చార్‌ల్స్ విల్సన్ (రాజకీయవేత్త)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Charles Wilson
చార్‌ల్స్ విల్సన్ (రాజకీయవేత్త)

(Photo ca. 1995)


Member of the U.S. House of Representatives
from Texas's 2nd district
పదవీ కాలము
January 3, 1973 – October 8, 1996
ముందు John Dowdy
తరువాత Jim Turner

వ్యక్తిగత వివరాలు

జననం (1933-06-01) 1933 జూన్ 1
Trinity, Texas
మరణం 2010 ఫిబ్రవరి 10 (2010-02-10)(వయసు 76)
Lufkin, Texas
రాజకీయ పార్టీ Democratic
జీవిత భాగస్వామి Barbara Alberstadt
వృత్తి Naval officer
Congressman

చార్‌ల్స్ నెస్బిట్ విల్సన్ (1933 జూన్ 1 - 2010 ఫిబ్రవరి 10), అమెరికాలో ఒక నావికా దళ అధికారి మరియు టెక్సాస్ లోని రెండవ కాంగ్రెషనల్ జిల్లా నుండి 12 సార్లు ఎన్నికైన మాజీ డెమోక్రటిక్ యునైటెడ్ స్టేట్స్ రెప్రెసెంటేటివ్.

CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సి యొక్క రహస్య సైనిక చర్య ఆపరేషన్ సైక్లోన్‌కు అమెరికన్ కాంగ్రెస్ మద్దతు తెలపడంలో ముఖ్యపాత్ర పోషించినందుకు అతను చరిత్రపుటల్లోకి యెక్కాడు. రీగన్ ప్రభుత్వ హయాంలో, ఈ రహస్య సైనిక చర్యకు ప్రభుత్వం స్ట్రింగర్ విమాన క్షిపణుల లాంటి సైనిక ఉపకరణాలనీ, ప్రత్యేక కార్యకలాపాల విభాగం నుండి సైనిక అధికారులనీ అఫ్ఘనిస్తాన్‌లో జరుగుతోన్న సోవియట్ యుధ్ధంలో అఫ్ఘన్ ముజాహిదీన్‌లకు సరఫరా చేసింది. తెర వెనుకనుండి అతను చేసిన ప్రచారం, జార్జ్ క్రైల్ వ్రాసిన యథార్థ (కల్పితము కాని) పుస్తకం చార్లీ విల్సన్'స్ వార్‌ లోనూ మరియు దాని తర్వాత వచ్చిన టాం హాంక్స్ విల్సన్ పాత్ర పోషించిన చలనచిత్రానుసరణలోనూ కథాంశం.

బాల్యం మరియు నావికాదళ వృత్తి జీవితం[మార్చు]

టెక్సాస్ లోని ట్రినిటీలో ఒక చిన్న పట్టణంలో విల్సన్ జన్మించాడు. అక్కడే పబ్లిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసాక, 1951వ సంవత్సరంలో, ట్రినిటీ హై స్కూల్ నుండి పట్టభద్రుడైనాడు. టెక్సాస్‌లోని హంట్స్‌విల్లె లోని సాం హౌస్టన్ స్టేట్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నపుడు, యునైటెడ్ స్టేట్స్ నావల్ అకాడెమిలో నియుక్తుడైనాడు. అక్కడ ఆయన, కిందనుండి యెనిమిదవ స్థానం అర్జించి, 1956వ సంవత్సరంలో బాచిలర్ ఆఫ్ సైన్స్ పట్టా పుచ్చుకున్నాడు.[1] అకాడెమి చరిత్రలో అతి యెక్కువ అయోగ్యతలను పుచ్చుకున్నవారిలో, అతను రెండవ స్థానంలో నిలిచాడు.[2]

1956 నుండి 1960 వరకు, విల్సన్ యునైటెడ్ స్టేట్స్ నావికాదళంలో పనిచేసి, లెఫ్టినెంట్ స్థాయికి యెదిగాడు. సర్ఫేస్ ఫ్లీట్ ఆఫీసర్‌గా ఉన్న తర్వాతి నాలుగు యేళ్ళు, సోవియట్ యూనియన్ యొక్క అణుశక్తిని అంచనా వేసే ఇంటెలిజెన్స్ విభాగంలో భాగంగా అతన్ని పెంటగాన్ పంపారు.

