చారు (సూప్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫ్రెంచ్ ఉల్లి పులుసు కలిగిన గిన్ని
ఇంట్లో తయారుచయబడిన బ్రెడ్ తో చికెన్ నూడిల్ సూప్

రక్తం, రసం, నీళ్లు లేదా ఇతర ద్రవంతో మాంసం మరియు కూరగాయలు వంటి వంట సరంజామాను చేర్చడం ద్వారా తయారు చేసే ఆహారాన్ని చారు (సూప్) అంటారు. రసాలను సేకరించే వరకు ఒక కుండలోని ద్రవాల్లో ఘన ఆహార పదార్థాలను వేడి చేయడం ద్వారా బ్రోత్ (మాంసంవేసి కాచిన చారు) తయారవుతుంది, ఈ విధంగా చేసిన ఆహార పదార్థాన్ని వేడి చారుగా పిలుస్తారు. సాంప్రదాయికంగా, చారును రెండు ప్రధాన రకాలుగా వర్గీకరిస్తారు: అవి, నీళ్ల చారు మరియు గట్టి చారు . నీళ్లచారుకు ఏర్పాటు చేసిన ఫ్రెంచ్ వర్గీకరణలు బౌలియన్ మరియు కాన్సోమ్ . గట్టి చారును అది గట్టిపడటానికి ఉపయోగించిన పదార్థం యొక్క రకం ఆధారంగా వర్గీకరిస్తారు: పురీస్ (కట్టు (ఉడికించి చారుగా అయ్యే వరకు బాగా ఎనిపిన వంటకం)) అనేవి పిండితో చిక్కగా చేసే కూరగాయల చారులను సూచిస్తాయి; బాగా ఎనిపిన నత్తగుల్లలు లేదా కూరగాయలను ఉపయోగించి, క్రీముతో చిక్కగా చేసే చారును బిస్క్యూస్ అంటారు; క్రీము చారును బెకామెల్ సాస్‌తో చిక్కగా చేస్తారు; వెలౌట్‌ లను గ్రుడ్లు, వెన్న మరియు క్రీముతో చిక్కగా చేస్తారు. చారు మరియు మాంసపు చారును చిక్కగా చేసేందుకు సాధారణంగా ఉపయోగించే ఇతర పదార్థాలు బియ్యం, పిండి మరియు ధాన్యాలు.

చారు దాదాపుగా పులుసు (స్టివ్)ను పోలివుంటుంది, కొన్ని సందర్భాల్లో ఈ రెండింటి మధ్య స్పష్టమైన తేడా కూడా కనిపించకపోవచ్చు; అయితే పులుసులో కంటే చారులో ఎక్కువగా ద్రవ పదార్థం ఉంటుంది.[1]

చరిత్ర[మార్చు]

విల్లియం-అడోల్ఫే బొగ్యుర్యు పులుసు (1865)

చారుకు సంబంధించిన మొట్టమొదటి ఆధారాలను క్రీస్తుపూర్వం 6000 కాలంలో గుర్తించారు.[2] 9000 సంవత్సరాల క్రితం జలజిత పాత్రలు (ఈ కాలంలో మొదట మట్టి పాత్రలు లేదా జంతువుల చర్మంతో చేసిన సంచులను వంట కోసం ఉపయోగించడం ప్రారంభమైంది) కనిపెట్టే వరకు ఉడకబెట్టడం సాధారణ వంట పద్ధతిగా ఉండేది కాదు. రసం లేదా ఒకరకమైన ద్రవం నుంచి చారును తయారు చేయవచ్చు.

ఫ్రెంచ్ భాషలోని soupe ("చారు", "రసం") పదం నుంచి సూప్ అనే పదం ఉద్భవించింది, ఈ ఫ్రెంచ్ పదం ఒక జర్మన్ మూలం నుంచి అసభ్య లాటిన్ పదమైన సుప్పా ("రక్తమాంసాల్లో ముంచిన రొట్టె) ద్వారా పుట్టింది, దీని నుంచే "సోప్" అనే పదం కూడా పుట్టింది, చారు లేదా చిక్కని రసంలో నంజుకునేందుకు ఉపయోగించే రొట్టె ముక్కను సోప్ అంటారు.

రెస్టారెంట్ ("పునరుద్ధరించే పదార్థం" అనే అర్థం వస్తుంది) అనే పదాన్ని మొదటిసారి 16వ శతాబ్దంలో ఫ్రాన్స్‌లో ఉపయోగించారు, దీనిని బాగా చిక్కని, చౌకైన చారును వర్ణించేందుకు ఈ పేరు ఉపయోగించారు, దీనిని వీధి వ్యాపారులు విక్రయించేవారు, శారీరక అలసటకు ఒక విరుగుడుగా దీనిని ప్రచారం చేశారు, 1765లో ప్యారిస్‌కు చెందిన ఒక వ్యాపారి ఇటువంటి చారుకు ప్రత్యేకించి ఒక దుకాణాన్ని ప్రారంభించాడు. ఆధునిక పదం రెస్టారెంట్‌ను దుకాణాలను సూచించడానికి ఉపయోగించేందుకు ఈ చర్య కారణమైంది.

