చాడ్ మైఖేల్ ముర్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Chad Michael Murray
Chad Michael Murray in 2007.jpg
Murray at the Pirates of the Caribbean: At World's End premiere at Disneyland Park in Southern California, 2007
జననం (1981-08-24) 1981 ఆగస్టు 24 (వయస్సు: 38  సంవత్సరాలు)
ఇతర పేర్లు Chad Murray
క్రియాశీలక సంవత్సరాలు 1999–present
భార్య/భర్త Sophia Bush (2005–2006)

చాడ్ మైఖేల్ ముర్రే (జననం ఆగష్టు 24, 1981) ఒక అమెరికా నటుడు, మాజీ ఫ్యాషన్ మోడల్ మరియు స్పోక్స్ పర్సన్ (వ్యక్తిగతంగా ఒక వ్యక్తి కోసం కానీ ఒక వ్యవస్థ కోసం కానీ మాట్లాడు వ్యక్తి). ముర్రే ఏ సిండ్రెల్లా స్టొరీ చిత్రంలో హిలరి డఫ్ తో చేసిన ఆస్టిన్ అమెస్ పాత్ర ఆయనకు అంతర్జాతీయంగా మంచి పేరుని తెచ్చింది. అతను ది CW టీన్ అనే ఒక దూరదర్శన్ విభాగంలో వచ్చిన ఒన్ ట్రీ హిల్ అనే ఒక యువ నాటక ధారావాహికలో లుకాస్ స్కాట్ అనే ప్రధాన పాత్ర పోషించారు. అంతే కాకుండా, వాణిజ్యపరంగా విజయవంతమైన ఫ్రీకి ఫ్రైడే మరియు హౌస్ అఫ్ వాక్స్ వంటి చిత్రాలలో నటించటం వలన అటు యువతలో మరియు ఇటు పెద్దలలో కూడా మంచి ఆదరణ పొందారు. ముర్రే టీన్ ఛాయిస్ అవార్డు ప్రతిపాదనలు మరియు అనేక ప్రధానమైన వార్త సంచికలు రోలింగ్ స్టన్ , పీపుల్ , వానిటీ ఫెయిర్ మరియు ఎంటర్టైన్మెంట్ వీక్లీ వంటి సంచికలపై ఆయన ముఖచిత్రం ప్రచురించిన ఘనత సాధించారు.

బాల్య జీవితం[మార్చు]

ముర్రే న్యూ యార్క్ లోని బఫెలో లో జన్మించారు. ఆయన తండ్రి పేరు రెక్స్ ముర్రే, ఒక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్.[1]

వృత్తి[మార్చు]

1999లో ముర్రే హాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించాడు, అంతకు ముందే అక్కడ అతను స్కెచర్స్, టామీ హిల్ఫిగేర్ మరియు గూచీ వంటి సంస్థల కోసం మోడలింగ్ చేస్తుండేవాడు.

ముర్రే దూరదర్శన్ లో అనేక ధారావాహికలలో అతిథి పాత్రలు పోషించారు, డయాగ్నోసిస్ మర్డర్ అనే ఒక ధారావాహిక యొక్క ఒక ఎపిసోడ్ లో అయన నటించారు.CSI: Crime Scene Investigation . 1999లో ముర్రే ట్రిస్టాన్ డగ్రే పాత్రని గిల్మోర్ గాళ్స్ అనే ధారావాహికలో పోషించారు; ఈ పాత్ర మొదటి సీజన్ లో ప్రసారమయ్యే ధారావాహికలో ప్రధానమైన పాత్ర, ఈ పాత్ర తరువాయి భాగాలలో కూడా మరల ఆవర్తనం అయింది. ముర్రే తరువాత అనేక దూరదర్శన్ చిత్రాలు, ఆఫ్టర్ మాత్ మరియు మర్ఫీస్ డజెన్ వంటి వాటిలో కూడా నటించారు. ఆ తర్వాత సంవత్సరం, అతను విజయవంతమైన దూరదర్శన్ ధారావాహిక డాసన్స్ క్రీక్ లో చార్లీ టాడ్ పాత్రలో నటించారు.