రాజకీయ రంగ ప్రవేశం[మార్చు]

సిటీ కౌన్సిల్ సభ్యుడు అయిన చార్‌ల్స్ హజార్డ్‌కి వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా విల్సన్ మొదట రాజకీయరంగప్రవేశం చేసాడని ఊహాగానాలు ఉన్నాయి. విల్సన్ 13 యేళ్ళ వయసులో ఉండగా, అతని 14 యేళ్ళ కుక్క హజార్డ్ యొక్క పెరడులోనికి వెళ్ళింది. దానికి ప్రతీకార చర్యగా హజార్డ్ గాజుపెంకులను చితక్కొట్టి కుక్క ఆహారంలో పెట్టాడు. డానివల్ల కుక్క శరీరం లోపల అత్యంత ప్రమాదకరమైన రక్తస్రావం జరిగింది. రైతుబిడ్డ అయిఉండికూడా విల్సన్ 13 యేళ్ళ వయసులోనే, ద్రైవింగ్ లైసెన్స్ సంపాదించగలిగాడు. దానివల్ల, అతను 96 మంది వోటర్లను, ముఖ్యంగా పేద వాడలనుండి, యెన్నికల కేంద్రానికి తీసుకు వెళ్ళగలిగాడు. వారు కారు దిగేప్పటికి, అతను వారికి, "నాకు మీ వోటు ప్రభావితం చేయాలని లేదు, కానీ, ప్రస్తుత సభ్యుడు హజార్డ్ కావాలని నా కుక్కని చంపాడు...." అని మాత్రం చెప్పాడని అనుకుంటారు. హజార్డ్ 16 వోట్ల తేడాతో వోడిపోయాక, విల్సన్ అతని దగ్గరికి వెళ్ళి, ఇక కుక్కలకి విషం పెట్టడం మానేయమని ఉచిత సలహా ఇచ్చాడు.[3] విల్సన్ హజార్డ్ ఓడిపోయిన రోజుని, "అమెరికాతో ప్రేమలో పడ్డ రోజు"గా అభివర్ణించాడు. ఇదే సంఘటనను, చలనచిత్రం చార్లి విల్సన్'స్ వార్‌లో చిత్రీకరించడం జరిగింది.

బాల్యదశ వీడి పురుషుడిగా యెదిగాక, జాన్ F. కెన్నెడీ అధ్యక్ష పదవి పోటీ ప్రచారాం కోసం స్వచ్ఛందంగా పని చేసేందుకు వెళ్ళేంతవరకూ, విల్సన్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. 1960వ సంవత్సరంలో, నావికాదళం నుండి, నావికాదళ నిబంధనలకు వ్యతిరేకంగా 30 రోజుల సెలవు తీసుకుని తన పేరు తన సొంత జిల్లా నుండి టెక్సాస్ స్టేట్ రిప్రెజెంటేటివ్‌గా పోటీకి నమోదు చేసుకున్నాడు. నావికాదళ నిబంధనల ప్రకారం దళంలో పని చేసేవారు, క్రియాత్మకమైన విధులలో ఉన్నపుడు ప్రభుత్వ కార్యాలయంలో పని చేయకూడదు. అయితే, విల్సన్ తిరిగి నావికాదళంలో తన విధులకి హాజరైనపుడు, అతని కుటుంబమూ, అతని స్నేహితులూ అతని గెలుపు కోసం ఇల్లిల్లూ తిరిగి ప్రచారం చేసారు. 1961వ సంవత్సరంలో టెక్సాస్‌లోని ఆస్టిన్ కార్యాలయంలో అధికారం చేపట్టాడు.

తరువాతి 12 యేళ్ళు, విల్సన్ టెక్సాస్ లెజిస్లేచర్‌లో , వ్యాపార వర్గాలు అనుమానంగా చూసే, "లిబరల్ ఫ్రం లఫ్కిన్"గా పేరు సంపాదించాడు. అతను, ప్రయోజనాల క్రమబధ్ధీకరణకూ, మెడికేయిడ్ (వైద్య సాయం) కొరకూ, వృధ్ధులకు పన్ను మినహాయింపుల కొరకూ, ఈక్వల్ రైట్స్ అమెండ్‌మెంట్ (సమాన హక్కుల చట్ట సవరణ) కొరకూ, మినిమం వేజ్ బిల్ (కనీస వేతనాల చట్టం) కొరకూ పోరాడాడు. టెక్సాస్‌లోని అతికొద్ది మంది ప్రముఖ రాజకీయవేత్తలలో, ప్రొ-చాఇస్ (pro-choice = బిడ్డలను కనాలా వద్దా అనే విషయానికి సంబంధించిన స్త్రీహక్కు) కు మద్దతు తెలిపిన వారిలో విల్సన్ ఒకరు. వ్యక్తిగత జీవితానికి సంబంధించినంత వరకూ విల్సన్ లోకకంటకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యముగా, త్రాగుడు, మత్తుపదార్ధాల సేవనం (కొకేయిన్ ఉపయోగం), స్త్రీలోలత - ఈ దుర్గుణాలన్నీ అతనికి ఉండేవి. దానివల్ల అతనికి "గుడ్ టైం చార్లీ" అని పేరు పెట్టారు.