అమెరికాలో మొట్టమొదటి వలసరాజ్య కాలపు వంట పుస్తకాన్ని 1742లో వర్జీనియాలోని విలియమ్‌బర్గ్‌లో విలియమ్ పార్క్స్ ప్రచురించారు, దీనిని ఎలిజా స్మిత్ యొక్క ది కంప్లీట్ హౌస్‌వైఫ్; లేదా అకంప్లిష్డ్ జెంటిల్‌వుమన్స్ కంపానియన్ ఆధారంగా రాశారు, దీనిలో పలు చారు రకాలు మరియు బిస్క్యూస్ కోసం అనేక వంటకాలు చేర్చబడ్డాయి. 1772నాటి వంట పుస్తకం ది ఫ్రూగల్ హౌస్‌వైఫ్ ఈ అంశంపై ఒక అధ్యాయాన్ని కలిగివుంది. ప్రారంభ వలసరాజ్య వంటకాల్లో ఆంగ్ల వంట ఆధిపత్యం కలిగివుండేది; కొత్త వలసదారులు ఇతర దేశాల నుంచి రావడంతో, ఇతర దేశాలకు చెందిన చారు రకాలకు కూడా ప్రాచుర్యం పెరిగింది. ముఖ్యంగా జర్మనీ వలసదారులు పెన్సిల్వేనియాలో నివసించేవారు, బంగాళాదుంప చారు వీరి ద్వారా ప్రసిద్ధి చెందింది. 1794లో జీన్ బాప్టిస్ట్ గిల్బర్ట్ పేప్లాట్ డిస్ జూలియన్ అనే ఒక ఫ్రెంచ్ విప్లవ కాలపు శరణార్థి ది రెస్టోరేటర్ అని పిలిచే ఆహార పదార్థాల కేంద్రాన్ని బోస్టన్‌లో స్థాపించాడు, ఇది "ది ప్రిన్స్ ఆఫ్ సూప్స్"గా గుర్తింపు పొందింది. చారు వంటకాలకు ప్రత్యేకించబడిన మొదటి అమెరికన్ వంట పుస్తకాన్ని ఎమ్మా ఈవింగ్ 1882లో రాశారు: ఈ పుస్తకం పేరు సూప్స్ అండ్ సూప్ మేకింగ్ .

ఒక చిక్కని, తారువంటి రసం వచ్చే వరకు మాంసాన్ని ఉడికించి, ఆపై దానిని చల్లబరిచి నెలల తరబడి నిలవ చేసే విధంగా, పోర్టబుల్ సూప్‌ను (తేలిగ్గా తయారు చేయగల చారు) 18వ శతాబ్దంలో కనిపెట్టారు. సాంద్రీకృతమైన చారు ముద్దకు ఒక ఉదాహరణగా జపాన్ వాసులు ఉపయోగించే మిసోను చెప్పవచ్చు.

వ్యాపార చారు ఉత్పత్తులు[మార్చు]

దస్త్రం:Packets of Soup.jpg
సూప్ యొక్క పాకెట్స్

19వ శతాబ్దంలో క్యానింగ్ (డబ్బాల్లో భద్రపరిచే పద్ధతి) కనిపెట్టడంతో వ్యాపార ప్రాతిపదికన చారు తయారు చేయడం ప్రసిద్ధి చెందింది, ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల చారు డబ్బాల్లో మరియు పొడి రూపంలో దొరుకుతుంది.

డబ్బాల్లో విక్రయించే చారు[మార్చు]

క్యాంబెల్ సూప్ కంపెనీ ఒక రసాయన శాస్త్రవేత్తగా పనిచేసిన డాక్టర్ జాన్ టి. డోరెన్స్ 1897లో సాంద్రీకృత చారును (కండెన్స్‌డ్ సూప్) కనిపెట్టారు.[3] ప్రస్తుతం క్యాంబెల్ టమోటో, క్రీమ్ ఆఫ్ మష్రూమ్ మరియు చికెన్ న్యూడిల్ సూప్ అమెరికాలో అత్యంత ప్రసిద్ధ చారు రకాల్లో భాగంగా ఉన్నాయి. ఒక్క అమెరికన్‌‍లు మాత్రమే ప్రతి ఏడాది 2.5 బిలియన్ గిన్నెల చారును సేవిస్తున్నారు, ఈ గణాంకాలు పైన పేర్కొన్న మూడు చారు రకాలను మాత్రమే సూచిస్తున్నాయి.[3] మైన్‌స్ట్రోన్ లేదా ఇటాలియన్ వెడ్డింగ్ వంటి డబ్బాల్లో విక్రయించే ఇటాలియన్-శైలి చారు కూడా బాగా ప్రసిద్ధి చెందింది, ప్రోగ్రెస్సో మరియు సెంటో పైన్ ఫుడ్స్ తదితర కంపెనీలు వీటిని విక్రయిస్తున్నాయి.

డబ్బాల్లో ఉండే చారు సాంద్రీకృతం చేయబడి ఉండవచ్చు, ఇటువంటి సందర్భంలో చారును నీళ్లు జోడించడం ద్వారా (లేదా కొన్నిసార్లు పాలు కలపడం ద్వారా) చేస్తారు లేదా ఇవి వెంటనే తినే వీలున్న డబ్బాలుగా కూడా విక్రయించవచ్చు, అంటే వీటిని తినేందుకు ఎటువంటి ద్రవ పదార్థాన్ని చేర్చాల్సిన అవసరం లేదు. డబ్బాల్లో ఉండే చారును (సాంద్రీకృతం చేసివున్నది లేదా వెంటనే తినే వీలున్న చారు) పొయ్యి లేదా మైక్రోవేవ్‌పై ఒక పెనంతో వేడి చేయడం ద్వారా తయారు చేయవచ్చు. ఇటువంటి చారును ఇంటిలో తయారు చేసే చారుకు ఆధారంగా ఉపయోగించవచ్చు, వినియోగదారు వీటికి కొద్ది మొత్తంలో కూరగాయల నుంచి గ్రుడ్లు, కూరగాయలు, క్రీము లేదా పాస్తా వరకు ఏదైనా జోడించవచ్చు.

