చారకొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చారకొండ
—  మండలం  —
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ స్థానాలు
తెలంగాణ పటంలో నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నాగర్‌కర్నూల్ జిల్లా
మండల కేంద్రం చారకొండ
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 170 km² (65.6 sq mi)
జనాభా (2016)
 - మొత్తం 20,550
 - పురుషులు 10,457
 - స్త్రీలు 10,093
పిన్‌కోడ్ {{{pincode}}}


చారకొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 93 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. [2] ఇందులో 7 గ్రామాలున్నాయి. దానికి ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లా లో ఉండేది. [3] ప్రస్తుతం ఈ మండలం కల్వకుర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 7  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం చారకొండ

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 170 చ.కి.మీ. కాగా, జనాభా 20,550. జనాభాలో పురుషులు 10,457 కాగా, స్త్రీల సంఖ్య 10,093. మండలంలో 4,898 గృహాలున్నాయి.[4]

2016 లో ఏర్పడిన కొత్త మండలం

[మార్చు]

లోగడ చారకొండ  గ్రామం మహబూబ్ నగర్ జిల్లా, అదే రెవెన్యూ డివిజను పరిధిలోని వంగూరు మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా చారకొండ గ్రామాన్ని (1+06) 7 గ్రామాలుతో నూతన మండల కేంధ్రంగా నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
 1. చారకొండ
 2. సిర్సనగండ్ల
 3. తిమ్మాయిపల్లి
 4. కమలాపూర్
 5. జూపల్లి
 6. గోకారం
 7. సేరిఅప్పారెడ్డిపల్లి

మూలాలు

[మార్చు]
 1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 243, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016  
 2. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
 3. "నాగర్ కర్నూల్ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-28 suggested (help)
 4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]