1972లో, విల్సన్ U.S. హౌస్ ఆఫ్ రెప్రెజెంటేటివ్స్‌కు, టెక్సాస్‌లోని రెండవ జిల్లా నుండి ఎన్నికయ్యి, తదుపరి జనవరి నెలలో బాధ్యతలు చేపట్టాడు. అతను 11 సార్లు తిరిగి ఎన్నిక కాబడ్డాడు, కానీ, నూట అయిదవ కాంగ్రెస్‌కు అతను తిరిగి ఎన్నికల అభ్యర్థి కాకపోవటం మూలాన, 1996 అక్టోబరు 8వ సంవత్సరం రాజీనామా చేసాడు.

నికరాగువాలో సోమోజ ప్రభుత్వానికి మద్దతు[మార్చు]

1970వ దశాబ్దపు చివర్లో, అతను నికరాగువాలోని మితవాద సోమొజా ప్రభుత్వానికి బలంగా మద్దతు తెలిపాడు. నియంతలు అతనికి లంచమివ్వడానికి చూసిన కారణంగా అతనికి సోమొజా పట్ల అభినందనభావం పెరిగిపోయింది.[4] సొమోజాను విల్సన్, U.S. చేత మోసపోయిన, విడిచిపెట్టబడిన మిత్రపక్షంగా చూసాడు. సోమోజా ప్రభుత్వాన్ని రక్షించడం కోసం విల్సన్, హౌస్ అప్రాప్రియేషన్స్ కమిటీలో, తెరవెనుక మద్దతు కూడగట్టే ప్రయత్నం గట్టిగా చేసాడు. ఒక సమయంలో, U.S. తిరిగి సోమోజాకు తన మద్దతు ఇవ్వకపోతే, ప్రెసిడెంట్ కార్టర్ యొక్క పనామా కనాల్ ట్రీటీను నీట ముంచే ప్రయత్నం కూడా చేసాడు.[5]

విల్సన్ తర్వాత ఎడ్ విల్సన్‌కూ (CIA ఏజెంట్), సొమోజాకూ మధ్య ఒక సమావేశం యేర్పాటు చేసాడు. దాని పరిణామంగా ఎడ్ విల్సన్, సొమోజాకు మద్దతుగా పోరాడడానికి 1000 మంది మాజీ-CIA కార్యకర్తల బలగాన్ని తయారు చేస్తానని చెప్పాడు. విల్సన్ ప్రేయసి టీనా సిమన్స్‌తో సొమోజా అక్రమ సంబంధం పెట్టుకున్న కారణంగా, ఆ తర్వాత ఆ సమావేశం నిష్ప్రయోజనమయ్యింది. 1000 మంది బలగం కోసం, సోమొజా 100 మిలియన్ డాలర్లు ఇవ్వనందుకు ఒప్పందం వీగిపోయింది.[6]

సోవియెట్-ఆఫ్ఘన్ యుద్ధం[మార్చు]

1980లో విల్సన్ సోవియట్ యూనియం ఆక్రమించుకున్న ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోతున్న శరణార్ధుల గురించి కాంగ్రెస్ నివేదికలపై అసోసియేటెడ్ ప్రెస్‌కు సంబంధించిన అధికారిక సమాచారం చదివాడు. ఆఫ్ఘాన్ పౌరుల మధ్య జరిగిన అంతర్యుధ్ధంలో, కమ్యూనిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అధికారాన్ని హస్తగతం చేసుకుని, ముజాహిదీన్‌ల ప్రతిఘటనను అణచివేయడానికి సోవియట్ యూనియన్ సాయం కోరింది. జీవితచరిత్రకారుడు జార్జ్ క్రైల్ III ప్రకారం, విల్సన్ హౌస్ అప్రాప్రియేషన్స్ కమిటీలో "తెరచాటు ఉపకల్పనలను" తయారు చేసే సిబ్బందిని పిలిచి ఆఫ్ఘనిస్తాన్‌కు కేటాయించిన నిధులను రెండింతలు చేయమని కోరాడు. విల్సన్ అప్పుడే డిఫెన్స్‌కు సంబంధించిన హౌస్ అప్రాప్రియేషన్స్ సబ్‌కమిటీకు (CIA కార్యకలాపాలకు నిధులు సమకూర్చే కమిటీకు) అతని పేరు ప్రతిపాదించడం జరిగింది కాబట్టి, అతని అభ్యర్ధన కార్యరూపం దాల్చింది.[7]

