడు. ఇంటిలోపల గదినేల మట్టితో అలికేవాడు. ఇదిలా వుండగా కొండరాళ్ళు కొట్టుకునే ఓ వ్యక్తి రాళ్ళను నున్నగా చెక్కుకుని తన ఇంటిగదిలో చపటాగా పరచుకున్నాడు. ఆ రాళ్ళను బంకమన్ను సాయంతో కదలకుండా గట్టిచేయడంతో ఆవిధానం అందరికీ నచ్చేసింది. తమ ఇంట్లో కూడా చపటా రాయి పరవమంటూ అందరూ అడిగేవారు. ఇంటి గదుల్లో చపటారాయి పరచిన ప్రాంతం కాబట్టి.. ఈ ప్రాంతాన్ని అందరూ ఇదే పేరుతో పిలువడం ప్రారంభించారు. మొదట్లో ‘చపటారాయి’గా..‘చపట్రాయి’గా పిలువబడిన ఈ ప్రాంతాన్ని ఇప్పుడు ‘చాట్రాయి’గా వ్యవహరిస్తున్నారు.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 16 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

 • హైదరాబాదుకు సుమారు 300కి.మీ.,విజయవాడ నగరానికి 80కి.మీ.దూరంలో కృష్ణా జిల్లా మరియు పశ్చిమగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉంటుంది చాట్రాయి గ్రామం.
 • భౌగోళికంగా 16°59′ఉత్తర 80°52′తూర్పు అక్షాంశరేఖాంశాలలో ఉన్న ఈ ఊరు దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం. సమశీతోష్ణ మండలంలో ఉన్న చాట్రాయిలో వేసవి గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45°సెల్సియస్, చలికాలంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 17°సెల్సియస్ వరకు నమోదు అవుతాయి.

సమీప గ్రామాలు[మార్చు]

ఆరుగొలను 4 కి.మీ, జనార్ధనవరం 4 కి.మీ, జానాలగడ్డ 5 కి.మీ, చనుబండ 5 కి.మీ, నరసాపురం 7 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

విస్సన్నపేట, లింగపాలెం, చింతలపూడి, రెడ్డిగూడెం

రవాణా సౌకర్యాలు:[మార్చు]

చాట్రాయికి రావటానికి మార్గాలు:-

 1. నూజివీడు నుండి చింతలపూడి ( వయా విస్సన్నపేట, పోలవరము)
 2. నూజివీడు నుండి చీపురగూడెం ( వయా విస్సన్నపేట, చాట్రాయి)
 3. నూజివీడు నుండి చీపురగూడెం ( వయా చిత్తపూర్, చాట్రాయి)
 • చాట్రాయి నుండి:- విస్సన్నపేట = 12 కి.మీ, నూజివీడు = 32 కి.మీ, సత్తుపల్లి = 35 కి.మీ, తిరువూరు = 38 కి.మీ. చింతలపూడి = 23 కి.మీ.
 • రైల్వేస్టేషన్ విజయవాడ 65 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

విద్యా రంగంలో చాలా ముందంజలో ఉంది.

వివేకానంద జూనియర్ కాలేజి,

వికాస్ జూనియర్ కాలేజి,

జిల్లాపరిషత్ హైస్కూల్,

స్వనిక్ర్ విద్యానికేతన్,

ఆర్.సి.ఎం.ప్రాథమికోన్నత పాఠశాల.

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

పాలశీతలీకరణ కేంద్రం:- గ్రామములో ఈ కేంద్రాన్ని, 2016,ఫిబ్రవరి-4వ తేదీనాడు ప్రారంభించారు. [4]

గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

2013,జులైలో ఈ గ్రామపంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో, శ్రీ కోట జోషి, సర్పంచిగా ఎన్నికైనారు. [5]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

