చార్లెస్ లూసిన్ బొనపార్టే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Charles Lucien Bonaparte
Charles Lucien Bonaparte
జననంMay 24, 1803
మరణంJuly 29, 1857
జాతీయతFrench
రంగములుnaturalist

కానినో మరియు మ్యూసిజ్ఞానో (మే 24, 1803 – జూలై 29, 1857) యొక్క 2వ రాజకుమారుడైన చార్లెస్ లూసిన్ (కార్లో) జూల్స్ లారెంట్ బొనపార్టే ఒక పక్షి శాస్త్రవేత్త మరియు ప్రకృతిని ఆరాధించే ఫ్రెంచ్ దేశస్థుడు.

జీవితచరిత్ర[మార్చు]

బొనపార్టే, లూసిన్ బొనపార్టే మరియు అలేసాన్డ్రినే డి బ్లెస్చాంప్ వారి కుమారుడు మరియు నెపోలియన్ చక్రవర్తి యొక్క మేనల్లుడు. అతను ఇటలీలో పెరిగాడు. జూన్ 29, 1822, నాడు బ్రుస్సేల్స్లో, అతను తన కజిన్ అయిన జేనైడాను వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత, జేనైడా యొక్క తండ్రి అయిన, జోసెఫ్ బొనపార్టేతో నివసించడానికి వారు ఫిలడెల్ఫియాకు వెళ్ళిపోయారు.[1] ఇటలీని వదిలివెళ్ళే ముందు అతను అప్పట్లో విజ్ఞాన శాస్త్రానికి కొత్త అయిన ముస్టాచ్డ్ వార్బ్లెర్ అనే ఒక పాడే పక్షి (వార్బ్లెర్)ని కనుక్కున్నాడు . ప్రయాణ మార్గములో, అతను ఒక కొత్త స్టార్మ్-పెట్రెల్ యొక్క నమూనాలను సేకరించాడు. యునైటెడ్ స్టేట్స్ కు చేరగానే, అతను ఈ క్రొత్త పక్షి గురించి ఒక అధ్యయనాన్ని ప్రదర్శించాడు. ఈ పక్షికి తరువాత అలేక్సాన్డర్ విల్సన్ అని పేరు పెట్టబడింది.

తరువాత బొనపార్టే యునైటెడ్ స్టేట్స్[1] లో పక్షి శాస్త్రం చదవడం మొదలుపెట్టాడు. విల్సన్ యొక్క అమెరికన్ ఆర్నిథాలజీ ని అప్డేట్ చేసి సవరించిన ప్రచురణ 1825 - 1833 మధ్య ప్రచురించబడింది. 1824 లో బొనపార్టే అప్పట్లో ఎవరికీ తెలియని జాన్ జేమ్స్ ఆడుబోన్ను అకాడమి అఫ్ నేచురల్ సైన్సస్లో చేర్చాలని ప్రయత్నించాడు కాని దీనిని జార్జ్ ఓర్ద్ అనే పక్షి శాస్త్రవేత్త వ్యతిరేకించాడు.

1826 చివరలో, బొనపార్టే, కుటుంబంతో సహా ఐరోపాకు తిరిగి వచ్చేశాడు. అతను జర్మనీకి వెళ్ళినప్పుడు, అక్కడ ఫిలిప్ జాకోబ్ క్రేట్జ్ ష్మార్ , మరియు ఇంగ్లాండ్కు వెళ్ళినప్పుడు, అక్కడ బ్రిటిష్ మ్యూజియంలో జాన్ ఎడ్వర్డ్ గ్రేను కలిసి, ఆడుబోన్ తో తన పరిచయాన్ని పునరుద్ధరించుకున్నాడు. 1828 లో అతని కుటుంబం రోంలో స్థిరపడింది. ఇటలి లో అతను పలు వైజ్ఞానిక కాంగ్రెస్ లను స్థాపించి, అమెరికన్ మరియు ఐరోపా పక్షి శాస్త్రాలు మరియు ప్రకృతి చరిత్ర యొక్క ఇతర శాఖల గురించి విస్తృతంగా ప్రసంగాలు ఇవ్వడం మరియు వ్రాయడం చేశాడు.[1] 1832 - 1841 మధ్యలో, ఇటలీలోని జంతువుల గురించి Iconografia della Fauna Italica అనే పుస్తకాన్ని బొనపార్టే ప్రచురించాడు. ఫిలడెల్ఫియా మరియు ఇటలీలోని పక్షి రకాలను పోల్చి, Specchio Comparativo delle Ornithologie di Roma e di Filadelfia (పిసా, 1827) అనే ఒక పుస్తకాన్ని కూడా అతను ప్రచురించాడు.[1]

1849లో అతను రోమన్ శాసనసభకు ఎన్నికయ్యాడు. రోమన్ రిపబ్లిక్ సృష్టిలో పాల్గొన్నాడు. జస్పెర్ రిడ్లీ ప్రకారం, శాసన సభ మొదటి సారిగి సమావేశమయినప్పుడు: "విటేర్బో యొక్క సభ్యుడు అయిన కార్లో బొనపార్టే పేరును పిలిచినప్పుడు, అతను గణతంత్రం వర్దిల్లాలి అని స్పందించాడు" (Viva la Repubblica! ).[2] అతని కజిన్ అయిన లూయి నెపోలియన్ రోం కు వ్యతిరేకంగా 40,000 ఫ్రెంచ్ సైనికులను పంపినప్పుడు, రోమ్ రక్షణలో పాల్పంచుకున్నాడు. జూలై 1849లో రిపబ్లికన్ సైన్యం ఓడిపోయినప్పుడు, అతను రోమ్ ను వదిలి వెళ్ళాడు. అతను మార్సేల్లెస్ కు చేరుకున్నాడు కాని లూయి నెపోలియన్ అతన్ని దేశం వదిలి వెళ్లవలసినదిగా ఆదేశించాడు. తన రాజకీయ నమ్మకాలను ధృవీకరించే విధముగా మరుసటి సంవత్సరం విల్సన్స్ బర్డ్-అఫ్-పారడైస్కు గణతంత్ర ఆలోచనకు గౌరవాత్మకంగా (Cicinnurus respublica ) అని పేరు పెట్టాడు.