ఆఫ్ఘాన్ సైనికచర్యలకు CIA కేటాయింపులు పెంచడం అతనికి ఇది ఆఖరిసారి కాదు. 1983లో, అతను అదనంగా 40 మిలియన్ డాలర్లు, మరో 7 మిలియన్ డాలర్లు పొందాడు, ఆ డబ్బు మిల్ మి-24 హెలికాప్టర్లను కూల్చే యుధ్ధవిమానాలకు కేటాయించబడింది.[8] కాంగ్రెస్‌ను డబ్బుకోసం పైరవీ చేయడం CIA విధానానికి విరుధ్ధం అయినప్పటికీ, CIA అధికారి గస్ట్ అవ్రాకొతోస్ ఆ తరువాతి సంవత్సరం మరో 50 మిలియన్ డాలర్లను కేటాయించమంటూ నేరుగా విల్సన్ దగ్గరికి వచ్చాడు. విల్సన్ ఒప్పుకుని, కాంగ్రెస్‌ను వప్పించాడు : "యుధ్ధం చేయాలన్న వీళ్ళ నిర్ణయంతో U.S.కు యెలాంటి సంబంధం లేదు, కానీ, వీళ్ళని ఆయుధాలతో కాక, రాళ్ళతో యుధ్ధం చేయనిస్తే, చరిత్ర మనల్ని దూషిస్తుంది." [9] తరువాత, విల్సన్ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేసరికి, ఉపయోగించబడని పెంటగాన్ డబ్బు, 300 మిలియన్ డాలర్లు ఆఫ్ఘన్లకు ఇవ్వడంలో సఫలీకృతుడయ్యాడు.[10] ఆ విధంగా విల్సన్, ఆఫ్ఘాన్ ముజాహిదీన్లకు U.S. మద్దతు ఇచ్చే స్థాయిని నేరుగా ప్రభావితం చేసాడు. రహస్య సైనిక చర్య సఫలీకృతం కావడానికి కారణం, పక్షపాత ధోరణులు లేకపోవటం ఇంకా నష్టపరిచే ఉరుపులు లేకపోవటమని విల్సన్ చెప్పాడు.[11] ఒక వివాదాస్పద నిర్ణయంలో, మైకేల్ పిల్స్‌బరి, ఒక సీనియర్ పెంటగాన్ అధికారి, విల్సన్ కేటాయించిన నిధులని స్ట్రింగర్ క్షిపణులను ఆఫ్ఘాన్ ప్రతిఘటనకోసం ఇవ్వడానికి ఉపయోగించాడు.

ఆఫ్ఘాన్ తిరుగుబాటుదారులకు U.S. ప్రభుత్వం నుండి మద్దతు, ఆయుధసామగ్రి పొందడంలో జోన్ హెర్రింగ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆమె విల్సన్‌ను పాకిస్తానీ నాయకత్వాన్ని కలవడానికి వప్పించింది. వారిని కలిసాక విల్సన్‌ను వారు పాకిస్తాన్ లో ఉన్న ఆఫ్ఘాన్ శరణార్ధుల శిబిరానికి సోవియట్లు ఆఫ్ఘాన్ ప్రజలపై చేసిన ఆకృత్యాలను తన కళ్ళతో తానే చూడడం కోసం తీసుకువెళ్ళారు. విల్సన్ తరువాత, "నా జ్ఞాపకాలలో ఎప్పటికీ నన్ను గాయపరిచే అనుభవం - ఆ ఆసుపత్రులలో పర్యటించటం, ముఖ్యంగా సోవియట్లు హెలికాప్టర్ల నుండి జారవిడిచిన మైన్ల వల్ల చేతులు తెగిపోయిన పిల్లలని చూడటం..." అని ఆ పర్యటన గురించి చెప్పాడు. "అది నిర్ణయాత్మకమైన ఘడియ కావచ్చు....అది వచ్చే 10, 12 సంవత్సరాలలో నా జీవితంపై పెను ప్రభావం చూపింది, ఎందుకంటే, నేను ఆ ఆసుపత్రులలోనుండి ఒక స్థిర నిశ్చయంతో బయటికి వచ్చాను - నా ఊపిరి ఉన్నంత వరకూ, నేను కాంగ్రెస్ సభ్యుడిగా ఉన్నంత వరకూ, సోవియట్లు తమ తప్పిదాలకు తగిన విధంగా శిక్షింపబడటం కోసం నేను చేయగలిగినది అంతా చేస్తాను." 2008లో, విల్సన్ "నేను ఆఫ్ఘనిస్తాన్ విషయంలో తలమునకలయి ఉన్నాను, ఎందుకు అంటే, నేను అక్కడికి వెళ్ళాను, సోవియట్లు యేమి చేస్తున్నారో చూసాను. శరణార్ధుల శిబిరాలని కూడా చూసాను." [12]