సాంద్రీకృతం చేయబడిన చారు దానిని చిన్న డబ్బాలో ప్యాక్ చేసేందుకు వీలు కల్పిస్తుంది, అంతేకాకుండా డబ్బాల్లో నిల్వ చేసి విక్రయించే ఇతర చారు కంటే తక్కువ ధరకు దీనిని విక్రయించవచ్చు. నీరు లేదా పాలు (సుమారుగా 10 ఔన్స్‌లు) జోడించడం ద్వారా చారు రెట్టింపు పరిమాణంలో తయారవుతుంది.

1990వ దశకం నుంచి చారును వెంటనే తినదగిన పదార్థంగా విక్రయిస్తుండటంతో డబ్బా చారుకు బాగా ఆదరణ పెరిగింది, ఇటువంటి చారుకు ఎటువంటి అదనపు ద్రవాన్ని జోడించాల్సిన అవసరం లేదు. మైక్రోవేవ్‌లలో ఉంచదగిన గిన్నెలు వెంటనే తినదగిన డబ్బా చారు మార్కెట్‌ను మరింత విస్తరించాయి, వీటి ద్వారా వెసులుబాటు (ముఖ్యంగా పని ప్రదేశాల్లో) పెరిగింది, దీంతో మధ్యాహ్న భోజన సమయంలో వీటిని తీసుకునే అలవాటు కూడా పెరిగింది.

చారు పొడి[మార్చు]

రామెన్ న్యూడిల్స్ ఉండే ఆసియా-శైలి చారు మిశ్రమాలను పశ్చిమ మరియు ఆసియా కంపెనీలు విక్రయిస్తున్నాయి, ఇది తక్కువ ఖర్చుతో కూడిన తక్షణ ఆహారంగా వాడుకలోకి వచ్చింది, దీనిని తయారు చేసేందుకు కేవలం వేడి నీరు సరిపోతుంది.[4]

పాశ్చాత్య శైలి వంటకాల్లో, కూరగాయలు, కోడి మాంసం, బంగాళాదుంప, పాస్తా మరియు జున్ను చారు రకాలు పొడి రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి, వీటికి వేడి నీళ్లు జోడించి వెంటనే వడ్డించవచ్చు, కొన్నిసార్లు మాంసం లేదా కూరగాయలు వంటివాటిని కూడా జోడించే వీలుంటుంది.

పోషక సంబంధ పరిణామాలు[మార్చు]

 • ఉప్పు - అధిక మోతాదులో ఉప్పును తీసుకోవడం ద్వారా వచ్చే అనారోగ్యాలకు స్పందనగా, కొందరు చారు తయారీదారులు ప్రసిద్ధ చారు రకాల్లో ఉప్పు మోతాదు తక్కువగా ఉండేలా చూస్తున్నారు.[5]
 • ట్రాన్స్ ఫ్యాట్ - హృద్రోగానికి సంబంధించిన ఆందోళనలకు స్పందనగా, కొందరు చారు తయారీదారులు తాము తయారు చేసే చారు ఉత్పత్తుల్లో ట్రాన్స్ ఫ్యాట్ లేకుండా చూస్తున్నారు.[ఉల్లేఖన అవసరం]

చారు రకాలు[మార్చు]

తీపి చారు[మార్చు]

ఎర్ర చిక్కుడు పులుసు దేజ్జర్ట్
 • కొబ్బరి పాలు, పాలు, పళ్లు మరియు టాపియోకా పెరల్స్ తదితరాలతో తయారు చేసే జినాటాన్ అనే ఫిలిప్స్ చారును వేడిగా లేదా చల్లగా వడ్డిస్తారు.
 • ఓషిరుకో, ఇది జపనీయుల ఆజుకీ బీన్ సూప్
 • టోంగ్ సుయ్, చైనా తీపి చారులకు సూచించేందుకు ఒక ఉమ్మడి పేరు

పళ్ల చారు[మార్చు]

వంటకం ఆధారంగా పళ్ల చారును వెచ్చగా లేదా చల్లగా వడ్డిస్తారు. వెచ్చని వాతావరణం ఉండే సమయంలో ఎక్కువ భాగం వంటకాలు చల్లగానే వడ్డించడం జరుగుతుంది. నార్వేకు చెందిన ఫ్రుక్‌‍సూప్ వంటివాటిని వెచ్చగా వడ్డిస్తారు, వీటిని రైసిన్‌లు మరియు ప్రూనే వంటి ఎండబెట్టిన పళ్లతో తయారు చేస్తారు, వీటిని ఏ కాలంలోనైనా ఉపయోగించవచ్చు. పళ్ల చారులో పాలు లేదా క్రీము, తీపి పదార్థం లేదా సావోరీ డంప్లింగ్స్, మసాలా దినుసులు లేదా బ్రాంది లేదా షాంపేన్ వంటి మధ్య పానీయాలు చేర్చవచ్చు. చెర్రీ చారును టేబుల్ వైన్ మరియు/లేదా పోర్ట్‌తో తయారు చేస్తారు. పండి పదార్థం, ముఖ్యంగా బంగాళాదుంప పిండిని పళ్ల చారును చిక్కగా చేసేందుకు, కిసెల్ తయారు చేసేందుకు ఉపయోగిస్తారు.