2003లో ముర్రే వాల్ట్ డిస్నీ పిక్చర్స్ వారి చలనచిత్రం, ఫ్రీకి ఫ్రైడే లో లిండ్సే లోహన్ మరియు జామీ లీ కర్టిస్ వంటి సహనటులతో నటించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర భారీ విజయం సాధించి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో మొత్తం $110,222,438 డాలర్ల వసూళ్లను అర్జించింది. విమర్శకులు కూడా ఈ చిత్రానికి మంచి పొగడ్తలని ఇచ్చారు, మరియు ఈ చిత్రం యాహూ! చిత్రాలు జాబితాలో "బి" తరగతి స్థానాన్ని సాధించింది, మరియు రాటెన్ టొమాటోస్ వెబ్ సైట్ లో 88% "సర్టిఫైడ్ ఫ్రెష్" రేటింగ్ పొందింది. ముర్రే దూరదర్శన్ చిత్రం ది లోన్ రేంజర్ లో ల్యూక్ హార్ట్మన్ పాత్ర పోషించాడు.

ఆ తర్వాత సంవత్సరం ముర్రే WB దూరదర్శన్ నెట్వర్క్ విభాగం యొక్క ధారావాహిక ఒన్ ట్రీ హిల్ లో ప్రధాన పాత్ర అయిన లుకాస్ స్కాట్ పాత్రలో నటించే అవకాశం అందిపుచ్చుకున్నారు. ఈ ధారావాహిక మొదటి సీజన్ యొక్క ఆకహ్రి భాగం దాదాపు 4.50 మిలియన్ ప్రేక్షకులు వీక్షించినదిగా ఆ చానల్ యొక్క మంచి విజయవంతమైన ధారావాహికగా నిలిచింది. ఈ ధారావాహిక 2003లో మొదట ప్రసారం చేసినప్పుడు WB యొక్క అత్యుత్తమమైన మరియు విజయవంతమైన దూరదర్శన్ ధారావాహికగా నిలిచింది, మరియు CW కొరకు అత్యుత్తమ రేటింగ్ పొందుతూ ఉన్నది, ఈ ధారావాహిక ముర్రేకు చాల అవార్డులు సాధించి పెట్టింది, వాటిలో పదకొండు టీన్ చాయిస్ అవార్డ్స్ ఉన్నాయి, మరియు ఒక పుస్తక శ్రేణిని కూడా విడుదల చేసారు, నటీనటుల నటనను మరియు అసలు కథను ప్రశంసించిన విమర్శకులు కూడా దీనిని మెచ్చుకున్నారు. తర్వాత ముర్రే గొప్ప ప్రజాదరణను మరియు మీడియా ఇచ్చిన ప్రచారంతో గొప్ప కీర్తిని సాధించాడు, ఇంకా అతను చాల గొప్ప పేరున్న సంస్థలకు స్పోక్స్ పర్సన్ గా పనిచేయటానికి ఒప్పందం చేసుకున్నాడు. అతను మరియు అతనితో కలిసి ఒన్ ట్రీ హిల్ లోని సహనటులు మాస్టర్ కార్డు మరియు కే-మార్ట్ కు అధికారిక ప్రతినిధులుగా ఉన్నారు.[2] వాటితో పాటు అదనంగా వారు సింగులర్ వైర్లెస్ మరియు చెవీ కోబాల్ట్ సంస్థలకు కూడా ప్రతినిధులుగా పనిచేసారు.[3]

2003 లో ఒన్ ట్రీ హిల్ లోని ముర్రే పోషించిన పాత్ర వలన వచ్చిన పేరుతో ఆయన చిత్రాన్ని అనేక ప్రధానమైన వార్తా సంచికలు రోలింగ్ స్టోన్ మరియు పీపుల్ వంటి వాటిపై ముఖచిత్రంగా ప్రచురించారు. అదే సంవత్సరం అతను "దూరదర్శన్ యొక్క శృంగార పురుషులు" గా పీపుల్ వార్తా సంచికలో ఎన్నుకోబడ్డారు.[4]

2004 లో, ముర్రే శృంగారభరిత హాస్య చిత్రం ఎ సిండ్రెల్లా స్టొరీ లో హిలరి డఫ్ తో కలిసి నటించారు. ఈ చిత్రానికి సమీక్షలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ, బాక్సాఫీసు వద్ద మాత్రం ఒక రకంగా కాసుల వర్షం కురిపించింది. డఫ్ నటనకు విమర్శకులు సైతం ముగ్ధులయ్యారు.[67] ఎ సిండ్రెల్లా స్టొరీ $70.1 మిలియన్ డాలర్లను ప్రపంచ వ్యాప్తంగా ఆర్జించింది.[5] ఈ చిత్రం 2006 టీన్ ఛాయిస్ అవార్డ్స్ లో అనేక విభాగములలో అవార్డులను సాధించింది. ఆ తరువాత సంవత్సరం ముర్రే "శృంగార పురుషుడు" గా పీపుల్ వార్తాసంచికలో పేరుపొంది దాని ముఖచిత్రంపై కనిపించారు.[ఆధారం చూపాలి]