అతని కృషికి, విల్సన్‌కు "హానర్డ్ కలీగ్ అవార్డ్" CIA నుండి లభించింది. ఆ బిరుదు తీసుకున్నవారిలో అతను మొదటి పౌరుడు అయ్యాడు.[13] కానీ, విల్సన్ పాత్ర వివాదాస్పదంగా ఉండినది, ఎందుకంటే, చాలా వరకు అతను చేసిన సాయం, ఇస్లామిస్ట్ తీవ్రవాది, గుల్బుద్ధిన్ హెక్మాత్యార్‌కు లభించింది, అతను ఇప్పుడు ఒక జ్యేష్ఠ (senior) టాలిబాన్ నాయకుడు, మరియు అమెరికా శత్రువైన అల్-కాయెదా మద్దతుదారుడు.[14]

ఆఫ్ఘనిస్తాన్ నుండి వైదొలగాలన్న సోవియట్ యూనియం నిర్ణయం, అఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకోవడం ఒక తప్పుగా సోవియట్ యూనియన్ ప్రకటించడం, విల్సన్ హౌస్ ఆఫ్ రెప్రెసెంటేటివ్స్ సభలో సోవియట్ నాయకత్వాన్ని మెచ్చుకునేలా చేసింది. మునుపటి యుగోస్లావియాను జనవరి 1993లో అయిదు రోజులు పర్యటించాక, అతను బోస్నియా యుధ్ధంలో యునైటెడ్ స్టేట్స్ పాత్రను సమర్ధించాడు; పర్యటననుండి వెనక్కు వచ్చాక, అతను బోస్నియా పై ఉన్న ఆయుధనిషేధాన్ని యెత్తివేయమని క్లింటన్ ప్రభుత్వాన్ని కోరాడు : "ఇది మంచి చెడుల మధ్య జరిగే యుధ్ధం, మనం దీన్ని అమెరికనైజ్ చెయడం ఇష్టపడకపోతే, ఇంక మరి దేనిని అమెరికనైజ్ చేస్తాము? మనం యేదో ఒక దాని కోసం నిలబడాలి." [15]

మాదకద్రవ్యాలు మరియు మద్యపాన వినియోగం[మార్చు]

1980లో, లాస్ వేగాస్‌లోని సీజర్స్ పాలేస్‌లో కొకేయిన్ సేవించాడని విల్సన్ మీద ఆరోపణలు వచ్చాయి. జుస్టీస్ డిపార్ట్‌మెంట్ వకీలు రుడోల్ఫ్ గ్విలాని చేసిన దర్యాప్తు సాక్ష్యం లేని కారణంగా ముగించబడింది.[16] లిజ్ విక్కర్‌షం దర్యాప్తు బృందానికి తాను చార్లీ కొకేయిన్ ఉపయోగించడాన్ని ఒక్క సారి మాత్రం కేమన్ ఐలాండ్స్‌లో చూసానని చెప్పింది; కానీ అది U.S. చట్టపరిధిలో లేదు.[17] "ది చార్లీ విల్సన్ రియల్ స్టోరీ"లో విల్సన్ తాను 1980 వేసవిలో లాస్ వేగాస్ వెళ్ళాననీ తేటతెల్లం చేస్తాడు, అక్కడ ఒక వేడి తొట్టిలో, ఇద్దరు దిగంబర నృత్యం చేసే స్త్రీలకు సంబంధించిన ఒక అనుభవాన్ని గుర్తుకు చేసుకుంటాడు.