అతను ఇంగ్లాండ్ కు పయనమై, బిర్మింగ్హాంలోని బ్రిటిష్ అసోసియేషన్ సమావేశానికి హాజరయ్యాడు. తరువాత అతను దక్షిణ స్కాట్ లాండ్ లోని సర్ విల్లియం జార్డైన్. ఆ తరువాత ప్రపంచంలో ఉన్న అన్ని పక్షులను పద్ధతి ప్రకారం విభజించే పనిని చేయడం ప్రారంభించాడు. సేకరణలను అధ్యయనం చేయడం కొరకు, ఐరోపాలోని మ్యూజియంలను సందర్శించాడు. 1850లో ,[1] ఫ్రాన్స్ కు తిరిగి రావడానికి అతనికి అనుమతి లభించడంతో, తన జీవితాంతం పారిస్ లోనే ఉండిపోయాడు. 1854లో, అతను Jardin des Plantesకు దర్శకుడు అయ్యాడు.[1] 1858లో అతను రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క సభ్యునిగా కూడా ఎన్నికయ్యాడు. అతను వ్రాసిన Conspectus Generum Avium యొక్క మొదటి వాల్యూంను తన మరణానికి ముందు ప్రచురించాడు. రెండవ భాగము హీర్మాన్ ష్లీజ్ ఎడిట్ చేశాడు.

లూసిన్ దంపతులకు కార్డినల్ లూసన్ బొనపార్టేతో సహా పన్నెండు మంది పిల్లలు ఉన్నారు.

రచనలు[మార్చు]

ఎం డీ పోవంస్ తో సహా, అతను పావురాలు మరియు చిలుకలలో ఒక దాని గురించిన ఒక వివరణాత్మక పట్టికను తయారుచేయగా, అవి అతని మరణాంతరం ప్రచురించబడ్డాయి.

అతని ప్రచురింపబడిన పుటలలో:

  • “అబ్సర్వేషన్స్ ఆన్ థ నామెంక్లేచర్ ఆఫ్ విల్సన్స్"ఆర్నిథాలజీ,""ఫిలడెల్ఫియా అకాడెమీ వారి జర్నల్l
  • “సినోప్సిస్ ఆఫ్ ది బర్డ్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్,” యాన్నల్స్ ఆఫ్ థ లైసియం ఆఫ్ న్యూ యార్క్
  • “కాటలాగ్ ఆఫ్ థ బర్డ్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్,” కంట్రిబ్యూషన్స్ ఆఫ్ థ మాక్లూరియాన్ లైసియం ఆఫ్ ఫిలడెల్ఫియా

సూచనలు[మార్చు]

సమగ్ర విషయాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 మూస:Cite Appletons'
  2. జాస్పర్ రిడ్లీ, గారిబాల్డీ , వాకింగ్ ముద్రణాలయం (1976), పుట. 268.

గ్రంథ సూచిక[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  • Thomas, Phillip Drennon (2002). "The emperor of nature: Charles-Lucien Bonaparte and his world. [Review of: Stroud, P.T. The emperor of nature: Charles-Lucien Bonaparte and his world. Philadelphia: U. of Pennsylvania Pr., 2000]". Journal of American history (Bloomington, Ind.). 88 (4). p. 1517. PMID 16845779.
  • స్త్రౌడ్ , పాట్రీషియా టైసన్ - థ ఎంపరర్ ఆఫ్ నేచర్. చార్లెస్ -లూసిన్ బొనపార్టే ఎండ్ హిస్ వరల్డ్ ISBN 0-8122-3546-0
  • మియర్న్స్ , బార్బరా మరియు రిచార్డ్ - బియోగ్రఫీస్ ఆఫ్ బర్డ్ వాచర్స్ ISBN 0-12-487422-3
  • రిడ్లీ , జాస్పర్ - గారిబాల్డీ వైకింగ్ ముద్రణాలయం(1976)
  •  "Charles-Lucien-Jules-Laurent Bonaparte" . Catholic Encyclopedia. New York: Robert Appleton Company. 1913.

మూస:Start |-

| colspan="3" style="border-top: 5px solid #FFD700; text-align:center;" |

చార్లెస్ లూసిన్ బొనపార్టే
House of Bonaparte

Born: 24 May 1803 Died: 29 July 1857

|- ! colspan="3" style="background: #ACE777;" | Titles of nobility |- style="text-align:center;" |style="width:30%;" rowspan="1"|అంతకు ముందువారు
Lucien I | style="width: 40%; text-align: center;" rowspan="1"|Prince of Canino and Musignano
1840–1857 | style="width: 30%; text-align: center;" rowspan="1"|తరువాత వారు
Joseph |- |} మూస:Bonaparte family

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]