చల్లని లేదా వెచ్చని పళ్ల చారులను స్కాండినేవియా, బాల్టిక్ మరియు తూర్పు ఐరోపా వంటకాల్లో సాధారణంగా ఉపయోగించడం జరుగుతుంది, ఇదిలా ఉంటే మాంసంతో ఉండే వెచ్చని పండ్ల చారు మధ్యప్రాచ్య, మధ్య ఆసియా మరియు చైనా వంటకాల్లో కనిపిస్తుంది. చల్లని పళ్ల చారులో క్రెంట్‌జెబ్రిజ్ భాగంగా ఉంది.

అమెరికా, ఆఫ్రికా మరియు పశ్చిమ ఐరోపా వంటకాల్లో పళ్ల చారు ఎక్కువగా కనిపించదు, ఎక్కువ ప్రదేశాల్లో అసలు ఉపయోగించరు. జపాన్, ఆగ్నేయాసియా లేదా ఓషియానియా ప్రాంతాల్లో కూడా ఇవి కనిపించవు. చల్లని పళ్ల చారును మిఠాయికి బదులుగా రుచిని పెంచేందుకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు:

 • వింటర్ మిలన్ సూప్ అనేది ఒక చైనీయుల చారు, సాధారణంగా దీనిలో కోడి మాంసం ఉంటుంది. అయితే ఇది ఒక రుచిని పెంచే చారు, దీనిలో తరచుగా ఇతర కూరగాయలు మరియు పుట్టగొడుగులు కలుపుతారు. సాంకేతికంగా, వింటర్ మెలన్ అనేది విత్తనాలతో ఉండటం వలన ఒక పండుగా పరిగణించబడుతుంది, అయితే దీనిని ఒక కూరగాయగా ఉపయోగించడం జరుగుతుంది. వింటర్ మిలన్ సూప్‌‍ను తరచుగా పూర్తిగా వింటర్ మిలన్‌తోనే తయారు చేస్తారు, మాంసం, కూరగాయలను దానిలోపల ఉంచి గంటలపాటు ఉడికిస్తారు. తోలును అందంగా కోసి మధ్యలో ఆకర్షణీయంగా ఉంచుతారు, చారుతో నిండిన ఇది మెడిసిన్ బంతి కంటే చిన్నదిగా, సాకర్ బంతి కంటే పెద్దదిగా ఉంటుంది. కాయలోని కండ భాగాన్ని చారుతోపాటు తింటారు.

చల్లని చారు[మార్చు]

సాంప్రదాయిక చారుకు చల్లని చారు భిన్నంగా ఉంటుంది, వడ్డించే సమయంలో చారు ఉష్ణోగ్రత గది ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉంటుంది. ఇది తియ్యగా లేదా రుచికరంగా ఉండవచ్చు. వేసవిలో, తియ్యని చల్లని చారు డిజర్ట్ ట్రేలో భాగంగా ఉంటుంది. ఒక రుచికరమైన చల్లని చారుకు ఉదాహరణ గాజ్పాచో, స్పెయిన్‌‌కు చెందిన ఒక చల్లని కూరగాయ చారు ఇది. నెంగుక్ అనేది కొరియాకు చెందిన చల్లని చారు, వేసవిలో దీనికి బాగా ఆదరణ ఉంటుంది.

ఆసియా చారు[మార్చు]

థైలాండ్ బ్యాంకాక్ లో వడ్డించిన యధార్థమైన టాం యం.
బుకిట్ బాటక్ లో అమ్మబడిన చైనీస్ ఫిష్ బాల్ పులుసు, సింగపూర్

తూర్పు ఆసియా చారు రకాల్లో కనిపించే ఒక లక్షణాన్ని సాధారణంగా పాశ్చాత్య వంటకాల్లో గుర్తించలేము, అదేమిటంటే ఈ ప్రాంతంలో తయారు చేసే చారులో టోఫు ఉపయోగిస్తారు. అనేక రకాల సాంప్రదాయిక తూర్పు ఆసియా చారులో ఎక్కువగా రసాలు, పలచని చారు లేదా పిండితో చిక్కగా చేసిన చారు కనిపిస్తాయి.

సాంప్రదాయిక ప్రాంతీయ చారు రకాలు[మార్చు]