The girls had cocaine, and the music was loud. It was total happiness. And both of them had ten long, red fingernails with an endless supply of beautiful white powder.... The feds spent a million bucks trying to figure out whether, when those fingernails passed under my nose, did I inhale or exhale, and I ain't telling.

— Charlie Wilson[1]

2007లో అతని కొకేయిన్ వాడకం పై వచ్చిన ఆరోపణలను గురించి ప్రశ్నించగా విల్సన్, "దానికి సమాధానం ఎవరికీ తెలీదు, నేను కూడా మీకు చెప్పట్లేదు" అని పునరుద్ఘాటించాడు.[18]

పాకిస్తాన్‌కు మొదటి సారి పర్యటించే ముందు, వాషింగ్టన్ DC యొక్కకీ బ్రిడ్జ్ మీద, ఒక తాగి గుద్దివేసి పారిపోయే రోడ్డు ప్రమాదం కేసులో చిక్కుకున్నాడు. ఒక సాక్షి, తాను విల్సన్ యొక్క లింకన్ కాంటినెంటల్ ఒక మాజ్దాను గుద్దిందని, అతని లైసెన్స్ ప్లేటును తాను చదివాననీ సాక్ష్యం చెప్పింది. కానీ విల్సన్ ఎప్పటికీ శిక్షింపబడలేదు.[17]

One time I had barely gotten out of a DUI. They made me go to a class, at 7:30 on Saturday mornings, about not drinking whiskey.

— Charlie Wilson[19]

విల్సన్ అభిమానులు అతనిని, ది ట్రూ స్టోరి ఆఫ్ చార్లీ విల్సన్ అనే, హిస్టరీ చానెల్ డాక్యుమెంటరీలో అతను ఆ రాత్రి ఆఫ్ఘాన్ ప్రజల బాధలు చూసిన బాధలో తాగాడని వెనకేసుకొచ్చారు. ఆ ఘటన చలనచిత్రం చార్లీ విల్సన్'స్ వార్‌లో చిత్రీకరించకపోవడాన్ని చూసి, చార్లి విల్సన్ ఊపిరి పీల్చుకుని, "నేను తేలిగ్గా తప్పించుకున్నాను" అని చమత్కరించాడు.[17]

విరమణ[మార్చు]

టెక్సాస్‌లోని లుఫ్కిన్‌లో శేషజీవితం గడపడం కోసం, విల్సన్ 1997లో కాంగ్రెస్‌నుండి వైదొలిగాడు. 1980లో ఒక పార్టీలో చూసిన, బార్బారా అల్బర్‌స్టాడ్ అనే బాలే నృత్యకారిణిని ఫిబ్రవరి 1999లో వివాహమాడాడు.

అవయవాల మార్పిడి నిరీక్షణ పట్టికలో, రెండు నెలలు ఉన్నాక, సెప్టెంబరు 2007లో, విల్సన్ 35 యేళ్ళ దాత యొక్క గుండెను పొందాడు. యేళ్ళపాటు అతిగా తాగడం అతని గుండె మీద భారాన్ని మోపిందేమో, 1985లో ఒక వైద్యుడు, నీ జీవితంలో ఇంకా 18 నెలల కాలం మిగిలి ఉందని చెప్పాడు.[20]

మరణం[మార్చు]

2010 ఫిబ్రవరి 10 తేదీన, పడిపోయిన విల్సన్‌ను లుఫ్కిన్‌లోని లుఫ్కిన్ మెమోరియల్ ఆసుపత్రికి తరలించాక, ఆ ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచాడు. అతని గుండె ఆగిపోవటం జరిగింది.[21] 12 : 16 P.M. సెంట్రల్ టైంకు అతను చనిపోయాడని ప్రకటించారు.[22][23] U.S. డిఫెన్స్ సెక్రెటరి రాబర్ట్ గేట్స్, "ఒక ధైర్యవంతుడైన, స్థిరనిశ్చయం కలిగిన మనిషి చరిత్ర గతిని మార్చగలడని నిరూపించిన ఒక అసాధారణ దేశ భక్తుడిని అమెరికా కోల్పోయింది" అని అన్నారు.[24][25]

విల్సన్ 2010 ఫిబ్రవరి 23 తేదీన, పూర్తి సైనిక వందనాలతో, అర్లింగ్టన్ నేషనల్ సిమిటరిలో గ్రేవ్‌సైడ్ సర్వీస్ పొందాడు. (graveside service = సంప్రదాయికమైన వీడ్కోలు ఉత్సవం) [26]