2005 లో, ముర్రే హౌస్ అఫ్ వాక్స్ లో నటించారు. ఈ చిత్రం మొదటి రోజే $12 మిలియన్ డాలర్ల వసూళ్లు అర్జించింది. చిత్ర విమర్శకుల వద్ద నుండి ప్రతికూల సమీక్షలు వచ్చినప్పటికీ హౌస్ అఫ్ వాక్స్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు $68,766,121 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ముర్రేకు 2006 యొక్క టీన్ ఛాయిస్ అవార్డ్స్ అనేక విభాగములలో అవార్డులను అందించింది. వాటిలో "ఛాయిస్ చిత్ర నటుడు:నటన/సాహసం/ఉత్కంఠభరితం" కూడా ఉన్నాయి.[ఆధారం చూపాలి]

మే 2009 లో, CW ముర్రే ఒన్ ట్రీ హిల్ యొక్క ఏడవ సీజన్ లో నటించటం లేదని ప్రకటించారు.[6] ముర్రే ఒక వీడియోలో నిర్మాతలు తనని తిరిగి ఆ పాత్రకు తీసుకోవాలనుకోవటం లేదని ఎందుకంటే వారు డబ్బు ఆదా చేసుకోవాలనుకుంటున్నారని తన అభిమానులకు చెప్పటాన్ని రికార్డు చేసారు. మార్క్ ష్వాన్ ఒక ముఖాముఖీలో ఏమి చెప్పారంటే తను ముర్రే తిరిగి నటించటానికి "విలువైన వస్తువులను" ఇస్తాను అని చెప్పానని అన్నారు.[7]

2010 లో, ముర్రే అలీసియా కీస్ యొక్క సంగీత వీడియో "అన్-థింకబుల్ (ఐ యామ్ రెడీ)" లో నటించారు.[8][9]

ముర్రే ఎక్స్-మస్ కరోల్ అనే చిత్రంలో ఆశ్లే బెన్సన్ మరియు క్రిస్టినా మిలియన్ వంటి సహనటుల పక్కన నటించబోతున్నారు.[10] ఈ చిత్రం ఒక ABC ఫ్యామిలీ ఒరిజినల్ మూవీ చిత్రం మరియు ఈ చిత్రం "ఒక మతిస్థిమితం లేని అమ్మాయి దర్శించే భూత, భవిష్యత్ మరియు వర్తమానం యొక్క క్రిస్మస్ పండుగ గురించి" చిత్రీకరించింది.[11]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ముర్రే ఒన్ ట్రీ హిల్ లోని తన సహనటి సోఫియా బుష్ ని దాదాపు రెండు సంవత్సరాలు సహజీవనం సాగించాక ఏప్రిల్ 16,2005 లో వివాహమాడారు. ఐదు నెలల తరువాత బుష్ తమ వివాహాన్ని రద్దు చేసుకొనుటకు న్యాయస్థానానికి పత్రాలను ఇవ్వాలని నిశ్చయించుకుంది. వివాహం రద్దు అయిపోయాక ముర్రే ఒన్ ట్రీ హిల్ లో అదనపు చీర్ లీడర్ మరియు 2005 మిస్ నార్త్ కరొలిన టీన్ USA ఉత్సవంలో ఓడిపోయిన కెంజి డాల్టన్ తో సహజీవనం చేయటం మొదలుపెట్టారు. తరువాత వారిద్దరు నిశ్చితార్ధం చేసుకున్నారు.[12]

చలనచిత్రపట్టిక[మార్చు]