 • అజాకో, ఇది ఒక కోడి మాంసపు చారు, కొలంబియాలో దీనిని తయారు చేస్తారు.
 • ఎవగోలెమోనో, ఇది ఒక గ్రీకు కోడి మాంసపు చారు, దీనిలో నిమ్మకాయలు మరియు గ్రుడ్లు ఉపయోగిస్తారు.
 • బజాజౌ, స్లొవేకియన్ మూలాలు ఉన్న ఒక చారు, పశువుల ఉడికించిన పేగులు, కోడి గ్రుడ్లు, ఉల్లిపాయలు మరియు బియ్యంతో దీనిని తయారు చేస్తారు.
 • బర్డ్స్ నెస్ట్ సూప్, ఇది చైనీయుల వంటలో ఒక రుచికరమైన పదార్థం.
 • బిస్క్యూ, ఇది ఒక చిక్కని, క్రీము మాదిరిగా ఉండే చారు, దీనికి ఫ్రెంచ్ మూలాలు ఉన్నాయి.
 • బోర్షుట్, ఇది ఉక్రెయిన్ మరియు రష్యా మూలాలు ఉన్న ఒక దుంప-కూరగాయ చారు.
 • బౌయిల్లాబైసీ, ఒక చేప పులుసు, మార్సెల్లేకు చెందినది, ఇతర మధ్యధరా ప్రాంతాల్లో కూడా దీనిని తయారు చేస్తారు; కాంటాలోనియాలో దీనిని బుల్లెబెసా అని పిలుస్తారు.
 • బౌరో-బౌరో, ఇది ఒక కూరగాయ మరియు పాస్తా చారు, ఇది గ్రీసులోని కోర్ఫు ద్వీపానికి చెందినది.
 • కాల్డో వెర్డే, ఇది పోర్చుగీసు కాలే సూప్
 • కల్లాలో అనేది చిక్కగా ఉండే, క్రీముమాదిరిగా ఉండే చారు, ఓక్రా మరియు తరచుగా పీత మాంసంతో తయారు చేస్తారు, ట్రినిడాడ్ మరియు టొబాగో ప్రాంతంలో దీనిని చేస్తారు.
 • కాన్ చువా (సోర్ సూప్), అనేది బియ్యం, చేపలు, వివిధ కూరగాయలతో తయారు చేసే చారు, కొన్ని సందర్భాల్లో పైనాపిల్‌లు కూడా ఉపయోగిస్తారు, వియత్నాంలో దీనిని చేస్తారు.
 • కాంజా డి గాలిన్హా, ఇది పోర్చుగీసు చారు, కోడి మాంసం, బియ్యం, నిమ్మకాయలు ఉపయోగిస్తారు.
 • కాజెలా, ఇది చిలీ చారు, ఒక మోస్తారుగా చిక్కగా ఉంటుంది, వివిధ మాంసాహారాలు వండగా మిగిలిన పదార్థాలు, కూరగాయలను కలిపి దీనిని తయారు చేస్తారు.
స్విస్స్ పులుసు
 • కామ్ చౌడర్ అనేది రెండు ప్రధాన రకాలుగా కనిపిస్తుంది, న్యూ ఇంగ్లాండ్ కామ్ చౌడర్, దీనిని బంగాళాదుంపలు మరియు క్రీముతో తయారు చేస్తారు, రెండోది మాన్‌హట్టన్ కామ్ చౌడర్, ఇది టమేటోతో తయారవుతుంది.
 • కోక్-ఎ-లీకీ చారు అనేది లీక్ మరియు బంగాళాదుంప చారు, దీనిని కోడిమాంసంతో తయారు చేస్తారు, స్కాట్లాండ్ దీనికి ప్రసిద్ధి.
 • కులెన్ స్కింక్, ఇది కూడా స్కాట్లాండ్‌కు చెందిన ఒక చేప పులుసు, పొగ పట్టించిన హాడాక్, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు మరియు క్రీముతో దీనిని తయారు చేస్తారు.
 • ఎగ్ డ్రాప్ సూప్, ఒక రుచికరమైన చైనీయుల చారు, మరిగించిన నీరు లేదా రసంలో ఉడికించిన గ్రుడ్లు వేసి దీనిని తయారు చేస్తారు.
 • ఎగుసి సూప్,నైజీరియాకు చెందిన ఒక సాంప్రదాయిక చారు, కూరగాయలు, మాంసం, చేపలు మరియు పండ్ల విత్తనాలతో దీనిని తయారు చేస్తారు. తరచుగా ఫుఫుతో దీనిని తింటారు.
 • ఎట్రోగ్, ఇది ఒక పళ్ల చారు, సిట్రాన్‌తో తయారు చేస్తారు, యూదు సాంప్రదాయిక పండుగ సుక్కోత్ సందర్భంగా దీనిని ఉపయోగిస్తారు, టు బిష్వాత్ వద్దద ఆష్కెనాజీ యూదులు దీనిని తింటారు.
 • ఫాకీ సూపా అనేది ఒక గ్రీకు లెంటిల్ సూప్, క్యారెట్‌లు, ఆలీవ్ నూనె, మూలికలు మరియు టమేటో సాస్ లేదా వెనిగార్‌లతో దీనిని తయారు చేస్తారు.
 • ఫానెస్కా అనేది ఒక సాంప్రదాయిక కోడ్ సూప్, దీనిని ఈక్వడార్‌లో చేస్తారు.
 • ఫాసోలడా, అనేది ఒక గ్రీకు బీన్ సూప్.
 • ఫ్రెంచ్ ఆనియన్ సూప్, పశు మాంసం మరియు ఉల్లిపాయలతో దీనిని చేస్తారు. ఇది బాగా పలచగా ఉంటుంది.
 • గాజ్పాచో (స్పెయిన్ మరియు పోర్చుగల్ మూలాలు ఉన్నాయి) అనేది ఒక రుచికరమైన చారు, టమేటోతో చేస్తారు.
 • గౌలాష్ అనేది హంగేరియన్ చారు, పశు మాంసం, పాప్రికా మరియు ఉల్లిపాయలతో దీనిని తయారు చేస్తారు.
 • గుంబో, ఒక సాంప్రదాయిక క్రియోల్ చారు, దక్షిణ యునైటెడ్ స్టేట్స్, ఓక్రా పాడ్‌లు, రౌక్స్ మరియు కొన్నిసార్లు పైల్ పౌడర్ తదితరాలతో తయారు చేస్తారు.
శాకాహార బీఫ్ బార్లే పులుసు
 • హలాస్‌జ్లీ (మత్స్యకారుల చారు), ఇది వెచ్చని మరియు మసాలాలు దట్టించిన హంగేరియా నది చేపల చారు, దీనిని కారపు మిరపకాయలతో చేస్తారు.
 • ఐస్లెస్క్ జోట్సుపా అనేది ఒక సాంప్రదాయిక ఐస్‌ల్యాండ్ మాంసపు చారు, గొర్రె మాంసం మరియు కూరగాయలతో దీనిని చేస్తారు.
 • ఖార్చో అనేది గొర్రె, బియ్యం, కూరగాయలు మరియు బాగా కారం దట్టించిన బౌలియన్‌లతో తయారు చేసే ఒకరకమైన జార్జియా చారు.
 • లాగ్‌మ్యాన్, ఇది ఉజ్బెకిస్థాన్ సాంప్రదాయిక చారు, పాస్తా, కూరగాయలు, గొర్రెపిల్ల మాంసం మరియు అనేక మసాలాలతో దీనిని చేస్తారు.
 • లాన్ సికిక్ అనేది ఒక థాయ్‌ల్యాండ్ చారు, న్యూడిల్స్, ఎండబెట్టిన చేపలు మరియు టమేటో రసాలతో దీనిని చేస్తారు.
 • లీక్ సూప్, లీక్‌ల నుంచి దీనిని సులభంగా తయారు చేస్తారు, సెయింట్ డేవిడ్స్ డే సందర్భంగా వేల్స్‌లో ఎక్కువగా దీనిని ఉపయోగిస్తారు.