సాంస్కృతిక సూచనలు[మార్చు]

సోవియట్ వ్యతిరేక ఆఫ్ఘాన్ యుధ్ధానికి నిధుల కేటాయింపు పెంచడానికి విల్సన్ చేసిన సఫలీకృత ప్రయత్నాలను జార్జ్ క్రైల్ III రాసిన పుస్తకం, చార్లీ విల్సన్'స్ వార్ : ది ఎక్స్‌ట్రా ఆర్డినరి స్టోరి ఆఫ్ ది లార్జెస్ట్ కొవెర్ట్ ఆపరేషన్ ఇన్ హిస్టరి (2003) లో, వెల్లడించబడింది. ఆ పుస్తకపు రూపంతరంగా 2007లో నిర్మించబడిన చలనచిత్రంలో, విల్సన్ పాత్రను టాం హాంక్స్ పోషించాడు.[27] ఆ చిత్రం అతన్ని, అందమైన స్త్రీల సాంగత్యాన్ని కోరుకునే రాజకీయ లౌక్యం తెలియని మహాసాహసికుడిగా చిత్రీకరించింది.[28]

స్టీవ్ కోల్ వ్రాసిన ఘోస్ట్ వార్స్: ది సీక్రెట్ హిస్టరి ఆఫ్ ది CIA, ఆఫ్ఘనిస్తాన్, అండ్ బిన్ లాడెన్, ఫ్రం ది సోవియట్ ఇన్వేషన్ టు సెప్టెంబర్ 10, 2001 (2005)లో విల్సన్‌ది ఆవశ్యకమైన పాత్ర.

2007 డిసెంబరు 27 తేదీన, హిస్టరి చానెల్, కాంగ్రెస్‌మన్ చార్లీ ఆఫ్ఘాన్ యుధ్ధ ప్రయత్నాలపైనా అతని వ్యక్తిగత జీవితంపైనా నిర్మించబడ్డ ది ట్రూ స్టోరి ఆఫ్ చార్లీ విల్సన్, అనే రెండు గంటల డాక్యుమెంటరీని ప్రసారం చేసింది.

వీటిని కూడా చూడండి[మార్చు]

 • ప్రత్యేక కార్యక్రమాల విభాగం
 • మైఖేల్ జి. వికేర్స్
 • గస్ట్ అవ్రకోతోస్

సూచికలు[మార్చు]