చలనచిత్రం
సంవత్సరం చలనచిత్రం పాత్ర సూచనలు
2001 మర్ఫీస్ డజెన్ తెలియదు దూరదర్శన్ చిత్రం
తదనంతర పరిస్థితి సీన్ దూరదర్శన్ చిత్రం
మేగిడ్డో డేవిడ్ అలెగ్జాండర్ - వయస్సు 16 నేరుగా DVD లో వచ్చిన చిత్రం
2003 ది లోన్ రేంజర్ ల్యూక్ హార్ట్ మన్ దూరదర్శన్ చిత్రం
ఫ్రీకీ ఫ్రైడే జేక్
2004 ఎ సిండ్రెల్ల స్టొరీ ఆస్టిన్ అమెస్ టీన్ ఛాయిస్ అవార్డు ఛాయిస్ బ్రేక్ ఔట్ మూవీ స్టార్ - మేల్
ఛాయిస్ మూవీ కేమిస్త్రి(హిలరీ డఫ్ తో) కొరకు టీన్ ఛాయిస్ అవార్డు - ప్రతిపాదన
ఛాయిస్ మూవీ కెమిస్ట్రీ (హిలరీ డఫ్ తో) కొరకు టీన్ ఛాయిస్ అవార్డు - ప్రతిపాదన
ఛాయిస్ మూవీ లిప్ లాక్ (హిలరీ డఫ్) కొరకు టీన్ ఛాయిస్ అవార్డు - ప్రతిపాదన
ఛాయిస్ మూవీ లవ్ సీన్ (హిలరీ డఫ్) కొరకు టీన్ ఛాయిస్ అవార్డు - ప్రతిపాదన
2005 హౌస్ అఫ్ వాక్స్ నిక్ జోన్స్ ఛాయిస్ మూవీ యాక్టర్ కొరకు టీన్ ఛాయిస్ అవార్డు - నటన/సాహసం/ఉత్కంఠభరితం
ఛాయిస్ మూవీ రమ్బుల్ (ఎలిష కుత్బర్ట్ & బ్రియాన్ వాన్ హాల్ట్ ) కొరకు టీన్ ఛాయిస్ అవార్డు - ప్రతిపాదన
2006 హోం అఫ్ ది బ్రేవ్ జోర్డాన్ ఓవెన్స్
2010 లైస్ ఇన్ ప్లైన్ సైట్ ఎతాన్ మాక్ అలిస్టర్ దూరదర్శన్ చిత్రం
ఎక్స్-మాస్ కారోల్ బ్రెంట్ దూరదర్శన్ చిత్రం
2011 పేపర్ వింగ్స్ తెలియదు అభివృద్ధి లో ఉంది
దూరదర్శన్
సంవత్సరం టెలివిజన్ ధారావాహికలు పాత్ర సూచనలు
2000 అన్డ్రెస్డ్ డాన్ కాలం 2 (ఎపిసోడ్ #2.17 )
Diagnosis: Murder రే సాన్టుసి ఎపిసోడ్: "ది క్రాడిల్ విల్ రాక్"
2000-2001 గిల్మోర్ గాళ్స్ ట్రిస్టన్ దగ్రే కాలం 1 (11 ఎపిసోడ్లు)
2001-2002 డావ్సన్'స్ క్రీక్ చార్లీ తడ కాలం 5 (12 ఎపిసోడ్లు )
2002 CSI: Crime Scene Investigation టాం హవిలాండ్ ఎపిసోడ్: "ది అక్యుజ్ద్ ఈజ్ ఎన్ టైటిల్డ్"
2003-2009 ఒన్ ట్రీ హిల్ ల్యుకాస్ స్కాట్ ఛాయిస్ అత్యుత్తమ టివి నటుడు - పురుషులు కొరకు టీన్ ఛాయిస్ అవార్డు
ఛాయిస్ టివి నటుడు - నాటకం కొరకు టీన్ ఛాయిస్ అవార్డు
ఛాయిస్ టివి నటుడు - నాటకీయం/నటన/సాహసం కొరకు టీన్ ఛాయిస్ అవార్డు - ప్రతిపాదన
ఛాయిస్ టివి నటుడు - నాటకీయం కొరకు టీన్ ఛాయిస్ అవార్డ్ - ప్రతిపాదన
ఛాయిస్ Tivi కెమిస్ట్రీ (జేమ్స్ లాఫెర్టి తో) కొరకు టీన్ ఛాయిస్ అవార్డ్ - ప్రతిపాదన
ఛాయిస్ టివి నటుడు - నాటకీయం/నటన/సాహసం కొరకు టీన్ ఛాయిస్ అవార్డ్ - ప్రతిపాదన
ప్రాయోజిత కార్యక్రమం స్టోరీలైన్ లో ప్రదర్శించిన నటన కొరకు ప్రిజం అవార్డ్ - ప్రతిపాదన

పురస్కారాలు[మార్చు]

మూస:Filmography table begin |- | rowspan=3|2004 టీన్ ఛాయిస్ అవార్డు | ఛాయిస్ అత్యుత్తమ చిత్ర నటుడు - పురుషులు | style="background: #BFD; color: black; vertical-align: middle; text-align: center; " class="yes table-yes2"|విజేత | ఏ సిండ్రెల్లా స్టొరీ | |- టీన్ ఛాయిస్ అవార్డు | ఛాయిస్ అత్యుత్తమ TV నటుడు - పురుషులు | style="background: #BFD; color: black; vertical-align: middle; text-align: center; " class="yes table-yes2"|విజేత | ఒన్ ట్రీ హిల్ | |- టీన్ ఛాయిస్ అవార్డు | ఛాయిస్ TV నటుడు - నాటకీయం/నటన/సాహసం | మూస:Nominated | ఒన్ ట్రీ హిల్ | |- | rowspan=7|2005 టీన్ ఛాయిస్ అవార్డు | ఛాయిస్ చిత్ర నటుడు - నటన/సాహసం/ఉత్కంఠభరితం | style="background: #BFD; color: black; vertical-align: middle; text-align: center; " class="yes table-yes2"|విజేత | హౌస్ అఫ్ వాక్స్ | |-