 • లెంటిల్ సూప్, మధ్యప్రాచ్య మరియు మధ్యధరా వంటకాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.
 • లండన్‌కు ప్రత్యేకించబడిన చిక్కని చారును ఇంగ్లాండ్‌లో దొరికే బఠానీలు మరియు పంది పిల్లల మాంసంతో తయారు చేస్తారు; 19వ శతాబ్దంలో లండన్‌లోని బలమైన పందుల పేరు మీదగా దీనికి నామకరణం చేశారు.
 • మేరీల్యాండ్ పీత చారు, దీనిని కూరగాయలు, నీలి పీతలు మాంసం మరియు ఓల్డ్ బే సీజనింగ్ తదితరాలతో చేస్తారు, టమేటో రసాలను కూడా దీనిని ఉపయోగిస్తారు, మేరీల్యాండ్ ఈ చారుకు ప్రసిద్ధి.
 • మెనుడో, ఇది ఒక సాంప్రదాయిక మెక్సికన్ చారు, ట్రిప్ (సాధారణంగా బీఫ్) మరియు హోమినీలతో తయారు చేస్తారు.
 • మిచిగాన్ బీన్ సూప్, ఇది US సెనెట్ వంటల్లో వందేళ్లకు బాగా భాగంగా ఉంది.[6]
 • మైన్‌స్ట్రోన్ అనేది ఒక ఇటాలియన్ కూరగాయల చారు.
 • మిసో సూప్, చేప రసం మరియు సోయ్‌లతో తయారు చేసే జపాన్ చారు ఇది.
 • ముల్లిగేట్వానీ, ఇది ఒక ఆంగ్లో-ఇండియన్ కూర చారు.
 • నస్సెల్‌సోపా (నెటిల్ సోప్), ఉడికించిన గ్రుడ్డుతో సాంప్రదాయికంగా సేవించే చారు ఇది, స్వీడన్‌లో దీనిని ప్రత్యేకమైన వంటగా పరిగణిస్తారు.
 • ఎన్‌కాటెంక్వాన్, ఘనాకు చెందిన ఒక ఘాటైన చారు ఇది, మాంసం, వేరుశెనగలతో, ఎక్కువగా కోడి మాంసం, కూరగాయలతో దీనిని తయారు చేస్తారు. సాధారణంగా దీనిని ఫుఫుతో తింటారు.
 • న్యూడిల్ సూప్, వివిధ సరంజామాతో తయారు చేసే భిన్నమైన చారు ఇది, దీనిని ఎక్కువగా న్యూడిల్స్‌తోనే చేస్తారు.
 • పాస్తాస్, దీనిని గ్రీసులో తయారు చేస్తారు.
టొర్టల తరహ పద్ధతిలో చిక్కని పీ పులుసు
 • ఫిలడెల్ఫియా పెప్పర్ పాట్ చారు, ఇది ఫిలడెల్ఫియాకు ప్రత్యేక వంటకం, సాంప్రదాయికంగా దీనిని ట్రిప్‌తో తయారు చేస్తారు.[7]
 • ఫో, ఇది వియత్నాంకు చెందిన పశుమాంసం/కోడిమాంసం చారు, స్కాలియన్‌లు, వెల్ష్ ఆనియన్, చెర్‌డ్ జింజర్, ఎరిన్‌గియుం ఫోయెటిడుం, బాసిల్, సిన్నమోన్, స్టార్ ఎనైస్, క్లోవ్ మరియు బ్లాక్ కార్డమోమ్ తదితరాలతో తయారు చేస్తారు.
 • సారోసూపా, ఇది ఒక గ్రీకు చేప చారు, వివిధ రకాల చేపలతో ఈ చారు తయారు చేస్తారు.
 • రెవిథియా, ఇది ఒక గ్రీకు చిక్పా చారు.
 • సాంకోచో, ఇది కూరగాయలతో చేసే కోడిమాంసపు చారు, ఇది లాటిన్ అమెరికాకు చెందిన చారు.
 • స్కాచ్ బ్రోత్, గొర్రె మాంసం లేదా గొర్రెపిల్ల మాంసంతో దీనిని చేస్తారు, బార్లీ మరియు దుంప కూరగాయలు కూడా దీనిలో ఉపయోగిస్తారు.
 • షచావ్, పోలిష్, రష్యన్ మరియు యిడ్డిష్ వంటల్లో కనిపించే సోరెల్ చారు.
 • షి-క్రాబ్ సూప్, దక్షిణ కరోలినాలోని ఛార్ల్‌స్టోన్‌కు చెందినది, నీలి పీతలు మరియు పీత గ్రుడ్లతో దీనిని తయారు చేస్తారు.
 • సినిగాంగ్, ఫిలిప్పీన్స్‌లో దీనిని చేస్తారు, ఇది బాగా పలచని పుల్లని చారు, మాంసం, చేపలు లేదా కూరగాయలు, చింతపండుతో తయారు చేస్తారు.
 • స్నెర్ట్ (ఎర్వ్‌టెన్‌సోప్ ) అనేది బఠానీ చారు, ఇది ఒక శీతాకాలపు వంటకం, నెదర్లాండ్స్‌లో దీనిని చేస్తారు, సాంప్రదాయికంగా సాసేజ్‌తో చేస్తారు.
 • సోల్యంకా అనేది మరో క్యాబేజ్ చారు, రష్యాలో దీనిని తయారు చేస్తారు.
 • సోపా డి పెడ్రా, ఇది ఒక సంపన్న సాంప్రదాయిక పోర్చుగీసు చారు, దీనిలో అనేక పదార్థాలు ఉపయోగిస్తారు.
 • సోటో, ఇది సాంప్రదాయిక ఇండోనేషియా చారు, పసువు, గాలాంగల్ తదితరాలతో తయారు చేస్తారు, సాధారణంగా పశుమాంసం లేదా కోడిమాంసంతో తయారు చేస్తారు.
 • స్ప్లిట్ పీస్ సూప్, ఇది కరేబియన్ ప్రాంతంలో చేసే చిక్కని చారు, ఎక్కువగా కూరగాయలు మరియు ఒకరకమైన మాంసంతో తయారు చేస్తారు.
 • టారాటోర్ అనేది ఒక బల్గేరియన్ కోల్డ్ సూప్, దీనిని యోగుర్ట్ మరియు కుకుంబర్ తదితరాలతో తయారు చేస్తారు.
 • టమోటో చారు, ఇది అనేక రకాలుగా దొరుకుతుంది, అన్నింటిలోనూ టమేటాను ప్రధానంగా ఉపయోగిస్తారు.
 • టోమ్ యుమ్ అనేది వెచ్చని మరియు పుల్లని చారలు రెంటింటినీ సూచిస్తుంది, లావోస్ మరియు థాయ్‌ల్యాండ్ దేశాల్లో మూలికలతో దీనిని తయారు చేస్తారు.
 • టర్హానా చారు, ఇది టర్కీ వంటకం, దాల్చిన ధాన్యం మరియు యోగుర్ట్‌లతో తయారు చేస్తారు.
 • విచిసోయిస్, ఇది ఫ్రెంచ్-శైలి చారు, ఒక ఫ్రెంచ్ చెఫ్ న్యూయార్క్‌లోని రిట్జ్ హోటల్‌లో దీనిని కనిపెట్టారు, చల్లని ఉడికించిన బంగాళాదుంపలు, లీక్‌లు మరియు క్రీముతో తయారు చేస్తారు.
 • వాటర్‌జోయి అనేది బెల్జియంకు చెందిన fish soup.
 • యుగెజాంగ్, దీనిని కొరియాలో చేస్తారు, కారం దట్టించిన పశుమాంసపు చారు ఇది, దీనిలో కూరగాయలు కూడా కలుపుతారు.
 • జురెక్, ఇది పోలిష్ సోర్ రై సూప్, దీనిని సాసేజ్‌లతో తయారు చేస్తారు, రొట్టెతో చేసిన గిన్నెలో దీనిని వడ్డిస్తారు.