 1. శ్రీ ఉమా రామలింగేశ్వరస్వామివారి ఆలయం (శివాలయం):- ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుచున్నారు. వినాయక చవితి ఉత్సవాలు గూడా ఇక్కడ చాలా బాగా జరుగుతాయి.
 2. శ్రీ రామాలయం:- శ్రీ రామ నవమి ఉత్సవాలు ఇక్కడ చాలా బాగా జరుగుతాయి.
 3. శ్రీ ముత్యాలమ్మఅమ్మవారి ఆలయం.
 4. శ్రీ కనకదుర్గమ్మఅమ్మవారి ఆలయం.
 5. శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం.
 6. శ్రీ సాయిబాబా ఆలయం.
 7. శ్రీ శ్రీ శ్రీ దర్మశాస్తా అయ్యప్పస్వామి వారి దేవాలయము:- ఈ ఆలయం, శంకుస్థాపన జరిగి నిర్మాణం పూర్తి అయినది. నూతనంగా నిర్మించిన ఈ అలయంలో, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,జూన్-1వ తేదీ సోమవారంనుండి ప్రారంభీంచారు. రెండవతేదీ మంగళవారంనాడు, ధ్వజస్తంభానికి, గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేకపూజలు, నవగ్రహహోమం నిర్వహించారు. 4వతేదీ గురువారంనాడు, ప్రతిష్ఠాపన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. ఉదయం 9 గంటలకు, ఏకకాలంలో శ్రీ అయ్యప్ప, శ్రీ విఘ్నేశ్వర, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ కడుత్తిస్వామి, శ్రీ కరుప్పస్వామి, శ్రీ మాలికాపురత్తమ్మల విగ్రహాలతోపాటు, శిఖర, ధ్వజస్తంభ ప్రతిష్ఠా కార్యక్రమం, వేదమంత్రాల నడుమ నిర్వహించారు. అనంతరం సంపూర్ణ జీవకళాన్యాసం నిర్వహించి భక్తులకు అయ్యప్పస్వామి దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేలాదిమంది భక్తులకు అన్నదానం ఏర్పాటుచేసారు. [2]&[3]

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

చాట్రాయిలో వరి,మొక్కజొన్న,చెరుకు,మిరప,పత్తి,పసుపు లాంటి పంటలకు ప్రసిద్ధి.

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడిన ఈ గ్రామానికి కృష్ణానది కాలువ, వర్షపు నీరు ఆధారం.

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

చాట్రాయి మండలము లోని గ్రామాలు[మార్చు]

కింద చూపబడిన చిత్రంలో చాట్రాయి లోని ఒక అందమైన పంటపొలాన్ని చూడవచ్చు.

వరి పంటకు ప్రసిద్ధమైన చాట్రాయి లోని ఒక పచ్చని పైరు చిత్రం

జనాభా[మార్చు]

 • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. ఆరుగొలనుపేట 362 1,602 818 784
2. బూరుగుగూడెం 422 1,784 905 879
3. చనుబండ 2,154 8,902 4,514 4,388
4. చాట్రాయి 1,091 4,512 2,329 2,183
5. చిన్నంపేట 783 3,337 1,685 1,652
6. చిత్తపూర్ 835 3,776 1,920 1,856
7. జనార్దనవరం 585 2,452 1,256 1,196
8. కొత్తపాడు 1,233 5,325 2,738 2,587
9. కొత్తగూడెం 453 1,807 943 864
10. కృష్ణారావుపాలెం 243 1,074 528 546
11. మంకొల్లు 144 577 292 285
12. పర్వతపురం 244 1,039 524 515
13. పోలవరం 1,080 4,637 2,355 2,282
14. పోతనపల్లి 559 2,493 1,256 1,237
15. సోమవరం 1,077 4,323 2,221 2,102
16. తుమ్మగూడెం 916 3,918 2,066 1,852

వనరులు[మార్చు]

 1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Chatrai/Chatrai". Retrieved 21 June 2016.  External link in |title= (help)
 2. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు అమరావతి; 2015,జూన్-3; 39వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2015,జూన్-5; 3వపేజీ. [4] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-5; 5వపేజీ. [5] ఈనాడు అమరావతి/నూజివీడు; 2017,ఆగష్టు-29; 2వపేజీ.


"https://te.wikipedia.org/w/index.php?title=చాట్రాయి&oldid=2184039" నుండి వెలికితీశారు