చింతామణ్ గోవింద్ పండిట్
| ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ చింతామణ్ గోవింద్ పండిట్ | |
|---|---|
| జననం | 1895 జూలై 25 భారతదేశం |
| మరణం | 1991 సెప్టెంబరు 7 (వయసు: 96) భారతదేశం |
| వృత్తి | వైరాలజిస్ట్ |
| ప్రసిద్ధి | వ్యాధికారకాల అధ్యయనం |
| పురస్కారాలు | పద్మ భూషణ్ పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ పద్మశ్రీ పురస్కారం |
చింతామణ్ గోవింద్ పండిట్ (1895 జూలై 25 - 1991 సెప్టెంబరు 7), ఒక భారతీయ వైరాలజిస్ట్, రచయిత. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వ్యవస్థాపక డైరెక్టర్. ఆయన 1922లో లండన్ విశ్వవిద్యాలయం నుండి తన డాక్టరల్ డిగ్రీని పొందాడు, చెన్నైలోని కింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ డైరెక్టర్ గా పనిచేసాడు, 1948లో ఈ సంస్థ స్థాపించబడినప్పుడు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వ్యవస్థాపక డైరెక్టర్ గా వ్యవహరించాడు.[1] 1964లో పదవీ విరమణ చేసిన తరువాత, ఆయన కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ఎమెరిటస్ శాస్త్రవేత్తగా నియమించబడ్డాడు.[1]
ఆయన, అనేక వ్యాసాలు రాయడంతో పాటు, ఇండియన్ రీసెర్చ్ ఫండ్ అసోసియేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అనే రెండు పుస్తకాలు ప్రచురించాడు.[2][3][4] ఆయన 1991 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసాడు. ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ ఎన్నికైన ఫెలో (1939), నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఇండియా) వ్యవస్థాపక ఫెలో కూడా.
1943లో చింతామణ్ గోవింద్ పండిట్ ను ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ (OBE) గా నియమించారు. 1956లో ఆయన నాల్గవ అత్యున్నత భారతీయ పౌర పురస్కారం పద్మశ్రీ అందుకున్నాడు.[5] విజ్ఞాన శాస్త్రానికి ఆయన చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం 1964లో ఆయనకు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ ప్రదానం చేసింది.[6]
1991 సెప్టెంబరు 7న ఆయన మరణించిన తరువాత, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆయన గౌరవార్థం డాక్టర్ సి. జి. పండిట్ నేషనల్ చైర్ అనే విశిష్ట శాస్త్రవేత్త చైర్ ని ఏర్పాటు చేసింది.[7]
మూలాలు
[మార్చు]- 1 2 "Deceased Fellow". Indian National Science Academy. 2016. Archived from the original on 13 August 2016. Retrieved 15 March 2016.
- ↑ Gerald Hoff (2012). Diseases of Amphibians and Reptiles. Springer Science & Business Media. pp. 511 of 784. ISBN 9781461593911.
- ↑ Chintaman Govind Pandit (1961). Indian Research Fund Association and Indian Council of Medical Research, 1911-1961; fifty years of progress. Indian Council of Medical Research. p. 94. ASIN B0007JITFM.
- ↑ Pandit, Chintaman G.; Rao, K. Someswara (1960). Nutrition in India. Indian Council of Medical Research. ASIN B007Q8AKZY.
- ↑ "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2016. Archived from the original (PDF) on 15 October 2015. Retrieved 3 January 2016.
- ↑ "Investiture Ceremony" (PDF). Government of India. 1964. Retrieved 15 March 2016.
- ↑ "Dr. C. G. Pandit National Chair" (PDF). Indian Council of Medical Research. 2016. Archived from the original (PDF) on 16 March 2016. Retrieved 15 March 2016.