 1. 1.0 1.1 క్రైల్, జార్జ్. చార్లీ విల్సన్'స్ వార్ : ది ఎక్స్‌ట్ర ఆర్డినరి స్టోరి ఆఫ్ ది లార్జెస్ట్ కొవర్ట్ ఆపరేషన్ ఇన్ హిస్టరి. న్యూ యార్క్. అట్లాంటిక్ మంత్లీ ప్రెస్. 2003. p. 26. ISBN 0-87113-854-9
 2. ""Charlie Wilson's War Against Convention Started at USNA," ''The Annapolis Capital'', December 30, 2007". Hometownannapolis.com. Retrieved 2010-02-11. Cite web requires |website= (help)
 3. Crile, George (2004). Charlie Wilson's War. Atlantic Monthly Press. pp. 111–112. ISBN 0802141242.
 4. క్రైల్, 36.
 5. క్రైల్, 30-36.
 6. క్రైల్, 38.
 7. "Eduardo Real: Zbigniew Brzezinski, Defeated by his Success". Dangeroustravel.blogspot.com. Retrieved 2010-02-11. Cite web requires |website= (help)
 8. క్రైల్, 214–5.
 9. క్రైల్, 259–62.
 10. క్రైల్, 409–13.
 11. వాల్ స్ట్రీట్ జర్నల్, డిసెంబర్ 28, 2007, p. W13
 12. ""సోవియట్లకు వ్యతిరేకంగా పోరాడిన ఆఫ్ఘాన్ యుధ్ధవీరులను సమర్ధించిన US కాంగ్రెస్‌మన్ ఇకలేరు"". మూలం నుండి 2010-02-12 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-08-23. Cite web requires |website= (help)
 13. "పుస్తకంపై సంతకం చేసేపుడు విల్సన్ ఆఫ్ఘన్ యోధులను సాయుధులను చేసే ప్రయత్నాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు". లుఫ్కిన్ డైలీ న్యూస్, నవంబర్ 11, 2003 Archived 2007-11-20 at the Wayback Machine.
  వింత్రోప్. లిన్ "http://"వెబ్.ఆర్ఖీవ్.ఆర్గ్/వెబ్/*/http://www.లుఫ్కిన్డైలీన్యూస్.com/hp/కంటెంట్/రీజియన్/ETటుడే/cww/స్టోరీస్/బుక్_సైనింగ్.html పుస్తకం సంతకం చేసేపుడు, విల్సన్ ఆఫ్ఘాన్ యోధులను సాయుధులుగా చేసేందుకు చేసిన ప్రయత్నాన్ని తలుచుకున్నారు)". (నవంబర్ 11, 2003) ది లుఫ్కిన్ డైలీ న్యూస్ . ఫిబ్రవరి 11, 2010న ఇంటర్నెట్ ఆర్ఖీవ్స్ వేబాక్ యంత్రం సహాయంతో పునరుధ్ధరించబడినది.
 14. బెర్గన్, పీటర్, హోలి వార్ Inc ., ఫ్రీ ప్రెస్, (2001), p.67
 15. ఫిలిప్ D. డంకన్ అండ్ క్రిస్టైన్ C. లారెన్స్, "కాంగ్రెషనల్ క్వార్టర్‌లి్'స్ పాలిటిక్స్ ఇన్ అమెరికా 1996: ది 104త్ కాంగ్రెస్", CQ ప్రెస్, 1996
 16. 22 డిసెంబర్ 2007 చార్లీ విల్సన్, స్టార్ ఆఫ్ వార్, చలనచిత్రం నాకు న్యాయం చేసింది అన్నాడు డల్లాస్‌న్యూస్.కాం '
 17. 17.0 17.1 17.2 చార్లీ విల్సన్'స్ వార్ చేసింగ్‌ది్‌ఫ్రాగ్.కాం
 18. 22 డిసెంబర్ 2007 ది రియల్ చార్లీ విల్సన్ ABC న్యూస్
 19. Tom Hanks and Charlie Wilson Interview Grant, Meg. Readers Digest
 20. జార్జ్ క్రైల్, చార్లీ విల్సన్'స్ వార్ , అట్లాంటిక్, న్యూ యార్క్, 2002, page 382
 21. మార్టిన్, డౌగ్లస్. "చార్లీ విల్సన్, టెక్సాస్ కాంగ్రెస్‌మన్ లింక్డ్ టు ఫారెన్ ఇంట్రీగ్, డైస్ ఎట్ 76" (ఫిబ్రవరి 10, 2010) ది న్యూ యార్క్ టైంస్. ఫిబ్రవరి 10, 2010న పునరుద్ధరించబడింది.
 22. "చార్లీ విల్సన్ డైస్ Archived 2016-02-08 at the Wayback Machine." (ఫిబ్రవరి 10, 2010) KTRE . ఫిబ్రవరి 10, 2010న పునరుద్ధరించబడింది.
 23. O'Rourke, Breffni (February 11, 2010). "Charlie Wilson, Congressman Who Helped Drive Soviets Out Of Afghanistan, Is Dead". rferl.com. Retrieved February 22, 2010. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 24. Bone, James (February 12, 2010). "Death of 'Goodtime Charlie' Wilson, the hot tub heretic who played with history". London: The Times. Retrieved February 22, 2010. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 25. "Editorial: Charlie Wilson was a colorful, consequential Texan". The Dallas Morning News. February 11, 2010. Retrieved February 22, 2010. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 26. "Memorial set for former Texas Rep. Charlie Wilson". The Dallas Morning News. February 11, 1010. Retrieved February 22, 2010. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 27. ""Sticking to His Guns: Charlie Wilson: The Wild Card Image Was The Real Deal", By Peter Carlson, ''The Washington Post'', December 22, 2007". Washingtonpost.com. December 22, 2007. Retrieved 2010-02-11. Cite news requires |newspaper= (help)
 28. "చార్లీ విల్సన్'స్ విక్టరి - ది డెమోక్రాట్ హూ హెల్ప్డ్ విన్ ది కోల్డ్ వార్"

బాహ్య లింకులు[మార్చు]

మూస:CongLinks

Unrecognised parameter

మూస:TXHouseSuccession box మూస:TXHouseSuccession box

Unrecognised parameter

మూస:TXSenateSuccession box

Unrecognised parameter

మూస:USRepSuccession box

మూస:Cold War