ప్రసంగంలో చారు ఉపయోగం[మార్చు]

కార్రోట్, ఉల్లిపాయ మరియు సెల్రి. కలిగిన మిర్పొయిక్ష్, ఎకువుగా పులుసు స్టాక్ లలో మరియు పులుసులలో వాడబడుదురు

ఆంగ్ల భాషలో, సూప్ అనే పదంతో అనేక పదబంధాలు ఏర్పడ్డాయి.

 • ఆల్ఫాబేట్ సూప్ అనే పదం పాలనా యంత్రాంగం ద్వారా అనేక పొడి పేర్లకు ఉపయోగించబడుతుంది, అక్షరమాల యొక్క అక్షరాల ఆకారాల్లో మలిచే పాస్తాను కలిగివుండే సాధారణ టమేటో చారులో దీని మూలాలు ఉన్నాయి.
 • ప్రిమోర్డియల్ సోప్ అనే పదాన్ని జీవ పరిణామానికి దారితీసే కర్బన మిశ్రమాన్ని వర్ణించేందుకు ఉపయోగిస్తారు.
 • ఇళ్లు లేనివారికి ఇవ్వడానికి తయారు చేసే అన్ని రకాల ఆహారాన్ని సూప్ కిచన్ (గంజి) అని పిలుస్తారు.
 • పీ సూప్ అనేది దట్టమైన లేదా సాంద్రమైన పొగమంచును వర్ణిస్తుంది.
 • సూప్ లెగ్స్, అలసట లేదా ఆయాసాన్ని వర్ణించేందుకు అథ్లెట్లు ఉపయోగించే ఒక అనధికారిక పదం ఇది.
 • "స్టోన్ సూప్" అనేది ఒక ప్రసిద్ధ బాలల ప్యాబుల్.
 • డక్ సూప్, సులభంగా చేసే వీలున్న పనిని వర్ణించేందుకు దీనిని ఉపయోగిస్తారు.
 • వర్డ్ సూప్, రాజీపడలేని సందర్భాన్ని సూచించే పద సమాహారాన్ని సూచించేందుకు దీనిని ఉపయోగిస్తారు.
 • ట్యాగ్ సూప్ అనేది పేలవంగా కోడ్ చేసిన HTMLను సూచించేందుకు ఉపయోగిస్తారు.
 • సూప్ ఫైర్

! ఆశ్చర్యానికి వ్యక్తీకరణగా దీనిని ఉపయోగిస్తారు.