టీన్ ఛాయిస్ అవార్డు | ఛాయిస్ చిత్ర కెమిస్ట్రీ | మూస:Nominated | ఏ సిండ్రెల్లా స్టొరీ | హిలరీ డఫ్ తో పాలుపంచుకున్నది |- టీన్ ఛాయిస్ అవార్డు ఛాయిస్ మూవీ లిప్‌లాక్ | మూస:Nominated | ఏ సిండ్రెల్లా స్టొరీ | హిలరీ డఫ్ తో పాలుపంచుకున్నది |- టీన్ ఛాయిస్ అవార్డు | ఛాయిస్ చిత్ర ప్రేమ సన్నివేశం ౩౯ | ఏ సిండ్రెల్లా స్టొరీ |హిలరీ డఫ్ తో పాలుపంచుకున్నది ఆస్టిన్ & సామ్ యొక్క నృత్య సన్నివేశం |- టీన్ ఛాయిస్ అవార్డు | ఛాయిస్ చిత్ర రమ్బుల్ | మూస:Nominated | హౌస్ అఫ్ వాక్స్ | ఎలిష కత్బెర్ట్ & బ్రియాన్ వాన్ హాల్ట్ తో పాలుపంచుకున్నవి |- టీన్ ఛాయిస్ అవార్డు | ఛాయిస్ TV నటుడు - నాటకం | మూస:Nominated | ఒన్ ట్రీ హిల్ | |- టీన్ ఛాయిస్ అవార్డు | ఛాయిస్ టివి కెమిస్ట్రీ | మూస:Nominated | ఒన్ ట్రీ హిల్ |జేమ్స్ లాఫేర్టి తో పాలుపంచుకున్నది |- | rowspan=2|2006 టీన్ ఛాయిస్ అవార్డు | ఛాయిస్ TV నటుడు - నాటకీయం/నటన/సాహసం | మూస:Nominated | ఒన్ ట్రీ హిల్ | |- ప్రిసం అవార్డ్స్ | ప్రాయోజిత కార్యక్రమం స్టోరీలైన్ లో ప్రదర్శించిన నటన | మూస:Nominated | ఒన్ ట్రీ హిల్ | |- | 2008 టీన్ ఛాయిస్ అవార్డు | ఛాయిస్ టివి నటుడు - నాటకీయం | style="background: #BFD; color: black; vertical-align: middle; text-align: center; " class="yes table-yes2"|విజేత | ఒన్ ట్రీ హిల్ | మూస:Filmography table end

మూలం[మార్చు]

 1. "Chad Michael Murray Biography (1981-)". filmreference.com. Retrieved July 17, 2010.
 2. Hopkins, Brent (May 21, 2004). "KMart Gets Hip Retailer Swings Deal With The WB". The Free Library. Retrieved July 17, 2010.
 3. "One Tree Hill update - May 2005". One Tree Hill Web. May 19, 2005. Retrieved July 17, 2010.
 4. "TV's Sexiest Guys". People Magazine. November 24, 2004. Retrieved July 17, 2010.
 5. "A Cinderella Story (2004)". Box Office Mojo. Retrieved July 17, 2010.
 6. Mitovich (May 12, 2009). "Breaking: Two Stars Exit One Tree Hill". TVGuide.com. Retrieved May 12, 2009.
 7. Martin, Denise (May 12, 2009). "One Tree Hill stars Chad Michael Murray and Hilarie Burton exit". Los Angeles Times. Retrieved July 2, 2010.
 8. "Alicia Keys 'Unthinkable' video premiers featuring Chad Michael Murray". IMDb. May 12, 2010. Retrieved June 21, 2010.
 9. Loomis, George (May 13, 2010). "Chad Michael Murray Stars In Alicia Keys' "Unthinkable" Video-- We Dissect His Looks!". MTV.com. Retrieved July 17, 2010.
 10. http://twitter.com/AshBenzo/status/19605773124
 11. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-04-29 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-09-06. Cite web requires |website= (help)
 12. "Fast Forward His marriage not yet ended, Chad Michael Murray steps out with his new, teen fiancee Kenzie Dalton". People. April 24, 2006. Retrieved July 17, 2010.

బాహ్య లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.