 • Soupe du jour ఇది సూప్ ఆఫ్ ది డేకు ఉపయోగించే ఫ్రెంచ్ పదం. ప్రస్తుత ఫ్యాషన్‌ను సూచించేందుకు కూడా దీనిని ఉపయోగిస్తారు.
 • సూప్ టు నట్స్, అమెరికన్ ఆంగ్ల జాతీయం, మొదటి నుంచి చివరకు అనే అర్థాన్ని ఇది తెలియజేస్తుంది (చూడండి: పూర్తిస్థాయి డిన్నర్).
 • "సూప్ ఆన్

!" లేదా "సూప్స్ అప్" డిన్నర్ సిద్ధమైందని చెప్పడానికి ఉపయోగించే పదబంధం ఇది.

 • సూప్ శాండ్‌విచ్ ఇది US మిలిటరీలో ఉపయోగించే ఊతపదం, ఎక్కువగా పేలవమైన పని లేదా మసక చూపును సూచించేందుకు దీనిని ఉపయోగిస్తారు. శాండ్‌విచ్‌ను సూప్ నుంచి తయారు చేసే చారు జావగా ఉంటుందనే అంశం నుంచి ఈ పదం వచ్చింది.
 • సూప్ సమ్‌థింగ్ అప్ , అనేది శక్తిని పెంచే సందర్భాన్ని సూచిస్తుంది (తరచుగా కార్లు, విమానాలు వంటి వాహనాలకు దీనిని ఉపయోగిస్తారు).

ప్రసిద్ధ సంస్కృతిలో[మార్చు]

 • ది సూప్ నాజీ అనేది సీన్‌ఫెల్డ్‌ లోని ఒక కాల్పనిక పాత్ర, ఆయన అద్భుతమైన చారు తయారు చేస్తారు, అయితే దీనికి కఠినమైన నియమాలను పాటిస్తారు.[8]
 • ది ఎక్సార్సిస్ట్ అనే భయానక చిత్రంలో రీగాన్ మ్యాక్‌నీల్ ప్రభావానికి గురైనప్పుడు బఠానీ చారును వాంతి చేసుకుంటాడు.[9]
 • డక్ సూప్ , మార్క్స్ బ్రదర్స్ సృష్టించిన ఒక కామెడీ చిత్రం పేరు ఇది.[10]

వీటిని కూడా చూడండి[మార్చు]

 • పులుసుల యొక్క జాబితా

గమనికలు[మార్చు]

రోమానియన్ ఆలు పులుసు.
 1. Goltz, Eileen (2008-11-09). "Soup vs. stew: Difference in details". The Journal Gazette (Fort Wayne, Indiana). Retrieved 2010-03-06. Cite web requires |website= (help)
 2. రస్టెల్లి, రాబర్ట్. (జనవరి 12, 2005) ది స్టార్-లెడ్జర్. సూప్ 101 ఫస్ట్, టెక్ ఆన్ ఆనియన్, అండ్ దెన్ మేక్ సంథింగ్ దట్ విల్ వార్మ్ ద సోల్. సెక్షన్: సేవ్యర్; పేజి 33.
 3. 3.0 3.1 "కాంప్బెల్స్: అవర్ కంపెనీ, హిస్టరీ". మూలం నుండి 2008-03-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-05-28. Cite web requires |website= (help)
 4. "నిస్సిన్ ఆహారం గురించి". మూలం నుండి 2007-10-24 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-05-28. Cite web requires |website= (help)
 5. హుర్లే, J. మరియు లీబ్మన్, B. సూప్స్: ది మిద్దిల్ గ్రౌండ్. న్యుట్రిషన్ ఆక్షన్ డిసెంబర్ 1997.
 6. మిచిగాన్ బీన్ సూప్ రెసిపి అండ్ హిస్టరీ Archived 2009-04-02 at the Wayback Machine., ది హానరబుల్ అండ్ Mrs. జాన్ D. రోకేఫెల్లెర్ IV, U.S. సెనేటర్.
 7. APPLE Jr, R. W. (2003-05-28). "A TASTE OF PHILADELPHIA; In Hoagieland, They Accept No Substitutes". The New York Times. Retrieved 2010-05-23.
 8. [130] ^ http :www.imdb.com/title/tt0092730/
 9. http://www.imdb.com/title/tt0070047/trivia
 10. [130] ^ http://www.imdb.com/title/tt0092730/

సూచనలు[మార్చు]

 • ఫెర్నాండేజ్ -ఆర్మేస్టో, ఫెలిపి. నియర్ ఎ తౌసండ్ టేబుల్స్: ఎ హిస్టరీ అఫ్ ఫుడ్ (2002). న్యూ యార్క్: ఫ్రీ ప్రెస్ ISBN 0-7432-2644-5
 • లరౌస్సే గాస్ట్రోనోమిక్ , జేన్నిఫెర్ హార్వే లాంగ్, ed. అమెరికన్ ఎడిషన్ (1988). న్యూ యార్క్: క్రౌన్ పబ్లిషేర్స్ ISBN 0-609-60971-8
 • మోర్టన్, మార్క్ కప్ బోర్డు లవ్: ఎ డిక్ష్ణరి అఫ్ కల్నరి క్యురియోసిటీస్ (2004). టోరోన్టొ : ఇంసోంనియక్ ప్రెస్ ISBN 1-894663-66-7
 • ది మైటి బూష్. సూప్, సూప్, ఎ టేస్టి సూప్, సూప్ (2005).

బాహ్య లింకులు[మార్చు]

మూస:Cuisine